amp pages | Sakshi

జైలు సిబ్బందిపై ఖైదీ ఫిర్యాదు

Published on Tue, 04/23/2019 - 12:30

ఆరిలోవ(విశాఖ తూర్పు):  విశాఖ కేంద్ర కారాగారంలో సిబ్బంది తనను కొట్టారంటూ  ఓ ఖైదీ న్యాయమూర్తికి ఫిర్యాదు చేశాడు. అయితే ఖైదీని తాము కొట్టలేదని జైల్‌ అధికారులు అంటున్నారు. సెల్‌ ఫోన్‌ వాడకం ఈ రచ్చకు కారణమైందని చెబుతున్నారు. వివరాల్లోకి వెళితే.. విశాఖ కేంద్ర కారాగారంలో సుమారు ఏడాది నుంచి శిక్ష అనుభవిస్తున్న మచిలీపట్నం ప్రాంతానికి చెందిన వీరాపాణి అనే ఖైదీ సోమవారం వాయిదాకు కోర్టుకు వెళ్లాడు. అక్కడ న్యాయమూర్తితో జైల్‌లో సిబ్బంది తనను అకారణంగా కొట్టారని చెప్పాడు. దీంతో న్యాయమూర్తి ఆదేశాలతో పోలీసులు కేజీహెచ్‌కు చికిత్స కోసం తరలించారు. అక్కడ వీరాపాణికి న్యాయవాది సమక్షంలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. జైల్‌ అధికారులు మాత్రం వీరాపాణిని ఎవరూ కొట్టలేదని చెప్పారు.

అతనిపై 8 కేసులున్నాయని జైల్‌ సూపరింటెండెంట్‌ ఎస్‌.రాహుల్‌ తెలిపారు. వాటిలో మూడు హత్య కేసులు, రెండు అత్యాచారం కేసులున్నాయన్నారు. మొదట్లో కొన్నాళ్లు రాజమండ్రి కేంద్ర కారాగారంలో శిక్ష అనుభవిస్తుండగా ప్రవర్తన బాగాలేకపోవడంతో కడప జైల్‌కు, అక్కడి నుంచి నెల్లూరు జైల్‌కు తరలించారని, అక్కడ ప్రవర్తన బాగాలేకపోవడంతో ఏడాది క్రితం విశాఖపట్నం తీసుకొచ్చినట్లు తెలిపారు. ఇక్కడ ఉంటూ పెరోల్‌పై బయటకు వెళ్లడానికి విశాఖ పోలీస్‌ కమిషనర్‌ సంతకాన్ని ఫోర్జరీ చేసిన కేసు నమోదైందన్నారు. ఆ కేసుపై విశాఖ కోర్టుకు వాయిదాలకు వెళ్తున్నాడరన్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 6న కోర్టుకు వాయిదాకు వెళ్లి తిరిగి జైల్‌కు వచ్చినప్పుడు సెల్‌ఫోన్‌ తీసుకొచ్చాడని, సిబ్బందికి తెలియకుండా దాన్ని లోపలకు తీసుకెళ్లాడన్నారు. జైల్‌ లోపల నుంచి ఫోన్‌లో బయటవారితో మాట్లాడుతుండగా సిబ్బంది గమనించి ఫోన్‌ తీసుకొన్నారన్నారు. దీంతో తనను కొట్టినట్లు జడ్జికి అబద్ధం చెప్పాడన్నారు.

జైలు లోపలికి ఫోన్‌ ఎలా వెళ్లిందో..?
జైలు బయట కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది. జైల్‌ లోపల కూడా అదేమాదిరిగా భద్రత ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలు అమర్చారు. వాయిదాలకు వెళ్లి వచ్చే ఖైదీలను ప్రధాన ద్వారం వద్ద సిబ్బంది చెక్‌ చేస్తారు. వారి బంధువులు, స్నేహితులు తీసుకొచ్చిన ఆహార పదార్ధాలను (మిక్చర్, బిస్కెట్లు లాంటివి) పరిశీలిస్తారు. ఇంతచేసినా వీరాపాణి వద్దకు సెల్‌ ఫోన్‌ ఎలా వచ్చిందనేది చర్చనీయాంశమవుతోంది. వాయిదా నుంచి తిరిగి లోపలకు ప్రధాన ద్వారం నుంచే ఏ ఖైదీ అయినా వెళ్లాల్సిందే. ఈ నెల 6న వాయిదా నుంచి తిరిగి జైల్‌కు వెళ్లిన వీరాపాణి వద్ద సెల్‌ ఫోన్‌ ఉన్నట్లు ఎందుకు గుర్తించలేకపోయారు? గుర్తించినా చూసీచూడనట్లు వదిలేశారా? ఖైదీలు ఉండే ప్రతి బ్యారెక్‌ వద్ద సీసీ కెమెరాలున్నాయి.   వాటిని నిరంతరం మానటిరింగ్‌ హాల్‌లో అబ్జర్వ్‌ చేస్తారు. వారికి కూడా తెలియకుండా వీరాపాణి ఎలా మాట్లాడగలిగాడు..? జైల్‌లో సెల్‌ఫోన్‌లు ఇంకెంతమంది ఖైదీల వద్ద ఉన్నాయో..? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీన్ని బట్టి ఇక్కడ జైల్‌ లోపల పరిస్థితి ఎంత పటిష్టంగా ఉందో అనే విషయం తెలుస్తోందని విమర్శలు వినిపిస్తున్నాయి.

Videos

లోకేష్ కామెడీ..మార్చి 13న ఓటెయ్యండి..

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)