amp pages | Sakshi

7 గంటల్లోనే దొంగ అరెస్టు

Published on Mon, 10/08/2018 - 11:31

చిత్తూరు, తిరుపతిక్రైం: నగరంలోని చిన్నబజారువీధిలో శనివారం జరిగిన భారీ చోరీని క్రైం పోలీసులు 7 గంటల్లోనే ఛేదించారు. నిందితుడిని అరెస్టు చేసి అతని నుంచి రూ.62 లక్షల విలువైన 2 కేజీల బంగారు నగలు, రూ.20 వేలు స్వాధీనం చేసుకున్నారు. తిరుపతి అర్బన్‌ పోలీసు జిల్లా ఎస్పీ అభిషేక్‌ మొహంతి ఆదివారం క్రైం పోలీస్‌స్టేషన్‌లో వి లేకరుల సమావేశంలో మాట్లాడారు. చిన్నబజారువీధిలో హేమంత్‌ అనే వ్యక్తి లావణ్య జ్యువెలరీస్‌ ను నిర్వహిస్తున్నాడని తెలిపారు. దుకాణం వెనుకవైపు నివాసం ఉంటున్నాడు. ఇతని వద్ద గతంలో ఎమ్మార్‌పల్లిలో ఉంటున్న అయినపాళ్యం కళ్యాణ్‌ (23) పనిచేశాడు. ప్రవర్తన సరిగా లేకపోవడంతో అతన్ని 2 ఏళ్ల క్రితం పని నుంచి నిలిపేశాడు. కళ్యాణ్‌ హైదరాబాద్‌లో ట్రావల్స్‌ను ఏర్పాటు చేసుకో వాలని భావించాడు. ఇందుకు పాత యజమాని షాపులో చోరీ చేయాలని నిర్ణయించుకున్నాడు.

మాట్లాడేందుకు వెళ్లి..
ఈ నెల 5వతేదీ రాత్రి 8 గంటలకు లావణ్య జ్యువె లరీస్‌లోకి వెళ్లి 250 గ్రాముల బంగారు చెవిపోగులు కొనుగోలు చేశాడు. అనంతరం షాప్‌లో ఉన్న వారితో పాత పరిచయాన్ని వినియోగించుకుని ఇంట్లో వారితో మాట్లాడి మరుగుదొడ్డి కోసమని ఇంటి వెనక్కు వెళ్లాడు. అక్కడ తలుపునకు ఉన్న టవర్‌ బోల్ట్, ఇనుప గ్రిల్‌గేట్‌ను తీసివేసి బయటకు వచ్చేశాడు. రాత్రి ఒంటి గంట సమయంలో లావణ్య జ్యువెలర్స్‌లోకి ఇంటి వెనుకవైపు నుంచి వెళ్లి బంగారు చైను, డబ్బులు, క్యాష్‌ బ్యాగులోని రూ.20 వేలు, సీసీ కెమెరాల డీవీఆర్‌ను తీసుకుని వెళ్లిపోయాడు. డీవీఆర్‌ను పాడుబడిన బావిలో పడేశాడు. ఇంతలో చోరీ జరిగినట్లు యజమాని గుర్తించి క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేసిన పోలీసులు ముందురోజు, వెనుక రోజు ఎవరెవరు వచ్చారనే విషయాలను తెలుసుకున్నారు. కళ్యాణ్‌పై అనుమానంతో అదుపులోకి తీసుకుని విచారించగా చోరీ చేసినట్టు అంగీకరించాడు. అతని నుంచి రూ.62 లక్షల విలువైన 2 కేజీల 55 గ్రాముల బంగారు నగలు, రూ.20 వేలు నగదు దొంగతనానికి వినియోగించిన ద్విచక్రవాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

వింగ్స్‌ యాప్‌తో ఉద్యోగుల సమాచారం సేకరిస్తాం
ఇకపై నగరంలో ఇలాంటి సంఘటనలు జరగకుండా బంగారు షాపులు, షోరూంలు, ప్రముఖ షాపుల్లో పనిచేసే ఉద్యోగుల వివరాలను వింగ్స్‌ యాప్‌ ద్వారా త్వరలోనే సేకరిస్తామని ఎస్పీ పేర్కొన్నారు. సంబంధిత వ్యక్తి ఆధార్‌కార్డు, ఫొటో వివరాలను సేకరించవచ్చన్నారు. వాటిని బట్టి చిరునామా కనుక్కోవడం, అతని నేర చరిత్రను ఆరాతీయడం సులభమవుతుందని చెప్పారు. అంతేగాక వివిధ ప్రాంతాల నుంచి నగరానికి వచ్చే వారిలో నేర చరితులు, దొంగతనాలు చేసి ఉంటే వెంటనే గుర్తించవచ్చన్నారు. 10 రోజుల్లో ఈ యాప్‌ను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ప్రజలు ఎక్కడైనా వెళ్లే సమయంలో సమీపంలోని పోలీస్‌స్టేషన్‌ నుంచి లాక్డ్‌ హౌస్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌ను వినియోగించుకోవచ్చన్నారు. నిందితులను చాకచక్యంగా అరెస్ట్‌ చేయడంలో కృషి చేసిన ఏఎస్పీ సిద్ధారెడ్డి, డీఎస్పీ రవిశంకర్‌రెడ్డి, సీఐలు భాస్కర్‌రెడ్డి, శరత్‌చంద్ర, అబ్బన్న, మధు, పద్మలత, రసూలు సాహెబ్, ఇతర సిబ్బందికి రివార్డులు ఇస్తామన్నారు.

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)