amp pages | Sakshi

ఆస్తి కోసమే రెండు హత్యలు

Published on Fri, 07/27/2018 - 14:43

తుర్కపల్లి(ఆలేరు) : ‘మాయమైపోతున్నడమ్మా మనిషన్న వాడు.. మచ్చుకైన లేడు చూడు మనవత్వం ఉన్న వాడు’ అని ఓ కవి అన్న మాట నూటికి నూరుపాళ్లు నిజమనిపిస్తుందని ఈ ఘాతుకాన్ని చూస్తే. ఆస్తి కోసం మానవత్వం మరిచి రక్తం పం చుకుపుట్టిన అన్నను, భుజాల మీద ఎత్తుకుని పెం చిన నాన్నను అతికిరాతకంగా హత్య చేశాడు. ఆస్తి ని దక్కించుకునేందుకు వరుస హత్యలు చేస్తున్న నిందితుడిని గురువారం పోలీసులు అరెస్ట్‌ చేశా రు.

హత్యలు చేయడానికి గల కారణాలను డీసీపీ రామచంద్రారెడ్డి విలేకరులకు వెల్లడించారు.తుర్కపల్లి మండలం గొల్లగూడెం పం చాయతీ పరిధిలోని మర్రికుంటతండాకు చెందిన ధారవత్‌ జాలంనాయక్‌ (60) జనగామ జిల్లా నర్మెట్ట మండలం మలక్‌పేటతండాకు చెందిన సుగుణను మూడు దశాబ్దాల క్రితం వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు మగపిల్లలు భిక్షపతి, నర్సింహనాయక్‌ ఉన్నారు.

కొద్దిరోజులకు సుగుణ ఆరోగ్య పరిస్థితి బాగులేకుంటే తన సొంతచెల్లెలు లక్ష్మీని తన భర్త జాలం కిచ్చి వివాహం చేసింది. లక్ష్మికి కూడా ఓ కొడుకు నరేందర్‌నాయక్‌ పుట్టా డు. కొన్నేళ్లకు సుగుణ ఆరోగ్య పరిస్థితి కూడా మెరుగుపడింది. క్రమంగా లక్ష్మిపై జాలం నిర్లక్ష్యం చేశాడు. దీంతో లక్ష్మి తండాలోనే వేరుగా ఉందా మని, మరో ఇల్లు కట్టుకుందామని జాలంకు చెప్పగా సహకరించకలేదు. దీంతో లక్ష్మి తన తల్లిగారింటికి (మలక్‌పేట తండాకు) కొడుకు నరేందర్‌నాయక్‌ను తీసుకుని వెళ్లిపోయింది.

ఇష్టం లేని పెళ్లి చేసుకున్నాడని.. 

జాలంకు ఉన్న 12 ఎకరాల పొలాన్ని పెద్ద భార్య కొడుకు భిక్షపతినాయక్, నర్సింహనాయక్, భార్యపైన రిజిస్టర్‌ చేశాడు. చిన్నభార్య లక్ష్మి, ఆమె కొడుకుపై రిజిస్టర్‌ చేయలేదు. దీంతో లక్ష్మి, నరేందర్‌నాయక్‌ జాలంతో పలుమార్లు భూమి విషయంలో గొడవ పడ్డారు. ఇదేక్రమంలో నరేందర్‌నా యక్‌ తుర్కపల్లి మండలం రాంపూర్‌తండాకు చెం దిన అమ్మాయి సునీతను ప్రేమించాడు.

పెళ్లికో వాలని నిర్ణయించుకుని పెద్దల అంగీకారం కూడా కుదుర్చుకున్నాడు. తను చూపించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఆస్తిలో భాగం ఇస్తానని జాలం పట్టుబట్టాడు. నరేందర్‌ మాట వినకుండా ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకోవడంతో వివాదం మరింత ముదిరింది. 

నాలుగేళ్ల క్రితం అన్న హత్య

తనకు ఆస్తి దక్కకుండా అన్న నర్సింహనాయక్‌ అడ్డుపడుతున్నాడని అతనిపై పగ పెంచుకున్నా డు. నరేందర్‌నాయక్‌ మలక్‌పేట తండాలో డ్రైవర్‌గా పనిచేస్తున్నప్పుడు అన్న నర్సింహనాయక్‌ కది లికలపై కన్నేశాడు. తన మేన బావమరిది భగవన్‌ సహకారంతో నాలుగేళ్ల క్రితం పక్కా ప్లాన్‌తో మో టార్‌ సైకిల్‌పైన వచ్చి గొల్లగూడెం సమీపంలో మోటర్‌ సైకిల్‌పైన వెళ్తున్న నర్సింహనాయక్‌ను వెంబడించి కత్తులతో దాడి చేసి చంపేశారు. పోలీసులు నర్సింహనాయక్‌ను అరెస్ట్‌ చేసి కో ర్టులో హాజరుపరిచారు. కొన్ని రోజులు జైల్లో ఉం డి బెయిల్‌పై విడుదలయ్యాడు. నాలుగేళ్లనుంచి పేషీపై భువనగిరి కోర్టుకు హాజరవుతున్నాడు.

అడ్డు తొలగించాలని..

జాలం పెద్దభార్య సుగుణ చిన్నకొడుకు నర్సింహనాయక్‌ హత్య అనంతరం చిన్నభార్య లక్ష్మి, అతని కొడకు నరేందర్‌నాయక్‌ మధ్య భూ వివాదాలు కొలిక్కిరాకపోవడంతో పాటు వివాదాలు పెరి గాయి. ఆస్తిలో తన తండ్రి భాగం ఇవ్వడం లేదని నరేందర్‌నాయక్‌ తండ్రి పైన కూడా కసిని పెంచుకున్నాడు. ఎలాగైనా తండ్రిని జాలంను మట్టుపెడితే  అడ్డు ఉండదని నిర్ణయించుకున్నాడు.

సినిమా ఫక్కీలో మర్డర్‌ ప్లాన్‌

కోర్టు కేసుకు వచ్చినప్పుడు కూడా నరేందర్‌నాయక్‌కు జాలం తారసపడేవాడు. ఎలాగైనా తండ్రిని ఆంతం అంతమొందించాలని ఎదురు చుస్తున్నాడు. ఈ క్రమంలో సోమవారం(ఈనెల 23న) కోర్టు కేసుకు వచ్చివెళ్లాడు. ఆ రోజు తండ్రి జాలం కోర్టుకు హాజరు కాలేదు. తిరిగి మంగళవారం తన లాయర్‌ కలవడానికి నరేందర్‌నాయక్‌ తన టాటాసుమో వాహనంలో వచ్చాడు. జాలం తన పెద్ద భార్య కొడుకు భిక్షపతికి పింఛన్‌ విషయమై వేర్వేరు మోటారు సైకిళ్లపై భువనగిరికి వచ్చారు.

భువనగిరి కోర్టులో ఉన్న నరేందర్‌నాయక్‌ తం డ్రిని చూశాడు. జాలం భువనగిరి నుంచి టీవీఎస్‌ ఎక్సెల్‌పై ఇంటికి వస్తుండగా అక్కడి నుంచి నరేం దర్‌నాయక్‌ టాటాసుమోలో వెంబడిస్తూ రుస్తాపూర్‌ గ్రామశివారులో వెనక వైపు నుంచి సుమోతో బలంగా ఢీకొట్టాడు. రోడ్డు పైన పడిపోయిన జాలంకు తీవ్రగాయాలయ్యాయి. మరోమారు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.

మరణించాడని తెలుసుకుని తన టాటా సుమోతో తుర్కపల్లి పోలీసుస్టేషన్‌లో లొంగిపోయాడు. రెండు హత్యలు చేసిన నిందుతుడిపై రౌడీషీట్‌ ఓపెన్‌ చేస్తున్నామని డీసీపీ తెలిపారు. సమావేశంలో ఏసీపీ సముద్రాల శ్రీనివాసాచార్యులు, సీఐ ఆంజనేయులు, ఎస్‌ఐ వెంకటేశం ఉన్నారు.

Videos

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

ముస్లిం మహిళలతో కలిసి వైఎస్ భారతి ప్రార్థన

ల్యాండ్ టైటిల్ యాక్ట్ అంటే ఏంటో చెప్పి చంద్రబాబు కళ్ళు తెరిపించిన జగన్

జగన్ ను కదలనివ్వని జనాభిమానం @హిందుపూర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @పలమనేరు (చిత్తూరు జిల్లా)

వీళ్ళే మన అభ్యర్థులు.. మీ ఆశీర్వాదం కావాలి

ల్యాండ్ టైటిల్ యాక్ట్ పై సీఎం జగన్ సీరియస్

కూటమి పై సీఎం జగన్ అదిరిపోయే పంచులు..!

కేవలం ప్రజల ఆశీస్సులు కోసం పనిచేసే ఏకైక ప్రభుత్వం

మండుటెండను లెక్కచేయని అభిమానం...!

మండుటెండను లెక్కచేయని అభిమానం..!

విడుదల రజిని సమక్షంలో భారీ చేరికలు

ఎన్నికల ప్రచారంలో వైఎస్ భారతి..!

Photos

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)