amp pages | Sakshi

వాణిజ్య యుద్ధం కన్నా...  డాలర్‌ కీలకం 

Published on Mon, 06/25/2018 - 02:06

అంతర్జాతీయంగా న్యూయార్క్‌ కమోడిటీ ఎక్సే్ఛంజ్‌– నైమెక్స్‌లో పసిడి ఔన్స్‌ (31.1గ్రా) ధర 22వ తేదీతో ముగిసిన వారంలో 11 డాలర్లు తగ్గి 1,271 డాలర్ల వద్ద ముగిసింది. వరుసగా 2 వారాల్లో 23 డాలర్లు పతనమైంది. ఒకదశలో పసిడి ఆరు నెలల కనిష్ట స్థాయి 1,264 డాలర్లను కూడా చూడ్డం గమనార్హం. డాలర్‌ ఇండెక్స్‌ 11 నెలల కనిష్ట స్థాయి 95.16ను తాకడం దీనికి నేపథ్యం. వారాంతానికి డాలర్‌ తిరిగి వారం వారీగా 71 సెంట్ల నష్టంతో 94.19కి తిరిగి వచ్చిన నేపథ్యంలో పసిడి కూడా కొంత కోలుకుని 1,271 డాలర్ల వద్ద వారంలో ముగిసింది. వాణిజ్య యుద్ధానికి సంబంధించి అమెరికా–చైనాల మధ్య తీవ్ర పరిస్థితులు ఈ వారంలోనే ఏర్పడ్డం ఇక్కడ కీలకాంశం. అయితే ఈ వాణిజ్య అనిశ్చితి పరిస్థితుల కన్నా, డాలర్‌ కదలికలపైనే పసిడి ఆధారపడినట్లు కనిపించింది. దీని ప్రకారం– డాలర్‌ ఇండెక్స్‌ తిరిగి బలోపేతమై 95 దాటితే పసిడి 1,250 డాలర్ల దిగువకు వచ్చే అవకాశం ఉందన్నది విశ్లేషణ.   1,280–1,270 డాలర్ల శ్రేణి మద్దతు స్థాయిని కోల్పోతే, మరింత అమ్మకాల ఒత్తిడితో పసిడి 1,240 డాలర్ల వరకూ పడే అవకాశం ఉందన్నది నిపుణుల అభిప్రాయం.  

దేశంలో భారీ పతనం... 
అంతర్జాతీయంగా పసిడి ధర పతనానికి తోడు,  22వ తేదీతో ముగిసిన వారంలో డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ బలపడ్డ (0.61 పైసల లాభంతో  67.86 వద్ద ముగింపు) నేపథ్యంలో దేశీయంగా పసిడి ధర భారీగా పడింది. ఫ్యూచర్స్‌ మార్కెట్‌– మల్టీ కమోడిటీ ఎక్సే్ఛంజ్‌ (ఎంసీఎక్స్‌)లో పసిడి 10 గ్రాముల ధర వారంలో రూ.400 తగ్గి రూ.30,610కి చేరింది. ఇక ముంబై ప్రధాన స్పాట్‌ మార్కెట్‌లో  99.9, 99.5 స్వచ్ఛత గల పసిడి ధరలు వారంలో రూ.630 చొప్పున తగ్గి రూ.30,620, రూ.30,400 వద్ద ముగిశాయి. కాగా వెండి కేజీ ధర భారీగా రూ.1,780 లాభపడి రూ.39,735కు పెరిగింది.   

Videos

అచ్చెన్నాయుడు సొంత గ్రామంలో టీడీపీ రిగ్గింగ్ బయటపడ్డ వీడియో

ఓటేస్తే చంపేస్తారా..! మహిళలపై ఇంత దారుణమా..!

ఇదే సాక్ష్యం... సంచలన నిజాలు బయటపెట్టిన KSR

టీడీపీకి ఓటు వేయలేదని బంధించి హింసించిన TDP నేతలు ..

అనిల్ కుమార్, కాసు మహేష్ ల పైకి కర్రలతో టీడీపీ మూకలు

ప్రశాంత్ కిషోర్ పై విరుచుకుపడ్డ అనలిస్ట్ KS ప్రసాద్

కవిత ఛార్జ్ షీట్ పై నేడు విచారణ..

వైఎస్సార్సీపీ నేతల ఇళ్లకు నిప్పు పెట్టిన టీడీపీ..

అట్టహాసంగా మోడీ నామినేషన్

అక్కడ రీ-పోలింగ్ ?

Photos

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

హీరోగా యూట్యూబర్‌ నిఖిల్.. సంగీత్‌ సినిమా లాంఛ్‌ (ఫోటోలు)

+5

Royal Challengers Bengaluru: తిరుమ‌ల శ్రీవారి సేవ‌లో ఆర్సీబీ క్రికెట‌ర్లు (ఫొటోలు)

+5

పిఠాపురం: సీఎం జగన్‌ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)

+5

CM Jagan Kaikalur Meeting: కైకలూరు.. జనహోరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ రోడ్‌ షో: జనసంద్రమైన చిలకలూరిపేట (ఫొటోలు)

+5

తాగుడుకు బానిసైన టాలీవుడ్‌ హీరోయిన్‌.. జీవితమే తలకిందులు.. ఒక్కసారిగా.. (ఫోటోలు)

+5

కడపలో సీఎం జగన్‌ ఎన్నికల రోడ్‌ షో: ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

పుత్తూరులో సీఎం జగన్‌ రోడ్‌ షో: పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)