amp pages | Sakshi

పెళ్లికి నిరాకరించాడని..

Published on Sun, 06/17/2018 - 09:53

కేతేపల్లి (నకిరేకల్‌) : ప్రేమించిన వ్యక్తి పెళ్లికి నిరాకరించడంతో ప్రియురాలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ సంఘటన కేతేపల్లి మండలంలోని కొండకిందిగూడెంలో శనివారం చోటు చేసుకుంది. ప్రేమించి పెళ్లికి నిరాకరించాడని ఆరోపిస్తూ   కేతేపల్లి మండలంలోని కొత్తపేట గ్రామానికి చెందిన మంద మౌనిక ఇదే మండలంలోని కొండకిందిగూడెం గ్రామానికి చెందిన పెరిక చంటి ఇంటి ఎదుట మహిళా మండలి సభ్యులతో కలసి రెండు రోజుల నుంచి ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఆందోళన విషయం తెలిసి ఇంటికి తాళం వేసి మొదటి రోజే పరారైన చంటి కుటుంబ సభ్యులు రెండ్రోజులైన ఇంటికి చేరుకోలేదు. తనను పెళ్లి చేసుకోవాలని చంటి ఇంటి ఎదుట ఆందోళన చేస్తున్నా అతడి కుటుంబ సభ్యుల నుంచి ఎలాంటి స్పందన లేదు.

దీంతో మనస్తాపం చెందిన మౌనిక  శనివారం తాను ఆందోళన చేస్తున్న శిబిరం వద్దనే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. అపస్మారక స్థితిలో ఉన్న మౌనికను వెంట ఉన్న మహిళలు గమనించి నకిరేకల్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక వైద్యం చేసిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నల్లగొండ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మౌనికను నల్లగొండ డీఎస్పీ సుదాకర్‌ కలసి వివరాలు సేకరించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిపై అక్కడి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. 

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)