amp pages | Sakshi

ఉబెర్‌ కో ఫౌండర్‌ సంచలన నిర్ణయం

Published on Sat, 03/03/2018 - 20:18

న్యూయార్క్‌: ఒకవైపు బిట్‌కాయిన్‌పై ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన, పలురకాల నిషేధం కొనసాగుతోంటే ఉబెర్‌ కో ఫౌండర్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పీర్-టు-పీర్ రైడ్‌ షేరింగ్‌, ఫుడ్ డెలివరీ,  ట్రావెల్ నెట్‌వర్క్ సంస్థ ఉబెర్ సహ వ్యవస్థాపకుడు గ్యారెట్‌ క్యాంప్‌ త్వరలో  కొత్త క్రిప్టోకరెన్సీని లాంచ్‌ చేయనునున్నారు. యాక్సిలరేటర్ ఫండ్ ఎక్స్‌పా ఫౌండర్‌ కూడా అయిన క్యాంప్‌ ‘ఎకో’  పేరుతో కొత్త బిట్‌కాయిన్‌ను  అందుబాటులోకి తేనున్నారు.  దీన్ని డిజిటల్‌ గ్లోబల్‌ కరెన్సీగా మార్చాలని ఆయన భావిస్తున్నారు.  తద్వారా ప్రపంచవ్యాప్తంగా  రోజువారీ వినియోగ లావాదేవీలకు  ఒక ప్రధాన పేమెంట్‌ సాధనంగా చేయాలని ప్లాన్‌ చేస్తున్నారు.  క్యాంప్‌తో పాటు ఎక్స్‌పా అనుబంధంగా ఉన్న కొందరు భాగస్వాములు కూడా ఈ  ప్రాజెక్ట్‌ ఆపరేటింగ్ బడ్జెట్‌లో​  10 మిలియన్ డాలర‍్ల పెట్టుబడులను సమకూర్చారు.

టెక్ క్రంచ్  అందించిన సమాచారం ప్రకారం ప్రాథమికంగా ఒక ట్రిలియన్‌ టోకెన్లను జారీ చేయనున్నారు. వీటిలో సగం ధృవీకరించబడిన అకౌంట్లకు కేటయిస్తారు. మిగిలిన సగంలో  20శాతం విశ్వవిద్యాలయాలు నడుపుతున్న విశ్వసనీయ సంస్థలకు, 10శాతం అడ్వైజర్లకు, 10శాతం వ్యూహాత్మక భాగస్వాములకు కేటాయిస్తారు. ఇక మిగిలిన పది శాతాన్ని నెట్‌వర్క్‌ మేనేజ్‌మెంట్‌ నిర్వహణ, బాధ్యతలకోసం కొత్తగా ఏర్పాటయ్యే ఇకో ఫౌండేషన్‌కు కేటాయిస్తారు.  51శాతం సెక్యూరిటీ ఎటాక్స్‌ను, మోసాలను, ఇతర సమస్యలను తొలగిస్తుందనీ, ఎకోను ఎవరూ విచ్ఛినం చేయలేరని ధీమాగా చెబుతున్నారు.

అంతేకాదు క్రిప్టోకరెన్సీ లావాదేవీల్లో ఉండే కొన్ని ప్రధాన  సమస్యల్ని  అధిగమించాలని భారీ కసరత్తు చేస్తోంది.  అదేవిధంగా తమ కొత్త  బిట్‌కాయన్‌  ఎకోను మరింత  యూజర్‌ ఫ్రెండ్లీ గా రూపొందించాలని భావిస్తోంది. ముఖ్యంగా టెక్నికల్‌ సామర్ధ్యంతో సంబంధం లేకుండా  వెబ్, మొబైల్ యాప్‌ ప్లాట్‌ఫారంలలాగా వినియెగారులకు సులభంగా అందుబాటులో ఉండాలని యోచిస్తోంది. టోకెన్‌ జనరేషన్‌, ట్రాన్సాక్షన్‌ వెరిఫికేషన్‌ సందర్భంలోనూ మరింత  శక్తివంతంగా, సురక్షితంగా ఉండాలని కోరుకుంటోంది.

Videos

అచ్చెన్నాయుడు సొంత గ్రామంలో టీడీపీ రిగ్గింగ్ బయటపడ్డ వీడియో

ఓటేస్తే చంపేస్తారా..! మహిళలపై ఇంత దారుణమా..!

ఇదే సాక్ష్యం... సంచలన నిజాలు బయటపెట్టిన KSR

టీడీపీకి ఓటు వేయలేదని బంధించి హింసించిన TDP నేతలు ..

అనిల్ కుమార్, కాసు మహేష్ ల పైకి కర్రలతో టీడీపీ మూకలు

ప్రశాంత్ కిషోర్ పై విరుచుకుపడ్డ అనలిస్ట్ KS ప్రసాద్

కవిత ఛార్జ్ షీట్ పై నేడు విచారణ..

వైఎస్సార్సీపీ నేతల ఇళ్లకు నిప్పు పెట్టిన టీడీపీ..

అట్టహాసంగా మోడీ నామినేషన్

అక్కడ రీ-పోలింగ్ ?

Photos

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

హీరోగా యూట్యూబర్‌ నిఖిల్.. సంగీత్‌ సినిమా లాంఛ్‌ (ఫోటోలు)

+5

Royal Challengers Bengaluru: తిరుమ‌ల శ్రీవారి సేవ‌లో ఆర్సీబీ క్రికెట‌ర్లు (ఫొటోలు)

+5

పిఠాపురం: సీఎం జగన్‌ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)

+5

CM Jagan Kaikalur Meeting: కైకలూరు.. జనహోరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ రోడ్‌ షో: జనసంద్రమైన చిలకలూరిపేట (ఫొటోలు)

+5

తాగుడుకు బానిసైన టాలీవుడ్‌ హీరోయిన్‌.. జీవితమే తలకిందులు.. ఒక్కసారిగా.. (ఫోటోలు)

+5

కడపలో సీఎం జగన్‌ ఎన్నికల రోడ్‌ షో: ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

పుత్తూరులో సీఎం జగన్‌ రోడ్‌ షో: పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)