amp pages | Sakshi

అత్యధిక వేతనాలు పొందింది వారే!

Published on Fri, 09/21/2018 - 13:34

న్యూఢిల్లీ : మీ అమ్మాయి ఏం ఉద్యోగం చేస్తుంది, మీ అబ్బాయి ఏం పనిచేస్తున్నాడు. జీతం ఎంత ఇస్తున్నారేంటి? ఇలా చుట్టుపక్కల వారి ప్రశ్నలు అన్నీఇన్నీ కావు. ఎంత సంపాదిస్తున్నావేంటి? అనుకుంటూ పక్కింటి వాళ్లు, ఎదురింటోళ్లు వేసే ప్రశ్నలు చాలా మందికి పెద్ద తలనొప్పి. అయితే భారత్‌లో కొన్ని వృత్తులు చేపట్టేవారికి మాత్రమే వేతనాలు అత్యధికంగా ఉన్నాయంట. అవి ఎవరికో తెలుసా? చట్ట సభ్యులు, సీనియర్‌ అధికారులు, మేనేజర్లు. వీరికి మాత్రమే సగటు రోజూ వారీ చెల్లించే వేతనాలు 1993-94 నుంచి 2011-12 వరకు రెండింతలు అయ్యాయని అంతర్జాతీయ కార్మిక సంస్థ(ఐఎల్‌ఓ) ఇండియా వేతన రిపోర్టు పేర్కొంది. అన్ని కేటగిరీల వృద్ధిలో చట్ట సభ్యులు, సీనియర్‌ అధికారులు, మేనేజర్లు మాత్రమే తమ వేతనాలను 98 శాతం పెంచుకున్నారని తెలిపింది. అదేవిధంగా నిపుణుల వేతనాలు 90 శాతం పెరిగినట్టు రిపోర్టు పేర్కొంది. నేషనల్‌ శాంపుల్‌ సర్వే ఆర్గనైజేషన్‌ డేటాను పరిశీలించిన తర్వాత, ఐఎల్‌ఓ ఈ రిపోర్టును విడుదల చేసింది. 

మరోవైపు స్పెక్ట్రమ్‌, ప్లాంట్‌, మిషన్‌ ఆపరేటర్లు మాత్రమే గత రెండు దశాబ్దాలుగా అత్యంత తక్కువ వేతనాలను పొందుతున్నారని రిపోర్టు వెల్లడించింది. వీరి వేతనాలు కేవలం 44 శాతం మాత్రమే పెరిగాయని తెలిపింది. మొత్తంగా వేతనాల పెంపు గత 18 ఏళ్లలో సగటున 93 శాతం ఉందని తెలిపింది. అత్యధికంగా వేతనం చెల్లించే ఉద్యోగానికి, తక్కువ వేతనం చెల్లించే ఉద్యోగానికి తేడాను కూడా రిపోర్టు వివరించింది. 1993-94లో వీటి మధ్య తేడా 7.2 శాతముంటే, 2004-05లో 10.7 శాతానికి పెరిగిందని, అయితే 2011-12లో అది 7.6 శాతానికి తగ్గినట్టు పేర్కొంది. తక్కువ నైపుణ్యాలున్న ఉద్యోగుల రోజువారీ వేతనాలు 2004-05 నుంచి 2011-12 మధ్యలో 3.7 శాతం పెరిగినట్టు వెల్లడించింది. పట్టణ ప్రాంతాల్లో వేతనాలు స్థిరంగా కొనసాగుతున్నాయని చెప్పింది. పే కమిషన్‌ కేవలం ప్రభుత్వ రంగ రంగాల్లో వేతనాల పెంపును మాత్రమే కాక, ప్రైవేట్‌ రంగపు వేతనాలపై కూడా ప్రభావం చూపినట్టు రిపోర్టు నివేదించింది. 


Videos

అచ్చెన్నాయుడు సొంత గ్రామంలో టీడీపీ రిగ్గింగ్ బయటపడ్డ వీడియో

ఓటేస్తే చంపేస్తారా..! మహిళలపై ఇంత దారుణమా..!

ఇదే సాక్ష్యం... సంచలన నిజాలు బయటపెట్టిన KSR

టీడీపీకి ఓటు వేయలేదని బంధించి హింసించిన TDP నేతలు ..

అనిల్ కుమార్, కాసు మహేష్ ల పైకి కర్రలతో టీడీపీ మూకలు

ప్రశాంత్ కిషోర్ పై విరుచుకుపడ్డ అనలిస్ట్ KS ప్రసాద్

కవిత ఛార్జ్ షీట్ పై నేడు విచారణ..

వైఎస్సార్సీపీ నేతల ఇళ్లకు నిప్పు పెట్టిన టీడీపీ..

అట్టహాసంగా మోడీ నామినేషన్

అక్కడ రీ-పోలింగ్ ?

Photos

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

హీరోగా యూట్యూబర్‌ నిఖిల్.. సంగీత్‌ సినిమా లాంఛ్‌ (ఫోటోలు)

+5

Royal Challengers Bengaluru: తిరుమ‌ల శ్రీవారి సేవ‌లో ఆర్సీబీ క్రికెట‌ర్లు (ఫొటోలు)

+5

పిఠాపురం: సీఎం జగన్‌ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)

+5

CM Jagan Kaikalur Meeting: కైకలూరు.. జనహోరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ రోడ్‌ షో: జనసంద్రమైన చిలకలూరిపేట (ఫొటోలు)

+5

తాగుడుకు బానిసైన టాలీవుడ్‌ హీరోయిన్‌.. జీవితమే తలకిందులు.. ఒక్కసారిగా.. (ఫోటోలు)

+5

కడపలో సీఎం జగన్‌ ఎన్నికల రోడ్‌ షో: ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

పుత్తూరులో సీఎం జగన్‌ రోడ్‌ షో: పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)