amp pages | Sakshi

లాభాల స్వీకరణతో మార్కెట్లు డౌన్

Published on Wed, 11/26/2014 - 01:35

లాభాల స్వీకరణ, పీ-నోట్స్ నిబంధనల అమలుపై భయాలతో దేశీ స్టాక్‌మార్కెట్లు మంగళవారం రికార్డు స్థాయిల నుంచి క్షీణించి నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 161 పాయింట్లు తగ్గి 28,338 వద్ద, నిఫ్టీ 67 పాయింట్లు తగ్గి 8,463 వద్ద ముగిశాయి. గడిచిన ఆరు వారాల్లో ఒకే రోజున ఇంత భారీగా తగ్గటం ఇదే ప్రథమం. చివరిసారిగా అక్టోబర్ 16న సెన్సెక్స్ ఒకే రోజున 350 పాయింట్లు పతనమైంది.

తాజాగా రియల్టీ, ఎఫ్‌ఎంసీజీ, పవర్, మెటల్, కన్జూమర్ డ్యూరబుల్స్, బ్యాంకింగ్, క్యాపిటల్ గూడ్స్, ఆటోమొబైల్ సంస్థల షేర్లు భారీగా అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం ఐటీసీ ఏకంగా 5 శాతం క్షీణించింది. మంగళవారం లాభాల్లోనే ప్రారంభమైన సెన్సెక్స్ ఒక దశలో కొత్త రికార్డు స్థాయి 28,541 పాయింట్లను, నిఫ్టీ 8,535 పాయింట్ల ఆల్ టైం గరిష్ట స్థాయిని తాకాయి. కానీ ఆ లాభాలు ఎక్కువ సేపు నిలవలేదు. చివరికి  సెన్సెక్స్ 0.57 శాతం, నిఫ్టీ 0.79 శాతం క్షీణతతో ముగిశాయి.

మనీలాండరింగ్ వంటివి జరగకుండా పార్టిసిపేటరీ నోట్స్ జారీ విషయంలో విదేశీ ఇన్వెస్టర్లు కచ్చితంగా నిబంధనలు పాటించాల్సిందేనంటూ సెబీ ఆదేశించడం మార్కెట్లను కొంత ప్రభావితం చేసిందని విశ్లేషకులు చెప్పారు. ఈ విషయంలో ఇన్వెస్టర్స్ సెంటిమెంటును కాస్త దెబ్బతీసిందని, ఫలితంగా మార్కెట్స్ క్షీణించాయని వివరించారు.

 ఐటీసీ 5% పతనం: సిగరెట్ల విడి అమ్మకాలను నిషేధించాలన్న సిఫార్సులను కేంద్రం ఆమోదించిందన్న వార్తలతో ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం ఐటీసీ ఏకంగా 5 శాతం నష్టపోయిందని బొనాంజా పోర్ట్‌ఫోలియో అసోసియేట్ ఫండ్ మేనేజర్ హీరెన్ ధకన్ చెప్పారు. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్‌లో పొజిషన్లను ట్రేడర్లు నవంబర్ నుంచి డిసెంబర్‌కు రోలోవర్ చేసుకుంటున్న నేపథ్యంలో ఈ వారం ట్రేడింగ్‌లో హెచ్చుతగ్గులు తప్పకపోవచ్చని తెలిపారు.

 ఎంసీఎక్స్-ఎస్‌ఎక్స్‌లో వాటాలు కొంటున్న ఝున్‌ఝున్‌వాలా
 ఎంసీఎక్స్-ఎస్‌ఎక్స్ స్టాక్ ఎక్స్చేంజీలో పూర్తి వాటాలు విక్రయించే దిశగా ప్రముఖ ఇన్వెస్టరు రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా తదితరులతో ఫైనాన్షియల్ టెక్నాలజీస్ ఇండియా (ఎఫ్‌టీఐఎల్) మంగళవారం ఒప్పందం కుదుర్చుకుంది. ఎంసీఎక్స్-ఎస్‌ఎక్స్‌లో ఎఫ్‌టీఐఎల్‌కు ప్రస్తుతం అయిదు శాతం వాటాలు ఉన్నాయి. ఈ డీల్ విలువ రూ. 88.41 కోట్లుగా ఉండనుంది. ఎఫ్‌టీఐఎల్ ఒప్పందం కుదుర్చున్న సంస్థల్లో ఎడెల్‌వీజ్, ట్రస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్స్ మొదలైనవి ఉన్నాయి.

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)