amp pages | Sakshi

నియంత్రణ లేని అభివృద్ధే వాతావరణ మార్పులకు కారణం

Published on Fri, 09/27/2019 - 05:08

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: జనాభా పెరుగుదల, వలసలు, నియంత్రణ లేని అభివృద్ధి వంటి  కారణాల వల్ల సహజ వనరులు దోపిడీకి గురువుతున్నాయని, ఇవే వాతావరణ మార్పులకు ప్రధాన కారణాలని తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ డాక్టర్‌ తమిళిసై సుందరరాజన్‌ అన్నారు. ప్రభుత్వం నుంచి బలవంతంగా పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు కాకుండా స్వచ్ఛందంగా బాధ్యతాయుతమైన పౌరుడిగా పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని గుర్తు చేశారు. గురువారమిక్కడ 17వ సీఐఐ–ఐజీబీసీ గ్రీన్‌ బిల్డింగ్‌ కాంగ్రెస్‌–2019 ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా హాజరైన గవర్నర్‌ తమిళిసై మాట్లాడుతూ.. రోజువారీ కార్యకలాపాలతో సహజ వనరులను సంరక్షించుకోవచ్చని సూచించారు. అనంతరం సీఐఐ గోద్రెజ్‌ జీబీసీ చైర్మన్‌ జంషేడ్‌ ఎన్‌ గోద్రెజ్‌ మాట్లాడుతూ.. మౌలిక, భవన నిర్మాణ రంగాల్లో నీటి సంరక్షణ, వాటర్‌ రీసైక్లింగ్‌లకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. అన్ని రకాల పరిశ్రమల్లో జీరో కార్బన్‌ ఉద్ఘారాల స్థితికి చేరుకోవాలన్నారు. మూడు రోజుల గ్రీన్‌ బిల్డింగ్‌ కాంగ్రెస్‌–2019లో సుమారు వందకు పైగా కంపెనీలు గ్రీన్‌ బిల్డింగ్‌ ఉత్పత్తులు, టెక్నాలజీలను ప్రదర్శించాయి. ఈ కార్యక్రమంలో ఐజీబీసీ చైర్మన్‌ వీ సురేష్, సీఐఐ–ఐజీబీసీ హైదరాబాద్‌ చాప్టర్‌ చైర్మన్‌ సి. శేఖర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Videos

ఎన్నికల్లో విజయంపై మేం ఫుల్ కాన్ఫిడెన్స్ గా ఉన్నాం

హింసా రాజకీయాలకు చంద్రబాబు పెట్టింది పేరు..

వాటే స్కెచ్.. ప్రియుడి మోజులో పడి భర్తను కడతేర్చిన భార్య..

ఓటమి భయం

గులాబీ పార్టీ బలం పెరిగిందా ?..తగ్గిందా ?

ఏపీ బీజేపీని వెంటాడుతున్న ఓటమి భయం..

వైఎస్ జగన్ విస్పష్ట సందేశం

గాడ్ ఆఫ్ మాసెస్.. రీఎంట్రీ

వైభవంగా గంగమ్మ జాతర..

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ ఫుల్ క్లారిటీ

Photos

+5

Sireesha: భర్తతో విడాకులు.. ట్రెండింగ్‌లో తెలుగు నటి (ఫోటోలు)

+5

ఫ్యాన్స్‌లో నిరాశ నింపిన వర్షం.. తడిసిన ఉప్పల్ స్డేడియం (ఫోటోలు)

+5

లవ్‌ మీ సినిమా స్టోరీ లీక్‌ చేసిన బ్యూటీ, క్లైమాక్స్‌ కూడా చెప్పకపోయావా! (ఫోటోలు)

+5

Hyderabad Heavy Rains: హైదరాబాద్‌లో కుండపోత వాన.. భారీగా ట్రాఫిక్‌ జాం (ఫొటోలు)

+5

‘సర్‌.. నేను మీ అమ్మాయిని లవ్‌ చేస్తున్నా’.. 13 ఏళ్ల ప్రేమ, పెళ్లి! (ఫొటోలు)

+5

మిస్టర్‌ అండ్ మిసెస్ మహీ చిత్రంలో జాన్వీ.. ధోనిపై ఆసక్తికర కామెంట్స్ చేసిన భామ (ఫొటోలు)

+5

International Family Day: ఐపీఎల్‌ స్టార్లు, కెప్టెన్ల అందమైన కుటుంబాలు చూశారా? (ఫొటోలు)

+5

వారి కోసం విరుష్క స్పెషల్‌ గిఫ్ట్‌.. ఎందుకంటే? (ఫొటోలు)

+5

తిరుపతి కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన యువకుడు

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ నటుడు ఎమోషనల్‌ (ఫోటోలు)