amp pages | Sakshi

టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌కు బెయిల్‌

Published on Thu, 10/17/2019 - 19:46

సాక్షి, హైదరాబాద్‌: టీవీ9 అసోసియేటెడ్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ కంపెనీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ బోర్డు తీర్మానం లేకుండా అక్రమంగా దాదాపు రూ.18 కోట్లు డ్రా చేసిన కేసులో రవిప్రకాశ్‌కి గురువారం నాంపల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. హైదరాబాద్‌ విడిచి వెళ్లొద్దని.. రూ. లక్ష పూచీకత్తు సమర్పించాలని ఆదేశించింది.

రవిప్రకాశ్‌పై మరో కేసు నమోదు
కాగా, నకిలీ ఐడీ కేసులో టీవీ 9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌పై కేసు నమోదైంది. ఐ ల్యాబ్ ప్రెసిడెంట్ కృష్ణ ప్రసాద్ .. రవిప్రకాశ్‌పై సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రవిప్రకాశ్‌పై సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఐపీసీ 406, ఐటీ యాక్ట్ 66 డీ సెక‌్షన్ల కింద మరో కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. ఎన్‌సీఐటీని మోసం చేసేందుకు నటరాజన్‌ అనే వ్యక్తి ఐ ల్యాబ్ పేరుతో నకిలీ మెయిల్‌ ఐడీని కియేట్‌ చేశాడని కృష్ణ ప్రసాద్‌ తెలిపారు. ఇండస్‌లా కంపెనీ.. ఐ ల్యాబ్‌కు పంపిన డాక్యుమెంట్లలో నకిలీ మెయిల్ ఐడీని తాము గుర్తించామన్నారు.

నటరాజన్ అనే వ్యక్తి పేరుతో ఎవరూ లేరంటూ.. తమ విలువైన సమాచారం దొంగిలించారని కృష్ణ ప్రసాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎన్‌సీఐటీ కేసులో లబ్ది పొందడం కోసం రవిప్రకాశ్‌ ఈ కుట్ర పన్నారని ఐ ల్యాబ్స్ ఫిర్యాదులో పేర్కొంది. నటరాజన్‌తో రవిప్రకాశ్‌ ఈ వ్యవహారం మొత్తం నడిపారని సాక్ష్యాలు సేకరించిన సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. దీంతో చంచల్‌గూడ జైలు నుంచి పిటి వారెంట్ ద్వారా రవిప్రకాశ్‌ను మియాపూర్ కోర్టుకు తీసుకొస్తున్నారు. కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్‌ విధించడంతో మళ్లీ జైలుకు తరలించారు. 

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌