amp pages | Sakshi

బీర్‌ కోసం రక్తం చిందించాడు

Published on Sun, 05/27/2018 - 09:02

వాషింగ్టన్‌: బీర్‌ కోసం విమానంలో రచ్చ చేసిన తాగుబోతు.. దెబ్బలు తినటమే కాకుండా జైలు పాలయ్యాడు. అమెరికా ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఓ ఫ్లైట్‌లో ఈ ఘటన చోటు చేసుకోగా, అందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు నెట్‌లో హల్‌ చల్‌ చేస్తున్నాయి. వివరాల్లోకి వెళ్తే... వర్జిన్‌ ఐలాండ్స్‌ నుంచి మియామి వెళ్తున్న విమానంలో జాసన్‌ ఫెలిక్స్‌ అనే వ్యక్తి ప్రయాణిస్తున్నాడు.

అప్పటికే పీకలదాకా తాగిన ఫెలిక్స్‌ ఇంకా బీర్‌ కావాలంటూ ఫ్లైట్‌ సిబ్బందిని కోరాడు. అయితే వారు నిరాకరించారు. ‘నేను అసలు ఫ్లైట్‌ ఎక్కిందే మందు కోసం. మీరు బార్‌టెండర్‌లు. నాకు బీర్‌ కావాల్సిందే’ అని అతను అనటం, అవును మేం బార్‌టెండర్‌లమే కానీ, మీకు ఇంకా అదనంగా బీర్‌ ఇవ్వలేం’ అంటూ సిబ్బంది చెప్పటం వీడియోలో ఉంది. వాగ్వాదం ముదురుతున్న క్రమంలో  వెనకాలే నిల్చున్న ఓ వ్యక్తి  ఫెలిక్స్‌కు నచ్చజెప్పే యత్నం చేశాడు. చివరకు ఇద్దరి మధ్య మాటల యుద్ధం ముదిరి ఘర్షణకు దారితీసింది. గొడవలో ఫెలిక్స్‌ మూతి పగిలి రక్తం కారింది. చివరకు తోటి ప్రయాణికులు వారిద్దరినీ నిలువరించారు.

మియామీ చేరుకున్న తర్వాత ఫెలిక్స్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విమాన సిబ్బందితో గొడవకు దిగాడంటూ అతనిపై ఆరోపణలు నమోదు చేశారు. ఫెలిక్స్‌ను చితక్కొట్టింది ఆఫ్‌ డ్యూటీలో ఉన్న ఓ పోలీసాఫీసర్‌ అని తేలింది. బుధవారం ఈ ఘటన చోటు చేసుకున్నట్లు ఎఫ్‌బీఐ అధికారి ఒకరు తెలిపారు. నేరం రుజువైతే కోర్టు ఫెలిక్స్‌కు 20 ఏళ్ల జైలు శిక్షతోపాటు 2,50,000 డాలర్ల జరిమానాను విధించే అవకాశం ఉంది.

Videos

Watch Live: పాయకరావుపేటలో సీఎం జగన్ ప్రచార సభ

చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మన పాలన ఉంది

వైఎస్ భారతి ఎన్నికల ప్రచారం..హారతులతో స్వాగతం పలికిన మహిళలు

మాటలు చెప్పే ప్రభుత్వం కాదు...చేసి చూపించే ప్రభుత్వం..

కూటమి మేనిఫెస్టో పై ఉష శ్రీ చరణ్ సంచలన వ్యాఖ్యలు..

కూటమి మేనిఫెస్టో పై కొమ్మినేని కామెంట్స్

టీడీపీ మేనిఫెస్టో పై పేర్నినాని పంచులు

ఢిల్లీలో కలకలం.. 50 స్కూళ్లకు బాంబు బెదిరింపులు

జనసంద్రమైన బొబ్బిలి

ఇది అబద్దాల మేనిఫెస్టో..లెక్కలేసి భయపడుతున్న చంద్రబాబు..

Watch Live: బొబ్బిలిలో సీఎం జగన్ ప్రచార సభ

పవన్ కళ్యాణ్ కు ముద్రగడ సవాల్

సీఎం జగన్ ను చంపేందుకు కుట్ర..!

శ్రీశైలం టీడీపీ అభ్యర్థి బండ బూతులు..

గుండె నిండా కేసీఆర్..

అట్టర్ ఫ్లాప్..

జనసేన పరువు తీసిన చింతమనేని

పవన్ కళ్యాణ్, చిరంజీవి కుట్ర బయటపెట్టిన కేఏ పాల్

వాసుపల్లి గణేష్ కుమార్ ఎన్నికల ప్రచారం

YSRCP ఎమ్మెల్యే అభ్యర్థి కావటి మనోహర్ నాయుడిపై దాడికి యత్నం

Photos

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్