amp pages | Sakshi

34 వేల దిగువకు సెన్సెక్స్‌

Published on Tue, 02/20/2018 - 00:24

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌(పీఎన్‌బీ) కుంభకోణం ప్రకంపనలు సోమవారం స్టాక్‌ మార్కెట్‌ను నష్టాల పాలు చేశాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 34 వేల పాయింట్లు, నిఫ్టీ 10,400 పాయింట్ల దిగువకు పడిపోయాయి. ఈ స్టాక్‌ సూచీలు వరుసగా రెండో ట్రేడింగ్‌ సెషన్‌లోనూ పతనమయ్యాయి. సెన్సెక్స్‌ 236 పాయింట్లు నష్టపోయి 33,775 పాయింట్ల వద్ద, నిఫ్టీ 74 పాయింట్ల నష్టంతో 10,378 పాయింట్ల వద్ద ముగిశాయి.

సెన్సెక్స్‌కు ఇది రెండు నెలల కనిష్ట స్థాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు ఎగియడంతో ద్రవ్యలోటు మరింతగా పెరుగుతుందన్న భయాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. సెన్సెక్స్‌ ఒక దశలో 112 పాయింట్లు లాభపడగా,  మరో దశలో 456 పాయింట్లు నష్టపోయింది. మొత్తం మీద 568 పాయింట్ల రేంజ్‌లో కదలాడింది. ఇంట్రాడేలో నిఫ్టీ 10,303 పాయింట్లకు పడిపోయింది. 

బ్యాంక్‌ షేర్లు బేర్‌..
పీఎన్‌బీ స్కామ్‌ ప్రభుత్వ రంగ బ్యాంక్‌ షేర్లపై బాగానే ప్రతికూల ప్రభావం చూపుతోంది. పలు ప్రభుత్వ రంగ బ్యాంక్‌ షేర్లు ఇంట్రాడేలో ఏడాది కనిష్ట స్థాయిలకు పడిపోయాయి. ప్రస్తుత పరిస్థితుల్లో బ్యాంక్‌ షేర్లపై ఒత్తిడి కొనసాగుతుందని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ రీసెర్చ్‌ హెడ్‌ వినోద్‌ నాయర్‌ చెప్పారు. ఈ తుఫాన్‌ చల్లబడేదాకా ఇన్వెస్టర్లు వేచి చూసే ధోరణి అవలంభిస్తారని వివరించారు.

యూకో బ్యాంక్‌ 4.6 శాతం, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 7 శాతం, అలహాబాద్‌ బ్యాంక్‌ 6.3 శాతం, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా 5.4 శాతం, సిండికేట్‌ బ్యాంక్‌6.4 శాతం, బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర 6.7 శాతం, కార్పొరేషన్‌ బ్యాంక్‌ 3.1 శాతం, ఎస్‌బీఐ 1.5 శాతం, ఫెడరల్‌ బ్యాంక్‌ 2.6 శాతం, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ 1.6 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్‌ 0.3 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 0.2 శాతం చొప్పున నష్టపోయాయి.
 
4 రోజుల్లో 10 వేల కోట్లు ఆవిరి..
పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ పతనం వరుసగా నాలుగో ట్రేడింగ్‌ సెషన్‌లోనూ కొనసాగింది. సోమవారం  ఈ షేర్‌ 7.3  శాతం క్షీణించి రూ.116 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 10 శాతం నష్టపోయి తాజా ఏడాది కనిష్ట స్థాయి, రూ.114ను తాకింది. గత నాలుగు ట్రేడింగ్‌ సెషన్లలో ఈ షేర్‌ 28 శాతం క్షీణించింది. ఈ నాలుగు రోజుల్లో రూ.10,975 కోట్ల మార్కెట్‌ క్యాప్‌ ఆవిరైంది.  భూషణ్‌ స్టీల్‌ రేసులో ముందు వరుసలో ఉందన్న వార్తల నేపథ్యంలో టాటా స్టీల్‌ షేర్‌ 5.8 శాతం నష్టపోయింది. సెన్సెక్స్‌లో బాగా నష్టపోయిన షేర్‌ ఇదే.

#

Tags

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)