amp pages | Sakshi

ఆలస్యమైతే కస్టమర్లు, రెవెన్యూలు హుష్‌కాకి

Published on Mon, 07/02/2018 - 08:59

ముంబై : దేశంలో అతిపెద్ద టెలికాం సంస్థగా అవతరించేందుకు.. వొడాఫోన్‌, ఐడియాలు విలీనం కాబోతున్న సంగతి తెలిసిందే. గతేడాది క్రితమే ఇరు కంపెనీలు విలీనంపై తుది ప్రకటన ఇచ్చేశాయి. అప్పటి నుంచి ఈ కంపెనీలు విలీన ప్రక్రియను కొనసాగిస్తూనే ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు ఈ ఒప్పంద ప్రక్రియ పూర్తి కాలేకపోయింది. వొడాఫోన్‌ ఇండియా-ఐడియా సెల్యులార్‌ విలీనం ఆలస్యమైతే, వీటి మెగా కంపెనీ భారీగా కస్టమర్లను, రెవెన్యూలను నష్టపోయే ప్రమాదముందని పరిశ్రమ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ విలీన ప్రక్రియ ముగియడానికి ఇంకా రెండు నెలలు పట్టే అవకాశముందని, ఈ సమయంలో రెవెన్యూ మార్కెట్‌ షేరులో ఈ సంస్థ 150 బేసిస్‌ పాయింట్లను కోల్పోయే ప్రమాదముందని తెలుస్తోంది. దీంతో ప్రతి రెండు నెలల జాప్యానికి 600 కోట్ల నుంచి వెయ్యి కోట్ల వరకు రెవెన్యూలను ఈ విలీన సంస్థ కోల్పోతుందని ఫిలిప్‌క్యాపిటల్‌ టెలికాం విశ్లేషకుడు నవీన్‌ కులకర్ని చెప్పారు. 

కీలక కస్టమర్లను, రెవెన్యూ మార్కెట్‌ షేరును భారతీ ఎయిర్‌టెల్‌కు, రిలయన్స్‌ జియోకు వదులుకోవాల్సి వస్తుందని కులకర్ని తెలిపారు. మార్కెట్‌ వ్యూహాల విధంగా వెళ్లి, విలీనాన్ని త్వరగా ముగించేయాలని చెప్పారు. గత నెల చివరి వరకే వొడాఫోన్‌, కుమార్‌ బిర్లాకు చెందిన ఐడియాల విలీన ఒప్పందం పూర్తి కావాల్సి ఉంది. కానీ మూడో పార్టీ ఆసక్తి మేరకు ఈ ప్రక్రియ ఆలస్యమవుతుందని తెలుస్తోంది. మెగా విలీనాన్ని వొడాఫోన్‌, ఐడియాలు రెండూ విజయవంతంగా ముగిస్తాయని, కొంత సమస్యం ఆలస్యమైతే అంత ప్రమాదకరమేమీ కాదని కంపెనీకి చెందిన ఎగ్జిక్యూటివ్‌ అన్నారు. విలీన సంస్థలో ఇరు కంపెనీలకు సమానమైన యాజమాన్య హక్కులు ఉంటాయి. విలీన సంస్థ పేరును వొడాఫోన్‌ ఐడియా లిమిటెడ్‌గా ప్రతిపాదించారు. విలీన సంస్థలో వొడాఫోన్‌ గ్రూప్‌ 45.1 శాతం, ఐడియా ప్రమోటర్లు 26 శాతం వాటా కలిగి ఉండనున్నారు. మిగతా 28.9 శాతం వాటా పబ్లిక్‌ షేర్‌ హోల్డర్ల వద్ద ఉండనుంది.
 

Videos

మంగళగిరిలో లోకేష్ ప్రచారానికి కనిపించని జనాదరణ

భూములపై ప్రజలను భయపెట్టే కుట్ర..అడ్డంగా బుక్కైన అబ్బా కొడుకులు

అభివృద్ధికి కేరాఫ్ బుగ్గన...

వాడి వేడి ప్రసంగాలు..హోరెత్తిన జన నినాదం..

ప్రచార జోరు: వైఎస్ఆర్ సీపీ అభ్యర్థులకు ప్రజల నుంచి అపూర్వ స్పందన

సీఐడీ నోటీసులు..దుష్ప్రచారాలపై విచారణ షురూ..

ఈరోజు సీఎం జగన్ షెడ్యూల్

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌