amp pages | Sakshi

బిగుస్తున్న ఉచ్చు!

Published on Sat, 12/22/2018 - 10:24

సాక్షి, సిటీబ్యూరో: భోజగుట్ట సహా నగరంలోని రూ.వందల కోట్ల భూములకు ‘పేపర్‌ యజమాని’గా ఉండి గత ఏడాది మృతి చెందిన మావూరి శివభూషణం నిందితుడిగా ఉన్న పెక్‌ ఇండియా కేసులో సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. భోజగుట్ట ల్యాండ్‌స్కామ్‌లో నిందితులుగా ఉన్న వారి ప్రమేయాన్ని అనుమానిస్తూ ఆ కోణంలో దర్యాప్తు చేపట్టింది. భోజగుట్ట స్కామ్‌లో నిందితుడిగా ఉండి అరెస్టైన ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి, న్యాయవాది శైలేష్‌ సక్సేనల ద్వారా రంగంలోకి దిగిన శివభూషణం పేరుతో భూ కబ్జాల కోసం సృష్టించిన నకిలీ చిరునామాలే పెక్‌ ఇండియాను మోసం చేయడానికీ వాడారు. పెక్‌ ఇండియా సంస్థను రూ.531 కోట్లు మోసం చేసిన ఆరోపణలపై సీబీఐ ఢిల్లీ విభాగం గత ఏడాది వివిధ సంస్థలు, వ్యక్తులతో సహా 15 మందిపై కేసు నమోదు చేసింది. ఇందులో ఏడో నిందితుడిగా శివభూషణం, ఎనిమిదో నిందితుడిగా ఎం.శ్రీనివాస్‌ ఉన్నారు. గోషామహల్‌లోని చిరునామాలను వీరికి చెందినవిగా  సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొంది. దీపక్‌రెడ్డి, శైలేష్‌ సక్సేనలతో కలిసి సిటీలో భూ కబ్జాల కోసం సృష్టించిన నకిలీ పత్రాల్లో మావూరి శివభూషణం పేర్కొన్న చిరునామాల్లో ఈ గోషామహల్‌ చిరునామా కూడా ఒకటి.

కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో పని చేసే ది ప్రాజెక్టŠస్‌ అండ్‌ ఎక్విప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (పెక్‌) ఇండియా లిమిటెడ్‌ దేశంలో ఎక్స్‌పోర్ట్స్‌ అండ్‌ ఇంపోర్ట్స్‌ వ్యాపారం చేసే వారికి గ్యారంటర్‌గా వ్యవహరిస్తుంది. ముంబైకి చెందిన ప్రైసీస్‌ ఎగ్జిమ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, జెట్‌లింక్‌ ఇన్ఫోటెక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ 2010–12 మధ్య పెక్‌తో ఒప్పందాలు చేసుకుని రూ.348 కోట్లు ఆర్థిక సాయం తీసుకున్నాయి. ఇవి 2016 నాటికి పెక్‌కు వడ్డీతో కలిపి రూ.531 కోట్లు బకాయిపడ్డాయి. అప్పుడే థర్డ్‌ పార్టీ హోదాలో హైదరాబాద్‌కు చెందిన శివభూషణం అనే వ్యక్తి రంగ ప్రవేశం చేశాడు. కొత్వాల్‌గూడలో తనకు ఉన్న 1820 ఎకరాలను హామీగా పెడుతున్నానంటూ పత్రాలు దాఖలు చేశాడు. దీనిని అమ్మి బకాయిలు తీర్చుకునేందుకు పెక్‌ ఉపక్రమించడంతో అడ్డం తిరిగిన శివభూషణం రంగారెడ్డి కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీంతో ఆయన ఇచ్చిన స్థలం పత్రాలు పరిశీలించిన పెక్‌ నకిలీవిగా తేల్చింది. ఈ వ్యవహారంపై సీబీఐకి ఫిర్యాదు చేయగా... హైదరాబాద్‌కు చెందిన ముగ్గురితో పాటు సంస్థలు, వ్యక్తులు కలిపి 15 మందిపై కేసు నమోదైంది. ఈ ఎఫ్‌ఐఆర్‌లో  ఎం.శివభూషణంగా చెప్పుకున్న వ్యక్తి చిరునామా ‘హౌస్‌ నెం.14–2–327, గోషామహల్, హైదరాబాద్‌గా సీబీఐ పేర్కొంది.

ఇదే ఆ ఎం.శివభూషణం... దీపక్‌రెడ్డి, శైలేష్‌ సక్సేనలు రంగంలోకి దింపిన మావూరి శివభూషణం ఒక్కరే అని అనుమానించడానికి కారణమైంది. హైదరాబాద్‌తో పాటు చుట్టుపక్కల ఉన్న ఖరీదైన స్థలాలను కబ్జా చేయడానికి  శైలేష్‌ సక్సేన, దీపక్‌రెడ్డి నకిలీ పత్రాలతో పాటు బోగస్‌ వ్యక్తులను రంగంలోకి దింపారు. అలాంటి వారిలో మావూరి శివభూషణం కూడా ఒకరు. ఈ బోగస్‌ వ్యక్తుల ద్వారా ఏ కోర్టులో పిటిషన్‌ వేయించాలన్నా... ప్రభుత్వ అధికారులకు దరఖాస్తు చేయించాలన్నా అడ్రస్‌ అవశ్యం. పిటిషన్‌ దాఖలు చేయించేది బోగస్‌ వ్యక్తులతో కావడంతో ఈ ముఠా కొన్ని చిరునామాలనూ సృష్టించింది. సదరు పత్రాలను పరిశీలించిన పోలీసులు వీరు ప్రధానంగా ఆరు చిరునామాలను వాడినట్లు తేల్చారు. ఆ ఆరింటిలో ‘హౌస్‌ నెం.14–2–327, గోషామహల్, హైదరాబాద్‌’ కూడా ఒకటి. ఈ చిరునామా సారూప్యతను పరిగణలోకి తీసుకుంటున్న అధికారులు సీసీఎస్, సీబీఐ కేసుల్లో ఉన్న శివభూషణాలు ఒకరిగా అనుమానిస్తున్నారు. ఈ విషయాన్ని లోతుగా ఆరా తీసిన సీబీఐ నిందితుల్లో ఒకరిగా నిర్ధారించింది. అయితే అతడిని విచారించే లోపే చనిపోయాడు. దీంతో శ్రీనివాస్‌తో పాటు శైలేష్‌ సక్సేనను రెండుసార్లు సీబీఐ అధికారులు విచారించారు. శైలేష్‌ నుంచి తమకు అవసరమైన సమాచారం రాలేదని సీబీఐ చెబుతోంది. ఈ నేపథ్యంలోనే త్వరలో ఆయనకు నోటీసులు జారీ చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఆపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు ఈ స్కామ్‌ వెనుక ఉన్న పెద్దమనుషుల వివరాలూ ఆరా తీయాలని సీబీఐ అధికారులు నిర్ణయించారు.

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)