amp pages | Sakshi

నమ్మకద్రోహి చిక్కాడు!

Published on Fri, 05/03/2019 - 07:01

సాక్షి, సిటీబ్యూరో: నగరానికి చెందిన రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారికి టోకరా వేసి ఆయన ఖాతా నుంచి రూ.63 లక్షలు కాజేసిన నమ్మక ద్రోహి అతని డ్రైవరే అని తేలింది. ఈ కేసును సవాల్‌గా తీసుకున్న సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దింపారు. ఫలితంగా 24 గంటల్లోనే నిందితుడిని పట్టుకోగలిగారు. అతడి నుంచి రూ.7.15 లక్షల నగదు, రెండు కార్లు స్వాధీనం చేసుకున్నట్లు జాయింట్‌ పోలీసు కమిషనర్‌ అవినాష్‌ మహంతి గురువారం తెలిపారు. చిత్తూరు జిల్లాకు చెందిన పి.వెంకట రమణ 2012లో అమీర్‌పేట్‌లోని దరమ్‌ కరమ్‌ రోడ్డులో నివసించే ఓ రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి వద్ద డ్రైవర్‌/సహాయకుడిగా చేరాడు. తన భార్యతో కలిసి ఆయన ఇంటి ఆవరణలోనే ఉన్న సర్వెంట్‌ క్వార్టర్స్‌లో ఉండే వాడు. రిటైర్డ్‌ అధికారితో పాటు ఆయన భార్య సైతం వయోవృద్ధులు కావడం, వారి సంతానం విదేశాల్లో ఉండటంతో వారు ఎక్కువగా వెంకట రమణపై ఆధారపడేవారు. ఇతడూ పక్కాగా పని చేస్తుండటంతో పూర్తిగా నమ్మారు.

ఇతగాడు వీరి వద్ద పనితో పాటు క్యాబ్‌ డ్రైవర్‌గానూ పని చేసే వాడు. పలు పేర్లతో రుణాలు తీసుకుని మూడు కార్లు ఖరీదు చేసి క్యాబ్‌ సర్వీస్‌లుగా మార్చడంతో పాటు సాఫ్ట్‌వేర్‌ కంపెనీలకు అద్దెకు ఇచ్చాడు. వీటిలో ఓ వాహనం చోరీకి గురికావడం, మరోటి ప్రమాదానికి లోనుకావడంతో అప్పులకు వడ్డీలు చెల్లించడం కష్టంగా మారి అవి భారంగా మారాయి. దీంతో వక్రబుద్ధి పుట్టిన వెంకట రమణ తన యజమానికే టోకరా వేయాలని నిర్ణయించుకున్నాడు. రిటైర్డ్‌ అధికారితో పాటు అతని భార్య పేర్లపై బల్కంపేట్‌ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో జాయింట్‌ ఖాతా ఉంది. చాకచక్యంగా ఈ ఖాతా ఇంటర్‌నెట్‌ బ్యాకింగ్‌కు సంబంధించిన యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్స్‌లను సంగ్రహించాడు. ఎస్సార్‌నగర్‌లో మనీట్రాన్స్‌ఫర్‌ వ్యాపారం చేసే ఓ మహిళ సహకారంతో, ఆమెకు కమీషన్‌ ఇస్తూ యజమాని ఖాతాను యాక్సస్‌ చేయించాడు. గత ఏడాది ఆగస్టు నుంచి విడతల వారీగా అందులో ఉన్న రూ.63 లక్షలు కాజేశాడు. ఈ డబ్బుతో రెండు కార్లు ఖరీదు చేసుకున్నాడు. గత నెలలో బ్యాంకునకు వెళ్లి తన ఖాతా లావాదేవీలను పరిశీలించగా, గడిచిన కొన్ని రోజులుగా ఆ ఖాతాలోని సొమ్ము మాయమవుతున్నట్లు గుర్తించారు. ఆ వెంటనే ఆయన సైబర్‌ క్రైమ్‌ అధికారుల్ని ఆశ్రయించడంతో కేసు నమోదైంది. అదనపు డీసీపీ కేసీఎస్‌ రఘువీర్‌ నేతృత్వంలో ఇన్‌స్పెక్టర్‌ డి.ప్రశాంత్, ఎస్సై జి.తిమ్మప్ప చాకచక్యంగా దర్యాప్తు చేశారు. నిందితుడు వెంకట రమణగా గుర్తించి గురువారం అరెస్టు చేశారు. ఈ వ్యవహారంలో మిగిలిన వారి ప్రమేయంపై ఆరా తీస్తున్నారు. 

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)