amp pages | Sakshi

కొత్త 100 నోటు : 100 కోట్ల ఖర్చు

Published on Sat, 07/21/2018 - 11:34

న్యూఢిల్లీ : లేత వంగ పువ్వు వర్ణంలో కొత్త వంద రూపాయి నోటు త్వరలోనే చలామణిలోకి రాబోతుంది. ఈ నోటు ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న నోటు కంటే కాస్త చిన్నదిగా ఉన్నట్టు రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తెలిపింది. దీంతో ఏటీఎంలలో ఈ నోట్లను అందుబాటులోకి తీసుకురావడానికి, ఏటీఎంలను మార్చాల్సి వస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న 2 లక్షల 40 వేట ఏటీఎంలను కొత్త వంద నోటుకు అనుగుణంగా మార్చాల్సి వస్తుందని ఏటీఎం ఆపరేటర్లు తెలిపారు. దీనికోసం దాదాపు 100 కోట్ల రూపాయలను ఏటీఎం ఇండస్ట్రి వెచ్చించాల్సి వస్తుందని పేర్కొన్నారు. ఈ ప్రక్రియకు గడువు కూడా ఏడాదికి మించి పట్టనుందని తెలిపారు. కొత్త బ్యాంక్‌ నోటు 66 ఎంఎం x 142 ఎంఎం సైజులో ఉండనుందని ఆర్‌బీఐ నోటిఫికేషన్‌లో తెలిసింది. ఇది ప్రస్తుతమున్న 73 ఎంఎం x 157 ఎంఎం పరిణామాల కంటే తక్కువ. ‘కొత్త 100 రూపాయల నోట్ల కోసం రికాలిబ్రేషన్‌ చేసేందుకు రూ.100 కోట్లకు పైగా ఖర్చు అవుతుందని మేము నమ్ముతున్నాం. దీనికి 12 నెలల మేర సమయం పట్టే అవకాశముంది’ అని హిటాచి పేమెంట్‌ సర్వీసెస్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ లోని ఆంటోని తెలిపారు.

కొత్త నోట్లతో తమకు సవాళ్లు పెరుగుతూనే ఉన్నాయని పేర్కొన్నారు. అయితే 2016 నవంబర్‌లో పెద్ద నోట్ల రద్దు తర్వాత కొత్త ప్రమాణాలు, మరింత భద్రతా అంశాలతో కొత్త నోట్లను ఆర్‌బీఐ  విడుదల చేస్తోంది. తాజాగా తెస్తున్న రూ.100 నోటు ఈ క్రమంలో అయిదో నోటు. అంతకుముందు కొత్త రూ.500, 2000, రూ.50, 200 నోట్లు వచ్చాయి. వీటిల్లో రూ.50ని ఏటీఎంలలో ఉంచడం లేదు. కొత్త నోట్లకు అనుగుణంగా దేశంలోని 2.4 లక్షల ఏటీఎంలలో ఎప్పటికప్పుడు మార్పులు చేయాల్సి వస్తోంది. తాజాగా మళ్లీ రూ.100 నోట్ల జారీకి అనుగుణంగా తీర్చిదిద్దాలంటే, ఒత్తిడి పెరిగినట్లేనని ఏటీఎం పరిశ్రమ చెబుతోంది. కొత్త వంద నోట్ల ప్రింటింగ్‌ ఇప్పటికే దేవాస్‌లో ప్రారంభమైందని సీనియర్‌ ప్రభుత్వ అధికారి తెలిపారు. ప్రతి ఒక్క ఏటీఎంలో నాలుగు క్యాసెట్స్‌ ఉంటాయి. రెండు క్యాసెట్లను సింగిల్‌ డినామినేషన్‌కు, మరో రెండు క్యాసెట్లు అత్యధిక డినామినేషన్‌ నోట్లకు అనుగుణంగా ఏటీఎంలు ఉన్నాయి. 

2.4 లక్షల ఏటీఎంల నిర్వహణ ఇలా..
దేశంలో ఉన్న మొత్తం ఏటీఎంలు 2.4 లక్షలు. ఇందులో ఎన్‌సీఆర్‌ 1.1 లక్షల ఏటీఎంలను నిర్వహిస్తుండగా.. 55,000 ఏటీఎంలను హిటాచి నిర్వహిస్తోంది. 12,000 ఏటీఎమ్‌లు ఎఫ్‌ఐఎస్‌ ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. గత ఆగస్టులో ప్రవేశపెట్టిన రూ.200 నోట్ల కోసం ఏటీఎమ్‌లను మార్చడానికి రూ.100-120 కోట్లు ఖర్చయ్యాయి. కొత్త నోటుకు అనుగుణంగా ఒక్కో ఏటీఎం మార్చడానికి అయ్యే ఖర్చు రూ. 3000-4000 ఉంటుందని ఇండస్ట్రి వర్గాలు చెబుతున్నాయి. 
 

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)