amp pages | Sakshi

‘డిక్కీ’ దొంగ ఆటకట్టు

Published on Fri, 10/18/2019 - 11:38

బంజారాహిల్స్‌: కేబీఆర్‌ పార్కుకు వాకింగ్‌కు వచ్చేవారి వాహనాల నుంచి చాకచక్యంగా నగదు, విలువైన వస్తువులు చోరీ చేస్తున్న వ్యక్తిని కేబీఆర్‌ పార్కు వద్ద విధి నిర్వహణలో ఉన్న ఇంటర్‌సెప్టర్‌ వెహికిల్‌ పోలీసులు అదుపులోకి తీసుకుని బంజారాహిల్స్‌ క్రైం పోలీసులకు అప్పగించారు. వివరాల్లోకి వెళ్తే.. బంజారాహిల్స్‌లోని కేబీఆర్‌ పార్కుకు వచ్చే వాకర్లు తమ బైక్‌లను పార్కు సమీపంలో పార్కింగ్‌ చేస్తుంటారు. వీరిలో కొందరు యాక్టీవా బైక్‌ల సీట్ల కింద  తమ పర్సులు, హ్యాండ్‌బ్యాగ్‌లు, ఇతర వస్తువులను భద్రపరిచి లోపలికి వెళ్తుంటారు. దీనిని అదునుగా తీసుకుని గత కొంత కాలంగా అయ్యప్ప సొసైటీ ప్రాంతానికి చెందిన  సత్యనారాయణ స్క్రూడ్రైవర్‌తో సీటు తొలగిస్తూ అందులో ఉన్న వస్తువులు తస్కరిస్తున్నాడు.

గత నెల రోజుల్లో ఎనిమిది చోరీలకు పాల్పడ్డాడు. గురువారం ధరంకరం రోడ్డుకు చెందిన రఘు అనే వ్యక్తి తన బైక్‌ను పార్కింగ్‌ చేసి లోపలికి వెళ్లగా దీనిని గుర్తిం,ఇన సత్యనారాయణ డిక్కీలో నుంచి రూ. 4,800 నగదు తీసుకొని జేబులో పెట్టుకుంటుండగా పార్కు ముందు డ్యూటీలో ఉన్న ఇంటర్‌సెప్టర్‌ వెహికిల్‌ కానిస్టేబుళ్లు ప్రవీణ్‌కుమార్, మల్లికార్జున్‌ యాదవ్, హోంగార్డు రాజేశ్వర్‌జీ అతడిని గుర్తించారు. దీనిని పసిగట్టిన సత్యనారాయణ పోలీసులను చూసి పరారయ్యేందుకు యత్నించాడు. ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌ మీదుగా సందులోకి పరిగెత్తుతుండగా పోలీసులు అతడిని వెంబడించి పట్టుకున్నారు. అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరాలు అంగీకరించాడు. నిందితుడిని బంజారాహిల్స్‌ క్రైం పోలీసులకు అప్పగించారు. గత కొంత కాలంగా పార్కింగ్‌ చేసిన వాహనాల్లోంచి సెల్‌ఫోన్లు, నగదు చోరీకి గురవుతున్నట్లు ఫిర్యాదులు అందాయని పోలీసులు తెలిపారు. బంజారాహిల్స్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

Videos

మంగళగిరి పబ్లిక్ టాక్ లోకేష్ VS లావణ్య

చంద్రబాబుకు రోజా సూటి ప్రశ్న

జగన్ గారు నాకిచ్చిన బాధ్యత "కుప్పం" కుంభస్థలం బద్దలే బాబు

షర్మిల ప్రచారం అట్టర్ ఫ్లాప్..!

పవన్ కళ్యాణ్ లేదు తొక్క లేదు.. జగనన్న కోసం ప్రాణం ఇస్తా ... తగ్గేదేలే

గన్నవరంలో జోరుగా వల్లభనేని ఎన్నికల ప్రచారం

త్వరలో తెలంగాణలో వాలంటీర్ వ్యవస్థ: దేవులపల్లి అమర్

పవన్ కు పోతిన మహేష్ లేక "ప్రశ్నలు - పంచులు "

అబద్ధం చాలా అందంగా ఉంటుంది చంద్రబాబు మేనిఫెస్టోలా..!

ఓటమి భయంతోనే పిఠాపురానికి మకాం: శేషు కుమారి

4 కంటైనర్ లలో డబ్బు రవాణా 2 వేల కోట్లు పట్టుకున్న ఏపీ పోలీసులు

చంద్రబాబు చేసిన పనికి కన్నీళ్లు పెట్టుకున్న వృద్ధురాలు..!

మ్యానిఫెస్టో ని ఇంటింటికీ తీసుకువెళ్లటమే జగన్ కోసం సిద్ధం

చంద్రబాబు బ్యాచ్ కుట్రలతో పెన్షన్ దారులకు మరిన్ని కష్టాలు

ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై కూటమి అసత్యపు ప్రచారం చేస్తోంది

అందుకు ఏదైనా చికిత్స చేయించుకున్నారా?

చంద్రబాబుపై జగన్ మోహన్ రావు ఫైర్

Election Track: గెలుపు ఎవరిది ?..రాజమహేంద్రవరం ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్

కార్మికులను ఆదుకున్నది సీఎం జగన్ మాత్రమే

Photos

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)