అక్రమంగా తరలిస్తున్న అలుగు స్వాధీనం

Published on Tue, 02/12/2019 - 08:19

తూర్పుగోదావరి, వీఆర్‌పురం (రంపచోడవరం): అక్రమంగా తరలిస్తున్న అలుగును అటవీశాఖాధికారులు దాడి చేసి స్వాధీనపరచుకొని, ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. మండల పరిధి పాతరాజుపేటలో సోమవారం ఈ ఘటన చోటుచేసుకొంది. రేంజర్‌ శ్రీనివాస్‌రెడ్డి కథనం ప్రకారం.. పాతరాజుపేట గ్రామంలోని ఒక ప్రదేశంలో అడవి అలుగును దాచి ఉంచారన్న సమాచారం తెలుసుకున్న రేంజర్‌ సిబ్బందితో దాడి చేశారు.

దీంతో అక్కడున్న నలుగురు దుండగులు ఫారెస్ట్‌ అధికారులు రావడాన్ని పసిగట్టి అలుగును వదిలేసి ఆ ప్రదేశం నుంచి పారిపోయే ప్రయత్నం చేశారు. సిబ్బంది వారిని వెంబడించి పట్టుకునే ప్రయత్నం చేయగా అందులో ముగ్గురు దొరకగా మరో వ్యక్తి పరారయ్యాడు. ఆ ముగ్గురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామని రేంజర్‌ చెప్పారు. వాలుగను విశాఖ అటవీ ప్రాంతం నుంచి తీసుకువచ్చినట్టు పొంతనలేని సమాధానాలను నిందితులు చెబుతున్నారని ఆయన తెలిపారు. పూర్తి వివరాలు ఇంకా వెల్లడి కావాల్సి ఉందన్నారు. ఈ దాడిలో డీఆర్‌ఓ వీరన్నరాజు, ఎఫ్‌ఎస్‌ఓలు జి.భిక్షం, టి.సాయి, దేశయ్య,ఆరీఫ్‌ ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ