amp pages | Sakshi

రేటింగ్‌తో మార్కెట్లు రయ్‌...

Published on Sat, 11/18/2017 - 02:06

మూడీస్‌ సంస్థ భారత సావరిన్‌ రేటింగ్‌ అవుట్‌లుక్‌ను అప్‌గ్రేడ్‌ చేయడంతో శుక్రవారం స్టాక్‌ మార్కెట్‌ మంచి లాభాలు సాధించింది. దాదాపు 14 ఏళ్ల తర్వాత రేటింగ్‌ పెరగడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌కు జోష్‌నిచ్చింది. రేటింగ్‌ పెరిగిన సానుకూల నేపథ్యంలో షార్ట్‌ కవరింగ్‌ కొనుగోళ్లు కూడా జత కావడంతో సెన్సెక్స్‌ 33,300 పాయింట్లు, నిఫ్టీ 10,300 పాయింట్ల చేరువలో ముగిశాయి. ఇంట్రాడేలో రూపాయి 71 పైసలు బలపడటం కూడా సానుకూల ప్రభావం చూపించింది.

అంతర్జాతీయ సంకేతాలు మిశ్రమంగా ఉండటంతో ఇన్వెస్టర్ల లాభాల స్వీకరణ, ఐటీ షేర్ల నష్టాల  కారణంగా మధ్యాహ్నం తర్వాత లాభాలు తగ్గాయి. చివరకు సెన్సెక్స్‌ 236 పాయింట్ల లాభంతో 33,343 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 69 పాయింట్ల లాభంతో 10,284 పాయింట్ల వద్ద ముగిశాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 414 పాయింట్లు. నిఫ్టీ 124 పాయింట్ల చొప్పున లాభపడ్డాయి. ఇక వారం పరంగా చూస్తే, స్టాక్‌ సూచీలు మిశ్రమంగా ముగిశాయి.  సెన్సెక్స్‌ 28 పాయింట్లు లాభపడగా,  నిఫ్టీ 38 పాయింట్లు నష్టపోయింది. ఐటీ సూచీ మినహా, అన్ని రంగాల సూచీలు లాభపడ్డాయి.

బ్యాంక్‌ షేర్లు భళా...: బ్యాంక్‌ల మూలధన ప్రణాళికకు అవసరమైన నిధుల వ్యయం మూడీస్‌ రేటింగ్‌తో తగ్గే అవకాశాలు అధికంగా ఉండటంతో బ్యాంక్‌ షేర్లు జోరుగా పెరిగాయి. బ్యాంక్‌ షేర్ల జోరుతో బ్యాంక్‌ నిఫ్టీ ఇంట్రాడేలోనూ, క్లోజింగ్‌లోనూ జీవిత కాల గరిష్ట స్థాయిలను తాకింది.

కొనసాగిన రియల్టీ లాభాలు...: ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన పథకం కింద వడ్డీ రాయితీ పొందడానికి గాను అర్హమయ్యే గృహాల కార్పెట్‌ ఏరియాను కేంద్ర కేబినెట్‌ పెంచడంతో గురువారం లాభపడిన రియల్టీ షేర్ల జోరు శుక్రవారం కూడా కొనసాగింది.

Videos

అచ్చెన్నాయుడు సొంత గ్రామంలో టీడీపీ రిగ్గింగ్ బయటపడ్డ వీడియో

ఓటేస్తే చంపేస్తారా..! మహిళలపై ఇంత దారుణమా..!

ఇదే సాక్ష్యం... సంచలన నిజాలు బయటపెట్టిన KSR

టీడీపీకి ఓటు వేయలేదని బంధించి హింసించిన TDP నేతలు ..

అనిల్ కుమార్, కాసు మహేష్ ల పైకి కర్రలతో టీడీపీ మూకలు

ప్రశాంత్ కిషోర్ పై విరుచుకుపడ్డ అనలిస్ట్ KS ప్రసాద్

కవిత ఛార్జ్ షీట్ పై నేడు విచారణ..

వైఎస్సార్సీపీ నేతల ఇళ్లకు నిప్పు పెట్టిన టీడీపీ..

అట్టహాసంగా మోడీ నామినేషన్

అక్కడ రీ-పోలింగ్ ?

Photos

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

హీరోగా యూట్యూబర్‌ నిఖిల్.. సంగీత్‌ సినిమా లాంఛ్‌ (ఫోటోలు)

+5

Royal Challengers Bengaluru: తిరుమ‌ల శ్రీవారి సేవ‌లో ఆర్సీబీ క్రికెట‌ర్లు (ఫొటోలు)

+5

పిఠాపురం: సీఎం జగన్‌ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)

+5

CM Jagan Kaikalur Meeting: కైకలూరు.. జనహోరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ రోడ్‌ షో: జనసంద్రమైన చిలకలూరిపేట (ఫొటోలు)

+5

తాగుడుకు బానిసైన టాలీవుడ్‌ హీరోయిన్‌.. జీవితమే తలకిందులు.. ఒక్కసారిగా.. (ఫోటోలు)

+5

కడపలో సీఎం జగన్‌ ఎన్నికల రోడ్‌ షో: ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

పుత్తూరులో సీఎం జగన్‌ రోడ్‌ షో: పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)