amp pages | Sakshi

జనవరిలో టోకు ధరల ఉపశమనం!

Published on Fri, 02/16/2018 - 00:15

న్యూఢిల్లీ: టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం 2018 జనవరిలో 2.84 శాతంగా నమోదయ్యింది. అంటే 2017 జనవరితో పోల్చితే 2018 జనవరిలో టోకు ధరలు 2.84 శాతం పెరిగాయన్నమాట.  గడచిన ఆరు నెలల కాలంలో ఇంత తక్కువ స్థాయిలో ద్రవ్యోల్బణం నమోదు కావడం ఇదే తొలిసారి. అయితే కూరగాయల ధరలు మాత్రం టోకున సామాన్యునికి భారంగానే ఉన్నాయి. కాగా 2017 డిసెంబర్‌లో టోకు ద్రవ్యోల్బణం 3.58 శాతం అయితే, జనవరిలో ఈ రేటు 4.26 శాతంగా ఉంది. ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం...

మూడు ప్రధాన విభాగాలూ వేర్వేరుగా...
  ప్రైమరీ ఆర్టికల్స్‌: ఫుడ్‌ ఆర్టికల్స్, నాన్‌–ఫుడ్‌ ఆర్టికల్స్‌తో కూడిన ఈ విభాగంలో ద్రవ్యోల్బణం వార్షిక ప్రాతిపదికన 2.37 శాతంగా ఉంది. ఇందులో ఫుడ్‌ ఆర్టికల్స్‌కు సంబంధించి ఈ రేటు 3 శాతంగా ఉంటే, నాన్‌–ఫుడ్‌ ఆర్టికల్స్‌లో మాత్రం ధరలు అసలు పెరక్కపోగా –1.23 శాతం తగ్గాయి.  
ఫ్యూయెల్‌ అండ్‌ పవర్‌: ద్రవ్యోల్బణం పెరుగుదల రేటు 4.08 శాతంగా ఉంది.  
తయారీ: మొత్తం సూచీలో దాదాపు 60 శాతం ఉన్న ఈ విభాగంలో రేటు 2.78 శాతంగా ఉంది.  

ఉల్లి ధర... కన్నీరు!
డిసెంబర్‌ 2017లో 4.72 శాతంగా ఉన్న ఫుడ్‌ ఆర్టికల్స్‌ ద్రవ్యోల్బణం రేటు జనవరిలో 3 శాతానికి తగ్గింది.  కూరగాయల ధరలు 56.46 శాతం (డిసెంబర్‌) నుంచి 40.77 శాతానికి తగ్గినా, ఇదీ సామాన్యునికి భారంగానే ఉంటుందన్నది గమనార్హం. ఇక ఉల్లి ధర జనవరిలో ఏకంగా 194 శాతం పెరిగింది.

పప్పు దినుసుల ధరలు 30.43 శాతం తగ్గాయి. గోధుమల ధరలు 6.94 శాతం తగ్గగా, తృణ ధాన్యాల ధరలు 1.98 శాతం తగ్గాయి. ప్రొటీన్‌ ఆధారిత గుడ్లు, మాంసం, చేపల ధరలు 0.37 శాతం తగ్గితే, పండ్ల ధరలు 8 శాతం పైగా పెరిగాయి. ఈ వారం ప్రారంభంలో ప్రభుత్వం విడుదల చేసిన జనవరి రిటైల్‌ ద్రవ్యోల్బణం 5.07 శాతంగా నమోదయిన సంగతి తెలిసిందే.

#

Tags

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)