amp pages | Sakshi

ఏడో వారమూ లాభాలే..

Published on Sat, 01/20/2018 - 00:28

స్టాక్‌ మార్కెట్లో రికార్డ్‌ల హోరు కొనసాగుతోంది. శుక్రవారం..వరుసగా మూడో రోజు స్టాక్‌ సూచీలు ఇంట్రాడేలోనూ, ముగింపులోనూ కొత్త రికార్డ్‌లు సృష్టించాయి. ఇంట్రాడేలో నిఫ్టీ  తొలిసారిగా 10,900 పాయింట్లపైకి ఎగబాకింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐటీసీ వంటి బ్లూ చిప్‌ కంపెనీల క్యూ3 ఫలితాలు ప్రోత్సాహకరంగా ఉండడం, ప్రభుత్వం 29 వస్తువులు, 54 కేటగిరీల సేవలపై జీఎస్‌టీ రేట్లను తగ్గించడంతో కొనుగోళ్ల జోరు పెరిగింది. ప్రపంచ మార్కెట్లు లాభాల్లో ఉండడం, ముడి చమురు ధరలు శాంతించడం సానుకూల ప్రభావం చూపించాయి.

ఉదయం బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 251 పాయింట్ల లాభంతో 35,512 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 78 పాయింట్ల లాభంతో 10,895 పాయింట్ల వద్ద ముగిశాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 282 పాయింట్ల లాభంతో 35,542 పాయింట్ల వద్ద, నిఫ్టీ 90 పాయింట్ల లాభంతో 10,907 పాయింట్ల గరిష్ట స్థాయిలను తాకింది. ఇవి ఆయా సూచీలకు ఆల్‌టైమ్‌ హై రికార్డ్‌ స్థాయిలు. బ్యాంక్‌ నిఫ్టీ కూడా జీవిత కాల గరిష్ట స్థాయి వద్ద ముగిసింది.

ఇక వారం పరంగా చూస్తే, వరుసగా ఏడో వారమూ స్టాక్‌ మార్కెట్‌ లాభాల్లో ముగిసింది. సెన్సెక్స్‌ 919 పాయింట్లు. నిఫ్టీ 213 పాయింట్లు చొప్పున పెరిగాయి. ఈ వారం ఐదు ట్రేడింగ్‌ సెషన్లలో నాలుగు సెషన్లలో స్టాక్‌ సూచీలు రికార్డ్‌ స్థాయిల్లో ముగిశాయి. ఇక ఈ ఏడాది మొత్తం 15 ట్రేడింగ్‌ సెషన్లలో 9 సెషన్లలో స్టాక్‌ సూచీలు ఆల్‌ టైమ్‌ హై రికార్డ్‌లను సృష్టించాయి.

అంబర్‌ ఐపీఓ...అదరహో..!
అంబర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ ఐపీఓకు అనూహ్య స్పందన లభించింది. బ్రాండెడ్‌ కంపెనీలకు ఏసీలు తయారు చేసే ఈ కంపెనీ ఐపీఓ 165 రెట్లు ఓవర్‌ సబ్‌స్క్రైబయింది. రూ.855–859 ప్రైస్‌బాండ్‌తో ఈ నెల 17న ప్రారంభమైన ఈ ఐపీఓ శుక్రవారం ముగిసింది. ఈ ఐపీఓ ద్వారా ఈ కంపెనీ రూ.600 కోట్లు సమీకరించనుంది.

కంపెనీ ఈ మంగళవారమే యాంకర్‌ ఇన్వెస్టర్ల నుంచి రూ.179 కోట్లు సమీకరించింది. ఈ నెల 30న ఈ షేర్లు స్టాక్‌ మార్కెట్లో లిస్టయ్యే అవకాశాలున్నాయి. క్వాలిఫైడ్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ బయ్యర్లకు కేటాయించిన వాటా 176 రెట్లు, సంస్థాగతేతర ఇన్వెస్టర్లకు కేటాయించిన వాటా 522 రెట్లు, రిటైల్‌ ఇన్వెస్టర్ల వాటా 11 రెట్లు చొప్పున ఓవర్‌ సబ్‌స్క్రైబయ్యాయి.


‘గెలాక్సీ’ ఐపీఓ ధర రూ.1,470–1,480
గెలాక్సీ సర్ఫెక్టాంట్స్‌ సంస్థ తన ఐపీఓ ధరల శ్రేణిని రూ.1,470–1,480గా నిర్ణయించింది. ఐపీఓ ఈ నెల 29న ప్రారంభమై 31న ముగుస్తుంది. ఐపీఓలో భాగంగా కంపెనీ 63,31,674 షేర్లను జారీ చేయనుంది. ఈ ఐపీఓ ద్వారా 937 కోట్లు సమీకరించాలని కంపెనీ యోచిస్తోంది.

చర్మ, కేశ, కాస్మోటిక్స్, టాయిలెట్, డిటర్జెంట్‌ ఉత్పత్తులకు అవసరమైన ముడిపదార్ధాలను ఈ కంపెనీ తయారు చేస్తోంది. వీటిని కెవిన్‌కేర్, కాల్గేట్‌ పామోలివ్, డాబర్‌ ఇండియా, హెంకెల్, హిమాలయ, లారియల్, ప్రాక్టర్‌ అండ్‌ గ్యాంబుల్, రెకిట్‌ బెన్‌కిసర్, ఆయుర్‌ హెర్బల్స్, జ్యోతి ల్యాబొరేటరీస్, యూనీలీవర్‌ తదితర సంస్థలకు సరఫరా చేస్తోంది.

Videos

ఇది అభివృద్ధి అంటే.. సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్

పొరపాటున బాబుకు ఓటేస్తే పథకాలకు ముగింపే..!

జగనన్న రాకతో దద్దరిల్లిన గాజువాక సభ

గాజువాకలో జనజాతర

బీజేపీ, టీడీపీ, జనసేన తోడు దొంగలు..!

విశాఖ నుంచే ప్రమాణస్వీకారం చేస్తా

వీళ్లే మన అభ్యర్థులు.. ఈసారి ఢిల్లీ పీఠం కదలాలి

ఇచ్ఛాపురం బహిరంగ సభలో సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్

చంద్రబాబు చేసిన మోసాలు లైవ్ లో వినిపించిన సీఎం జగన్

బాబును చీల్చి చెండాడిన మహిళలు

Photos

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?