amp pages | Sakshi

యులిప్ అమ్మకాలు పెరుగుతున్నాయ్

Published on Thu, 08/27/2015 - 02:18

హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ ఎండీ, సీఈవో అమితాబ్ చౌదరి
- నాలుగు వారాల్లో స్టాండర్డ్ లైఫ్ వాటా 49%కి
- వచ్చే ఏడాది మార్కెట్లో లిస్టయ్యే అవకాశం
- పరిశ్రమ సగటు కంటే అధిక వృద్ధిరేటు నమోదు
- ఈ ఏడాది 17వేల ఏజెంట్ల నియామకాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో :
గత కొంత కాలంగా సంస్కరణలు, ఆర్థిక వృద్ధిరేటు నెమ్మదించడంతో కష్టాలను ఎదుర్కొన్న  జీవిత బీమా రంగం క్రమేపీ గాడిలో పడుతోందని ప్రైవేటు రంగ జీవిత బీమా కంపెనీ హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ పేర్కొంది. ఈ ఏడాది పరిశ్రమ రెండంకెల వృద్ధిరేటు నమోదు చేయడంతో పాటు, మోదీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి యులిప్ అమ్మకాలు పెరిగాయంటున్న హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ మేనేజింగ్ డెరైక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అమితాబ్ చౌదరితో ఇంటర్వ్యూ...
 
ఈ ఏడాది జీవిత బీమా పరిశ్రమ వృద్ధి ఏవిధంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు? హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ వృద్ధిరేటు ఏ విధంగా ఉండొచ్చు?
ఈ ఏడాది జీవిత బీమా వ్యాపారంలో ఆశావాహకమైన పరిస్థితులు కనపడుతున్నాయి. పాలసీ నిబంధనలు, అమ్మకాల్లో జరిగిన మార్పుల్లో ఒక స్పష్టత వచ్చింది. ఈ ఏడాది ఇప్పటి వరకు జీవిత బీమా వ్యాపారంలో 8-10 శాతం వృద్ధి నమోదయ్యింది. ఏడాది మొత్తం మీద ఇంతకంటే ఎక్కువ వృద్ధి నమోదవుతుందని అంచనా వేస్తున్నాం. ఇక మా విషయానికి వస్తే గత ఐదేళ్లు మాదిరిగానే ఈ సారి కూడా పరిశ్రమ సగటు కంటే ఎక్కువ వృద్ధిరేటును నమోదు చేస్తాం.
 
స్టాక్ సూచీలు రికార్డు స్థాయికి చేరిన తర్వాత యులిప్ అమ్మకాలు ఏమైనా పెరిగాయా?
మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి యులిప్ (యూనిట్ లింక్డ్ పాలసీలు) అమ్మకాలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం మా అమ్మకాల్లో యులిప్స్ వాటా 60 శాతం దాటింది. మొత్తం పాలసీ అమ్మకాల్లో యులిప్ వాటా 50 నుంచి 60 శాతం లోపు ఉండే విధంగా చర్యలు తీసుకుంటాం.
 
కేంద్రం ప్రవేశపెట్టిన  బీమా పథకాల వల్ల టర్మ్ ఇన్సూరెన్స్ వ్యాపారంపై ఏమైనా ప్రతికూల ప్రభావం కనిపించే అవకాశం ఉందా?
కేంద్రం ప్రవేశపెట్టిన బీమా పథకాలు అద్భుతమైన విజయం సాధించాయి. వీటి వల్ల బీమా కంపెనీల వ్యాపారం దెబ్బతింటోందన్న వాదనతో నేను ఏకీభవించటం లేదు. వీటి వల్ల ప్రజల్లో బీమాపై మరింత అవగాహన పెరిగింది. మారిన కాలపరిస్థితుల్లో ప్రభుత్వం కల్పిస్తున్న రెండు లక్షల బీమా సరిపోదు. అందుకోసం ప్రజలు అదనపు బీమా రక్షణ కోసం బీమా కంపెనీలను ఆశ్రయిస్తారు. ఈ విధంగా బీమా వ్యాపారం మరింత పెరుగుతుందని ఆశిస్తున్నాం.
 
వ్యాపార విస్తరణకు సంబంధించి ఏమైనా మూలధనం సేకరించే అవకాశం ఉందా? హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ స్టాక్ మార్కెట్లో ఎప్పుడు లిస్టింగ్ అయ్యే అవకాశం ఉంది?
మా వాటాదారుల నుంచి వ్యాపార విస్తరణ కోసం గత నాలుగేళ్లుగా ఎటువంటి మూలధనాన్ని తీసుకోలేదు. ఇప్పుడు కూడా ఎటువంటి మూలధనం అవసరం లేదు. ఇక ఐపీవో విషయానికి వస్తే ప్రమోటర్ల మాటను బట్టి ఈ ఏడాది స్టాక్ మార్కెట్లో నమోదయ్యే అవకాశాలు కనిపించడం లేదు. నాలుగు వారాల్లో స్టాండర్డ్ లైఫ్ తన వాటాను 26 శాతం నుంచి 49 శాతానికి పెంచుకోనుంది. ఈ వాటా పెంచుకోవడం తర్వాతనే ఐపీవో ఉండొచ్చు. వచ్చే ఏడాది స్టాక్ మార్కెట్లో నమోదైనా కొత్తగా మూలధనం సేకరించాలని లేదు. వాటాదారులు తమ వాటాలను విక్రయించుకోవచ్చు.
 
వ్యాపార విస్తరణ, ఏజెంట్ల నియామకాల గురించి వివరిస్తారా?

ఆర్థిక పథకాల విషయంలో ఆన్‌లైన్‌లో పాలసీలు అందుబాటులో ఉన్నా చాలా మంది పాలసీలను తీసుకోవడానికి ఏజెంట్లనే ఆశ్రయిస్తున్నారు. అందుకే ఏజెంట్ల నియామకంపై దృష్టిసారిస్తున్నాం. ప్రస్తుతం హెచ్‌డీఎఫ్‌సీలో 70,000 ఏజెంట్లు ఉంటే ఈ ఏడాది అదనంగా 15 నుంచి 17 వేల మంది ఏజెంట్లను నియమించుకోవాలని నిర్ణయించుకున్నాం.
 
కొత్తగా ప్రవేశపెట్టిన సీఎస్‌సీ బీమా పథకం ప్రయోజనం ఏమిటి? మరిన్ని పథకాలు ప్రవేశపెట్టే ఆలోచన ఉందా?
అల్పాదాయ వర్గాలను దృష్టిలో పెట్టుకొని తక్కువ ప్రీమియంతో కూడిన టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ ‘సీఎస్‌సీ సురక్ష’ను ప్రారంభించాం. ఈ-సేవ కేంద్రాల ద్వారా కేవలం రెండు నిమిషాల్లో జారీ చేసే విధంగా దీన్ని రూపొందించాం. ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ పథకం విజయవంతమయితే మరిన్ని పథకాలను ప్రవేశపెడతాం.

Videos

మంగళగిరి పబ్లిక్ టాక్ లోకేష్ VS లావణ్య

చంద్రబాబుకు రోజా సూటి ప్రశ్న

జగన్ గారు నాకిచ్చిన బాధ్యత "కుప్పం" కుంభస్థలం బద్దలే బాబు

షర్మిల ప్రచారం అట్టర్ ఫ్లాప్..!

పవన్ కళ్యాణ్ లేదు తొక్క లేదు.. జగనన్న కోసం ప్రాణం ఇస్తా ... తగ్గేదేలే

గన్నవరంలో జోరుగా వల్లభనేని ఎన్నికల ప్రచారం

త్వరలో తెలంగాణలో వాలంటీర్ వ్యవస్థ: దేవులపల్లి అమర్

పవన్ కు పోతిన మహేష్ లేక "ప్రశ్నలు - పంచులు "

అబద్ధం చాలా అందంగా ఉంటుంది చంద్రబాబు మేనిఫెస్టోలా..!

ఓటమి భయంతోనే పిఠాపురానికి మకాం: శేషు కుమారి

4 కంటైనర్ లలో డబ్బు రవాణా 2 వేల కోట్లు పట్టుకున్న ఏపీ పోలీసులు

చంద్రబాబు చేసిన పనికి కన్నీళ్లు పెట్టుకున్న వృద్ధురాలు..!

మ్యానిఫెస్టో ని ఇంటింటికీ తీసుకువెళ్లటమే జగన్ కోసం సిద్ధం

చంద్రబాబు బ్యాచ్ కుట్రలతో పెన్షన్ దారులకు మరిన్ని కష్టాలు

ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై కూటమి అసత్యపు ప్రచారం చేస్తోంది

అందుకు ఏదైనా చికిత్స చేయించుకున్నారా?

చంద్రబాబుపై జగన్ మోహన్ రావు ఫైర్

Election Track: గెలుపు ఎవరిది ?..రాజమహేంద్రవరం ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్

కార్మికులను ఆదుకున్నది సీఎం జగన్ మాత్రమే

Photos

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)