amp pages | Sakshi

బ్రిటన్‌ సంపన్నుల్లో హిందుజాలు నంబర్‌–2

Published on Mon, 05/14/2018 - 01:17

లండన్‌: బ్రిటన్‌ సంపన్నుల్లో హిందుజా సోదరులు రెండో స్థానంలో నిలిచారు. కెమికల్స్‌ వ్యాపారి జిమ్‌రాట్‌క్లిఫ్‌ అత్యంత సంపన్నుడిగా ప్రథమ స్థానంలో ఉన్నారు. రాట్‌క్లిఫ్‌ సంపద 21.05 బిలియన్‌ పౌండ్లు కాగా... శ్రీచంద్‌(82), గోపీచంద్‌ హిందుజా(78)ల ఉమ్మడి సంపద 20.64 బిలియన్‌ పౌండ్లుగా ఉన్నట్టు ‘సండే టైమ్స్‌ రిచ్‌ లిస్ట్‌ 2018’ పేర్కొంది. 1,000 మంది బ్రిటన్‌ సంపన్నులతో ఈ నివేదిక విడుదలైంది. ఇందులో భారత సంతతికి చెందిన 47 మంది కంటే హిందుజా సోదరులు ముందున్నారు.

హిందుజా సోదరులు 2017తో పోల్చుకుంటే 4.44 బిలియన్‌ డాలర్ల మేర తమ సంపద విలువను పెంచుకున్నప్పటికీ స్వల్ప తేడాతో తొలి స్థానం చేజార్చుకున్నారు. అశోక్‌ లేలండ్, ఇండస్‌ఇండ్‌ బ్యాంకు సహా హిందుజాల ఆధ్వర్యంలో ఎన్నో కంపెనీలు నడుస్తున్నాయి. ఈ జాబితాలో మీడియా దిగ్గజం సర్‌లెన్‌ బ్లావత్నిక్‌ 15.26 బిలియన్‌ పౌండ్లతో మూడో స్థానంలో ఉండగా, జన్మతః భారతీయులైన డేవిడ్, సిమన్‌ రూబెన్‌ సోదరులు 15.09 బిలియన్‌ పౌండ్లతో మూడో స్థానం నుంచి నాలుగుకు దిగిపోయారు.

లక్ష్మి నివాస్‌ మిట్టల్‌ 14.66 బిలియన్‌ పౌండ్లతో ఐదో స్థానంలో ఉన్నారు.  ఇక, ప్రపంచ టాప్‌–50  సంపన్నుల జాబితాలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ 31.7 బిలియన్‌ పౌండ్లతో 19వ స్థానం దక్కించుకున్నారు. వాల్‌మార్ట్‌ యజమానులు వాల్టన్‌ కుటుంబం మొదటి స్థానంలో నిలిచింది.  

Videos

Watch Live: మాచర్లలో సీఎం జగన్ ప్రచార సభ

ప్రచారంలో భారతమ్మ..!

బాబే భూబకాసురుడు

కవితకు బిగ్ షాక్...నో బెయిల్

టీడీపీ మేనిఫెస్టోపై సీఎం వైఎస్ జగన్ సెటైర్లు

జగన్ అనే రైతు.. వేసిన విత్తనాలు.. మహా వృక్షాలు అవుతాయి..!

వీళ్ళే మన అభ్యర్థులు గెలిపించాల్సిన బాధ్యత మీదే

నా కుటుంబంలో చిచ్చు పెట్టింది పవన్ నే

రేపల్లె గడ్డ దద్దరిల్లే సీఎం జగన్ గూస్ బంప్స్ స్పీచ్

సీఎం జగన్ రాయల్ ఎంట్రీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)