amp pages | Sakshi

హైదరాబాద్‌ బర్కత్‌పురాలో ఘోరం

Published on Wed, 02/06/2019 - 11:34

సాక్షి, హైదరాబాద్: ప్రేమను అంగీకరించలేదన్న కక్షతో  ఓ ఉన్మాది రెచ్చిపోయాడు. ఇంటర్ చదువుతున్న అమ్మాయిపై కొబ్బరి బోండాల కత్తితో దాడి చేశాడు.  తీవ్రంగా గాయపడ్డ బాధితురాలు ప్రస్తుతం ఆసుపత్రిలో కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది. ఈ ఘటన  హైదరాబాద్‌లోని జరిగింది. బర్కత్‌పురా సత్యానగర్ ప్రాంతానికి చెందిన విద్యార్థిని.. ఇంటర్ చదువుతోంది.  అదే ప్రాంతానికి చెందిన భరత్‌ అనే యువకుడు  ప్రేమించాలని ఆమెను కొంతకాలంగా వేధిస్తున్నాడు.  ఈ నేపథ్యంలో ఇవాళ మరోసారి ఆమెను అడ్డుకున్న నిందితుడు.. తనను ప్రేమించాలని ఒత్తిడి చేశాడు. ఒప్పుకోలేదనే ఆగ్రహంతో  ఊగిపోయిన భరత్‌...వెంట తెచ్చుకున్న కొబ్బరి బోండాల కత్తితో ఆమె మెడపై వేటు వేశాడు. అనంతరం ఘటనాస్థలం నుంచి పరారయ్యాడు. ఈ దారుణాన్ని చూసిన చుట్టపక్కలవారు వెంటనే పోలీసులు, అంబులెన్సుకు సమాచారం అందించారు. దీంతో బాధితురాలిని మలక్ పేటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితురాలి పరిస్థితి విషమంగా ఉందని ఆసుపత్రి వైద్యులు తెలిపారు.

కాగా, ఇంటర్‌ సెకండియర్‌ చదువుతున్న అమ్మాయి (17) వెంట పడుతూ..తరచూ భరత్‌ వేధిస్తున్న విషయం తల్లిదండ్రుల దృష్టికి వెళ్లడంతో గతవారం వారిద్దరినీ కౌన్సెలింగ్‌కు తీసుకెళ్లారు. అయినా, భరత్‌ తన ధోరణిని మార్చుకోలేదు. రెండురోజుల కిందట అమ్మాయి తల్లికి ఫోన్‌ చేసి బెదిరించాడు. అతడు కిరాతకంగా దాడి చేయడంతో మెడపై, పొట్టపై, చేతివేళ్లపై బాధితురాలికి తీవ్ర గాయాలయ్యాయి. 

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)