amp pages | Sakshi

8% వృద్ధికి రోడ్‌ మ్యాప్‌ 

Published on Mon, 03/11/2019 - 00:57

న్యూఢిల్లీ: రానున్న ఐదేళ్లలో ఆర్థిక వ్యవస్థ ఏటా 8 శాతం చొప్పున వృద్ధి రేటు సాధించేందుకు చేపట్టాల్సిన చర్యలపై భారత్‌ కార్పొరేట్లు రాజకీయ పార్టీలకు దిశానిర్ధేశం చేశారు. దీనికి సంబంధించి ‘ప్రతిపాదిత ఎలక్షన్‌ మ్యానిఫెస్టో’ను భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) ఆదివారం విడుదల చేసింది. వచ్చే కొత్త ప్రభుత్వానికి ఈ మ్యానిఫెస్టో ఒక ఆర్థిక కార్యాచరణగా తోడ్పడుతుందని సీఐఐ పేర్కొంది. ఏడు దశల్లో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించేందుకు ఆదివారం ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ను విడుదల చేసిన తరుణంలో సీఐఐ ఈ మ్యానిఫెస్టోను ప్రవేశపెట్టింది. ఎన్నికల ఫలితాలు మే 23న వెలువడనున్నాయి. వ్యవసాయం, విద్య, ఆరోగ్యం, మౌలిక సదుపాయాలు, తయారీ రంగం, సాంకేతిక పరిజ్ఞానం, పర్యావరణం ఇలా అనేక రంగాల్లో సాధించాల్సిన పురోగతిని ఈ మ్యానిఫెస్టోలో చేర్చారు. ‘పారిశ్రామిక ప్రతినిధులు, వివిధ రంగాలకు చెందిన నిపుణులతో సంప్రతింపుల ఆధారంగా ఈ కీలక సూచనలు చేశాం. 2022లో భారత్‌ 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకోనున్న తరుణంలో దేశాన్ని ఆర్థిక శక్తిగా మార్చడంతో పాటు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడం, నీతివంతమైన నాయకత్వం లక్ష్యంగా పలు అంశాలను పొందుపరిచాం. రాజకీయ పార్టీలన్నీ తమ మ్యానిఫెస్టోలో ఈ సూచనలను చేరుస్తారని భావిస్తున్నాం’ అని సీఐఐ డైరెక్టర్‌ జనరల్‌ చంద్రజిత్‌ బెనర్జీ పేర్కొన్నారు. సూచనల్లో ప్రధానాంశాలివీ... 
     
►అంతర్జాతీయంగా వస్తున్న అధునాతన సాంకేతిక మార్పులను భారత్‌ అందిపుచ్చుకోవాలంటే భారీస్థాయి సంస్కరణలను కొనసాగించాలి. 
►వస్తు సేవల పన్ను(జీఎస్‌టీ) పన్ను శ్లాబ్‌లను 2–3 శాతం మేర కుదించాలి. 
​​​​​​​►ప్రపంచవ్యాప్తంగా ఉన్న పోటీని ఎదుర్కోవాలంటే కార్పొరేట్‌ ఆదాయపు పన్నును ఎలాం టి మినహాయింపుల్లేకుండా 18%కి తగ్గించాలి. 
​​​​​​​►పాలన, న్యాయ, పోలీసు విభాగాల్లో సంస్కరణలు తీసుకురావాలి. 
​​​​​​​►2024 నుంచి దేశవ్యాప్తంగా పార్లమెంటు, రాష్ట్రాల అసెంబ్లీలన్నింటికీ ఒకేసారి ఎన్నికలు నిర్వహించే విధంగా చర్యలు చేపట్టాలి. ఇందుకోసం ఎన్నికల సంస్కరణలు చేయాలి. 
​​​​​​​►విద్యా రంగంలో ప్రభుత్వ వ్యయాన్ని జీడీపీలో 6 శాతానికి పెంచాలి. అదేవిధంగా వొకేషనల్‌ ట్రైనింగ్‌ను పాఠ్యాంశాల్లో భాగంగా చేయాలి. పనితీరు బాగున్న ఉపాధ్యాయులకు ప్రోత్సాహకాలు, ముఖ్యంగా గ్రామాల్లో డిజిటల్‌ స్కూల్‌ ఇన్‌ఫ్రాను మెరుగుపరడం వంటి చర్యలు అవసరం. 
​​​​​​​►యూనివర్సిటీలన్నింటినీ పరిశ్రమలతో అనుసంధానం చేయాలి. పరిశోధన అభివృద్ధి(ఆర్‌అండ్‌డీ)లో ప్రభుత్వ వ్యయాన్ని జీడీపీలో
1 శాతానికి పెంచాలి. 
​​​​​​​►సాంకేతికత ఆధారంగా నైపుణ్య శిక్షణలకు కొత్త విధానాలను ప్రవేశపెట్టాలి. 
​​​​​​​►వైద్య, ఆరోగ్య రంగంలో వ్యయాన్ని జీడీపీలో 3 శాతానికి పెంచాలి. ఈ రంగానికి మౌలిక హోదా కల్పించాలి. ప్రసూతి, శిశు మరణాలను తగ్గించడానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి. 
​​​​​​​►కార్మిక చట్టాల్లో తగిన మార్పుల కోసం కేంద్రం, రాష్ట్రాల కార్మిక మంత్రులతో ఒక సాధికార కమిటీ వేయాలి. 
​​​​​​​► రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో సమగ్రమైన జాతీయ వ్యవసాయ మిషన్‌ను ఏర్పాటు చేయాలి. రాష్ట్రాలకు సంబంధించి ‘ఈజ్‌ ఆప్‌ డూయింగ్‌ అగ్రికల్చర్‌(వ్యవసాయానికి అత్యంత సానుకూలత) ర్యాంకింగ్‌ను ప్రవేశపెట్టాలి. 
​​​​​​​► వ్యూహాత్మక ప్రభుత్వ రంగ సంస్థ(పీఎస్‌ఈ)ల్లో మూడు దశల్లో ప్రభుత్వ వాటాను పూర్తిగా ఉపసంహరించుకోవాలి. తొలి దశలో ప్రభుత్వ వాటాను 51 శాతానికి, రెండో దశలో 26 శాతానికి, మూడో దశలో పూర్తిగా విక్రయించి వైదొలగేలా చర్యలు తీసుకోవాలి. ఐదేళ్లలో ఈ మొత్తం అమ్మకం ప్రక్రియ పూర్తవ్వాలి. 
 

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)