amp pages | Sakshi

అలా తాకితే లైంగిక వేధింపులు కాదు: కోర్టు

Published on Fri, 11/03/2017 - 10:02

సాక్షి, న్యూఢిల్లీ : పనిచేసే సంస్థల్లో మహిళలపై వేధింపులు జరుగుతున్న మాట వాస్తవమే కానీ అలాగనీ ప్రతి విషయాన్ని లైంగిక వేధింపులుగా పరిగణించలేమని ఢిల్లీ హైకోర్టు అభిప్రాయపడింది. సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (సీఆర్ఆర్ఐ) మాజీ సైంటిస్టుపై నమోదైన లైంగిక వేధింపుల కేసు విచారణలో భాగంగా గురువారం జస్టిస్ విభు భక్రూ ఆ తీర్పును వెల్లడించారు. సహోద్యోగినిని ఆయన తాకారని, కానీ అప్పుడు జరిగిన విషయాన్ని వేధింపులుగా చూడలేమని ధర్మాసనం స్పష్టం చేసింది.

'కార్యాలయాల్లోగానీ ఇతర ఏదైనా సంస్థల్లోగానీ విధులలో భాగంగా పొరపాటున పురుష, మహిళా ఉద్యోగులు పరస్పరం ఒకరినొకరు తాకే అవకాశాలున్నాయి. అలా తాకినంత మాత్రానా ప్రతి విషయాన్ని లైంగిక వేధింపులు జరిగినట్లుగా చూడలేం. చెడు ఉద్దేశంతో మహిళలను బలవంతంగా తాకడం లైంగిక వేధింపులకు దారి తీసే అవకావం ఉంది. అలాంటి సందర్భాల్లో బాధిత మహిళలు వేధింపులపై ఫిర్యాదు చేయవచ్చు'నంటూ ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి విభు బక్రూ తెలిపారు.

2005 ఏప్రిల్ లో సహోద్యోగి తనను తాకాడని ఆరోపిస్తూ ఓ మహిళా సైంటిస్ట్ లైంగిక వేధింపులపై ఫిర్యాదు చేశారు. 'నేను ల్యాబ్‌లో పని చేస్తుండగా నా సహోద్యోగి గదిలోకి వచ్చాడు. నా చేతిని పట్టుకుని లాగాడు. చేతిలో ఉన్న శాంపిల్స్ ను తీసుకుని కింద పడేశాడు. ఆపై రూము నుంచి బయటకు నెట్టేశాడంటూ' మహిళా సైంటిస్ట్ తన సహోద్యోగిపై లైంగిక వేధింపుల కేసు పెట్టారు. 'ఆ (పురుష) సైంటిస్ట్ ఆమె చేసిన పనిని అడ్డుకున్నట్లు తెలుస్తోంది. ఆవేశంలో ఆమెను చేతి పట్టుకుని లాగినట్లు అర్థం చేసుకోవచ్చు. తాకడాన్ని సాకుగా చూపించి లైంగికంగా వేధించాడంటూ ఫిర్యాదు చేయడం సబబుకాదని, వేధింపులు నిజంగానే జరిగితే కఠిన శిక్షలు విధిస్తామని' ధర్మాసనం అభిప్రాయపడింది. తప్పుడు ఆరోపణలు చేస్తూ ఫిర్యాదు చేసిన మహిళా సైంటిస్ట్‌ను మందలించినట్లు తెలుస్తోంది. 

Videos

అమెరికాలో ప్రమాదంలో ప్రాణాలు విడిచిన తెలంగాణ యువకుడు

చంద్రబాబుకి బయపడి గుళ్లలో తలా దాచుకుంటున్నారు..

తాడిపత్రి హింసాత్మక ఘటనల వెనుక అసలు హస్తం

కుప్పం నుండి ఇచ్చాపురం వరకు అందుకే పోలింగ్ శాతం పెరిగింది

పోలీసులు ఏ రాజకీయ పార్టీల ప్రలోభాలకు లోను కాకుండా నిస్పక్షపాతంగా పనిచెయ్యాలి

ఏపీ ఎన్నికల అల్లర్ల పై సిట్ విచారణ.. ఇప్పటికే పోలీసుల ఫై వేటు

మోడీపై పోటీ చేస్తున్న శ్యామ్ కు షాక్..

మాట నిలబెట్టుకునే మా అన్నకు మా ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి

అచ్చెన్నాయుడు రిగ్గింగ్.. అడ్డుకున్న వారిపై దాడి

ప్రేమ పేరుతో యువకుడిని మోసం చేసిన యువతి

Photos

+5

Sangeetha Sringeri: పునీత్‌ రాజ్‌కుమార్‌ సమాధి వద్ద నటి బర్త్‌డే సెలబ్రేషన్స్‌ (ఫొటోలు)

+5

సంతోషంలో కావ్యా మారన్‌.. కేన్‌ విలియమ్సన్‌ను పలకరించి మరీ! (ఫొటోలు)

+5

అభిషేక్‌ శర్మ తల్లి పాదాలకు నమస్కరించిన శుబ్‌మన్‌ .. ఫొటోలు వైరల్‌

+5

ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా?.. ఫేమస్‌ టీటీ ప్లేయర్‌!(ఫొటోలు)

+5

ఒకప్పుడు చిన్నపాటి గదిలో.. ఇప్పుడు హీరోలకు ధీటుగా రూ.550 కోట్ల సంపద.. ఎవరో గుర్తుపట్టారా? (ఫొటోలు)

+5

Sireesha: భర్తతో విడాకులు.. ట్రెండింగ్‌లో తెలుగు నటి (ఫోటోలు)

+5

ఫ్యాన్స్‌లో నిరాశ నింపిన వర్షం.. తడిసిన ఉప్పల్ స్డేడియం (ఫోటోలు)

+5

లవ్‌ మీ సినిమా స్టోరీ లీక్‌ చేసిన బ్యూటీ, క్లైమాక్స్‌ కూడా చెప్పకపోయావా! (ఫోటోలు)

+5

Hyderabad Heavy Rains: హైదరాబాద్‌లో కుండపోత వాన.. భారీగా ట్రాఫిక్‌ జాం (ఫొటోలు)

+5

‘సర్‌.. నేను మీ అమ్మాయిని లవ్‌ చేస్తున్నా’.. 13 ఏళ్ల ప్రేమ, పెళ్లి! (ఫొటోలు)