amp pages | Sakshi

నిర్భయ కేసులో బుక్కైన హీరో బావ

Published on Thu, 04/05/2018 - 16:55

సాక్షి, ముంబై : ఎయిర్‌హోస్టెస్‌కు మత్తుమందు ఇచ్చి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డ వ్యక్తిని ముంబై పోలీసులు అరెస్ట్‌ చేశారు. అయితే విచారణలో అతను బాలీవుడ్‌ నటుడు అర్జున్‌ రామ్‌పాల్‌ బావ అని తేలటంతో వ్యవహారం బాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది. 

ముంబై మిర్రర్‌ కథనం ప్రకారం.. ఇన్వెస్టర్‌ అయిన అమిత్‌ గిల్‌కు నటుడు అర్జున్‌ రామ్‌పాల్‌ సోదరి కోమల్‌తో కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. మూడేళ్ల క్రితం ఓ ప్రైవేట్‌ ఎయిర్‌లైన్స్‌లో పని చేసే ఎయిర్‌హోస్టెస్‌ ఒకరు గిల్‌ను నమ్మి రూ.18 లక్షలు పెట్టుబడి పెట్టింది. అయితే తర్వాత గిల్‌ నుంచి ఎలాంటి స్పందన లేకపోవటంతో ఆమె నిలదీయగా.. గిల్‌ ఆమెకు ఓ చెక్‌ ఇచ్చాడు. అది కాస్త బౌన్స్‌ కావటంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేస్తానని అతన్ని బెదిరించింది. దీంతో రూ. 12 లక్షలు చెల్లించాడు. ఇక మిగిలిన సొమ్ము కోసం ఆమెను పదే పదే తన ఆఫీస్‌ చుట్టూ తిప్పించుకున్నాడు. 

ఈ క్రమంలో ఓరోజు ఆఫీస్‌కు వచ్చిన ఆమెకు మత్తు మందు కలిపిన కూల్‌ డ్రింకు ఇచ్చి ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఆపై ఆమెను నగ్నంగా ఫోటోలు తీసి వేధించటం ప్రారంభించాడు. రెండేళ్లపాటు అతని వేధింపులను భరించిన ఆమె చివరకు సాంటాక్రూజ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తులో అతని వేధింపులు నిజమని తేలటంతో చివరకు అతన్ని అరెస్ట్‌ చేశారు. కాగా, ఈ ఘటనపై స్పందించేందుకు రామ్‌పాల్‌ నిరాకరించారు. అమిత్‌ గిల్‌పై నిర్భయ కేసు దాఖలు చేసినట్లు ముంబై కమీషనర్‌ వెల్లడించారు.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)