amp pages | Sakshi

మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడనే.. 

Published on Wed, 02/12/2020 - 09:12

సాక్షి, శాలిగౌరారం (తుంగతుర్తి) : భూతవైద్యం పేరిట మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడన్న కారణంతోనే శాలిగౌరారం మండలం గురుజాల గ్రామానికి చెందిన వెంపటి శంకర్‌ దారుణహత్యకు గురైనట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. మండల పరిధిలోని గురుజాలలో ఈ నెల 4వ తేదీన వెలుగుచూసిన శంకర్‌ హత్యోందం కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. హత్యోందంలో భాగస్వాములైన ఏడుగురు నిందితులను మంగళవారం నకిరేకల్‌లోని సీఐ కార్యాలయంలో నల్లగొండ డీఎస్పీ వెంకటేశ్వర్‌రెడ్డి మీడియా ఎదుట ప్రవేశపెట్టి కేసు వివరాలు వెల్లడించారు. గురుజాల గ్రామానికి చెందిన ఎడ్ల సాలమ్మ–చినవెంకన్న దంపతుల కుమారుడికి ఆరోగ్యం సరిగా లేకపోవడంతో పలు ఆస్పత్రులో వైద్యం చేయించారు.

అయినా ఫలితం లేకపోవడంతో అదే గ్రామానికి చెందిన భూత వైద్యుడు వెంపటి యాదయ్యను సంప్రదించారు. ఈ క్రమంలోనే యాదయ్య, సాలమ్మల మధ్య చనువు పెరిగి వివాహేతర సంబంధానికి దారి తీసింది. అయితే కొంతకాలానికి సాలమ్మ అనారోగ్యం బారిన పడింది. ఆమెకు యాదయ్య భూతవైద్యం చేసినా ఆరోగ్యం కుదుట పడలేదు. దీంతో యాదయ్య ఇదే గ్రామానికి చెంది హైదరాబాద్‌లో నివాసం ఉంటున్న భూతవైద్యుడు వెంపటి శంకర్‌ను సంప్రదించాడు. సాలమ్మను అతడికి పరిచయం చేసి భూతవైద్యం చేయాలని కోరాడు. 

భూతవైద్యం చేసే క్రమంలో..
సాలమ్మకు భూతవైద్యం చేసేందుకు వెంపటి శంకర్‌ గత నెల 31న ఉదయం 9 గంటలకు గురుజాల గ్రామ సమీపంలోని మొండిఏనె వద్దకు చేరుకున్నాడు. అప్పటికే యాదయ్య, సాలమ్మలు అక్కడికి చేరుకున్నారు. అయితే సాలమ్మకు భూతవైద్యం చేసే క్రమంలో శంకర్‌ ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో కోపోద్రిక్తులైన యాదయ్య, సాలమ్మ అతడిని అంతమొందించాలని నిర్ణయించుకున్నారు. 

పథకం ప్రకారం..
తన పట్ల శంకర్‌ అసభ్యంగా ప్రవర్తించిన తీరును అప్పుడే అక్కడికి చేరుకున్న భర్త ఎడ్ల చినవెంకన్నకు వివరించింది. దీంతో అతను గురుజాల గ్రామానికి చెందిన బాకి రమేశ్, ఎడ్ల మారయ్య, గూని యా దయ్య, ఎడ్ల మారయ్యను అక్కడికి రప్పించాడు. ప్రథకం ప్రకారం అదును చూసి అందరూ కలిసి వెంపటి శంకర్‌ గొంతుకోసి దారుణంగా హత్య చేశారు. అనంతరం మూసీనది ఇసుకలో పాతిపెట్టి పారిపోయారు. 

ఫోన్‌ కాల్‌డేటా ఆధారంగా..
కాగా, ఈ నెల 4వ తేదీన వెలుగుచూసిన శంకర్‌ హత్యోదంతంపై వీఆర్వో తిరుమలేశ్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. హతుడి జేబులో లభించిన మత్స్య సహకార సొసైటీ గుర్తింపు కార్డు ఆధారంగా గురుజాలకు చెందిన శంకర్‌గా గుర్తించారు. అతడి ఫోన్‌ కాల్‌డేటా ఆధారంగా యాదయ్యను అనుమానించారు. అప్పటినుంచి గ్రామానికి చెందిన ఏడుగురు పరారీలో ఉండడంతో వారే హత్య చేసి ఉంటారని భావించారు. అనుమానితులు నార్కట్‌పల్లి మండలం చెర్వుగట్టులో ఉన్నట్టు గుర్తించి అక్కడికి వెళ్లి అరెస్ట్‌ చేసినట్టు డీఎస్పీ వివరించారు. విచారణలో నిందితులు నేరం అంగీకరించారని తెలిపారు. వారి వద్ద హత్యకు ఉపయోగించిన కత్తి, రెండు బైక్‌లు, ఏడు సెల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.  ఏడుగురు నిందితులపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచినట్లు డీఎస్పీ తెలిపారు. కేసును ఛేదించిన శాలిగౌరారం సీఐ పి.నాగదర్గప్రసాద్, ఎస్‌ఐ రాజు, ఏఎస్‌ఐ బండి యాదగిరి, స్టేషన్‌ రైటర్లు నజీర్, ముజీబ్, పోలీస్‌కానిస్టేబుల్స్‌ గురువారెడ్డి, చంద్రయ్య, అంజయ్య, టెక్నికల్‌ టీం జగన్, ఖలీల్, సుదర్శన్‌లను డీఎస్పీ అభినందించారు.

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)