amp pages | Sakshi

తల్లికి ఘోరం చెబితే.. తాయత్తు కట్టించింది!

Published on Sun, 07/22/2018 - 17:03

మొహాలీ/పంజాబ్‌: కంటికి రెప్పలా కాపాడాల్సిన తోబుట్టువే కామంతో కళ్లుమూసుకుపోయి మృగాడిలా ప్రవర్తించాడు. సొం‍త చెల్లెలిపైనే లైంగిక అకృత్యాలకు పాల్పడి మానవత్వానికే మచ్చ తెచ్చాడు. ఈ ఘటన పంజాబ్‌లోని ఖరార్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకోగా శుక్రవారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాలు.. ఉత్తర ప్రదేశ్‌కు చెందిన ఓ కుటుంబం ఇక్కడికి వలస వచ్చింది. కుటుంబంతో కలిసి ఉంటున్న పదకొండేళ్ల చిన్నారి (మూడో తరగతి)పై తన అన్నయ్య (22) పలుమార్లు అత్యాచారం చేశాడు.

లైంగిక దాడి జరిగిన మొదటి రోజే చిన్నారి ఈ విషయం తన తల్లికి చెప్పింది. కొడుకే కూతురుని ఇలా చేయడమేంటని ఆ తల్లి నమ్మలేదు. బిడ్డకు గాలి సోకిందని భూత వైద్యునితో తాయత్తు కట్టించింది. అయితే, చెల్లెలిని లైంగిక వేధింపులకు గురిచేస్తూ ఆ యువకుడు తల్లి కంటబడడంతో అతన్ని ఇంటి నుంచి వెళ్లగొట్టింది. ఈ విషయం బయటపడితే పరువు పోతుందనీ, ఎవరితో చెప్పొద్దొని కూతురికి తల్లి సర్ది చెప్పింది.

అవగాహనతో బట్టబయలు..
అయితే చిన్నారి చదువుతున్న స్కూల్లో అసహజ స్పర్శలు, లైంగిక పరమైన వేధింపులపై అవగాహన తరగతులు నిర్వహించారు. దీంతో బాధితురాలు తన సోదరుడు చేసిన పనిని స్నేహితురాళ్లకు చెప్పింది. ఆ విషయం టీచర్ల దృష్టికి రావడంతో​ ఘటన వెలుగుచూసింది. వారు చైల్డ్‌లైన్‌ సాయంతో పోలీసులకు సమాచారమిచ్చారు. నిందితున్ని అరెస్టు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. నిందితుడు నేరాన్ని అంగీకరించాడనీ ఐపీసీ, పోక్సో చట్టాల కింద కేసులు నమోదు చేశామని పోలీసులు వెల్లడించారు. కాగా, పదకొండు మంది తోబుట్టువుల్లో బాధితురాలు చివరి సంతానం.

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)