amp pages | Sakshi

ఎగుమతుల్లో ఎంపెడా రికార్డు స్థాయి వృద్ధి

Published on Fri, 07/03/2015 - 01:30

సాక్షి, విశాఖపట్నం : సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల అభివృద్ధి సంస్థ (ఎంపెడా) ఎగుమతుల్లో రికార్డు స్థాయి వృద్ధి సాధించింది. 2014-15 ఆర్థిక సంవత్సరంలో 5,511.12 మిలియన్ అమెరికా డాలర్ల విలువైన మత్స్య ఉత్పత్తులను ఎగుమతి చేసి ఈ ఆల్‌టైమ్ హై రికార్డును సొంతం చేసుకుంది. రూ.33,441.61 కోట్ల విలువైన 10,51,243 మెట్రిక్ టన్నుల మత్స్య సంపదను ఎగుమతి చేసింది. గత ఏడాదితో పోల్చుకుంటే సరకు పరిమాణంలో 6.86 శాతం, రూపాయల్లో 10.69 శాతం వృద్ధిని సాధించ గలిగింది. 2013-14 ఆర్థిక సంవత్సరంలో 9,83,756 టన్నులను ఎగుమతి చేయగా 2014-15లో 6.86 శాతం వృద్ధితో 10,51,243 టన్నులకు పెరిగింది.

అలాగే 2013-14లో ఎగుమతుల విలువ రూ.3,02,132.60 కోట్లుండగా, 2014-15లో రూ. 3,34,416 కోట్లకు చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో సంభవించిన పరిణామాలతో ఈ వృద్ధి సాధ్యమయిందని ఎంపెడా గురువారం సాయంత్రం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. ఈ ఎగుమతుల్లో రొయ్యలదే (34.01 శాతం) అగ్రభాగమని పేర్కొంది. మొత్తం 3,57,505 టన్నుల రొయ్యలను ఎగుమతి చేసింది. 2014-15లో ఆక్వా ఉత్పత్తుల పెరుగుదల (30.63 శాతం) కూడా గణనీయంగానే ఉందని వివరించింది. మొత్తం ఆక్వా ఉత్పత్తులు 4,34,558 టన్నుల్లో ఆంధ్రప్రదేశ్ నుంచే 2,79,727 టన్నుల ఎగుమతి జరిగింది. 29.44 శాతం పెరుగుదలతో చేపలు రెండో స్థానంలో నిలిచాయి. ఆ తర్వాత స్థానాల్లో కటిల్‌ఫిష్ (20.09 శాతం) ఉంది.

Videos

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

లీడర్ VS చీటర్స్

ముస్లిం రిజర్వేషన్లపై చంద్రబాబుకు సీఎం జగన్ సవాల్

పారిపోయిన సీఎం రమేష్

IVRS కాల్స్ ద్వారా టీడీపీ బెదిరింపులు రంగంలోకి సీఐడీ..

చంద్రబాబును ఏకిపారేసిన కొడాలి నాని..

కూటమి మేనిఫెస్టో కాదు...టీడీపీ మేనిఫెస్టో..

సీఎం జగన్ హిందూపురం స్పీచ్..బాలకృష్ణ గుండెల్లో గుబులు..

గడప గడపకు వైఎస్సార్సీపీ ఎన్నికల ప్రచారం

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)