amp pages | Sakshi

ఏసీబీ వలలో సీనియర్‌ అసిస్టెంట్‌

Published on Sat, 02/09/2019 - 13:24

విజయవాడ: కృష్ణాజిల్లా గొల్లపూడిలో డైరెక్టర్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ అండ్‌ కుటుంబ సంక్షేమ శాఖ (వైద్యవిధాన పరిషత్‌) కార్యాలయం సీనియర్‌ అసిస్టెంట్‌ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. శుక్రవారం సాయంత్రం వైద్యవిధాన పరిషత్‌ రాష్ట్ర కార్యాలయంలో సీనియర్‌ అసిస్టెంట్‌ వై.లావణ్యశ్రీ  ఓ వైద్యాధికారి నుంచి  రూ. 8 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు. నూజివీడు ఏరియా హాస్పటల్‌ ఈఎన్‌టీ విభాగంలో అసిస్టెంట్‌ సివిల్‌ సర్జన్‌గా పనిచేస్తున్న ఐ.ఉదయకుమార్‌ నుంచి లావణ్యశ్రీ లంచం డిమాండ్‌ చేశారు.

ఎల్‌పీసీ, ఎస్‌ఆర్‌ఫైల్‌కు సంబంధించిన బిల్స్‌ క్లియర్‌ కోసం సీనియర్‌ అసిస్టెంట్‌ రూ. 8 వేలు లంచం డిమాండ్‌ చే శారని ఉదయకుమార్‌ ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. లంచం ఇవ్వకపోవడంతో ఫైల్‌ను తొక్కిపెట్టారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈక్రమంలో ఏసీబీ అధికారులు వాయిస్‌ రికార్డింగ్‌లు కూడా చేశారు. రూ. 8 వేలు   డబ్బు ఇవ్వగానే ఏసీబీ అధికారులు ఆమె నుంచి డబ్బును స్వాధీనం చేసుకుని రసాయనాలు చేతులకు పూసి లంచం తీసుకున్నట్లు నిర్ధారించారు. ఏసీబీ డీఎస్పీ కనకరాజు దర్యాప్తు చేసి లంచం డిమాండ్‌ చేసిన ఉద్యోగిని రెడ్‌ హ్యాండెండ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ సీఐ హ్యాపీ కృపానందం, సిబ్బంది ఈ దాడిలో పాల్గొన్నారు.

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)