amp pages | Sakshi

ఈ-కామర్స్కు ‘నోటు’ పోటు

Published on Thu, 11/10/2016 - 01:26

క్యాష్ ఆన్ డెలివరీ ఆర్డర్ల తాత్కాలిక నిలిపివేత.. 
నియంత్రణల విధింపు

 న్యూఢిల్లీ: మోదీ సర్కారు రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం ఈ-కామర్స్ కంపెనీల వ్యాపారంపైనా తీవ్ర ప్రభావం చూపిస్తోంది. కస్టమర్లు నగదు రూపంలో చెల్లింపులు (సీఓడీ) చేసే ఆర్డర్ల డెలివరీకి బ్రేక్ పడింది. అమెజాన్, పేటీఎం తదితర ఆన్‌లైన్ విక్రయ సంస్థలు సీఓడీ ఆర్డర్లను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారుు. అరుుతే, ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్ వంటి మరికొన్ని సంస్థలు సీఓడీ ఆర్డర్ విలువపై పరిమితులు విధించారుు. పరిశ్రమ వర్గాల అంచనాల ప్రకారం ఈ-కామర్స్ లావాదేవీల్లో 70 శాతం నగదు రూపంలోనే జరుగుతున్నారుు.

దీనిబట్టి చూస్తే, పెద్ద నోట్ల రద్దు ఉదంతం ఈ  కంపెనీలకు కొంతకాలంపాటు ఎదురుదెబ్బేనని పరిశీలకులు పేర్కొంటున్నారు. ‘కొత్త ఆర్డర్లకు సంబంధించి క్యాష్ చెల్లింపులను తాత్కాలికంగా ఆపేశాం. అరుుతే, మంగళవారం(8న) అర్థరాత్రికి ముందు సీఓడీ ఆర్డర్‌ను చేసిన కస్టమర్లకు మాత్రం డెబిట్/క్రెడిట్ కార్డులు లేదా చెల్లుబాటు అయ్యే డినామినేషన్‌లలో మాత్రమే చెల్లింపులకు అనుమతిస్తున్నాం’ అని అమెజాన్ ఇండియా ప్రతినిధి పేర్కొన్నారు. ఇక ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్‌లు సీఓడీ ఆర్డర్ల విలువను రూ.1,000; రూ.2,000కు మాత్రమే పరిమితం చేశారుు. అది కూడా తక్కువ డినామినేషన్లలోనే చెల్లించాలని సూచించారుు. ఉబెర్, బిగ్‌బాస్కెట్‌లు కూడా తక్కువ డినామినేషన్లలోనే చెల్లింపులు జరపాలని కోరారుు.

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)