amp pages | Sakshi

ఫ్లిప్‌కార్ట్ భారీ రియల్టీ డీల్

Published on Sun, 10/19/2014 - 00:54

30 లక్షల చ.అ. ఆఫీస్ స్పేస్ లీజుకు తీసుకున్న ఈ కామర్స్ దిగ్గజం
ఏటా రూ. 300 కోట్ల కిరాయి

 
న్యూఢిల్లీ: ఆన్‌లైన్ షాపింగ్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్.. తాజాగా భారీ రియల్టీ డీల్‌కు తెరతీసింది. తమ కార్యకలాపాల కోసం బెంగళూరులో 30 లక్షల చ.అ. ఆఫీస్ స్థలాన్ని లీజుకు తీసుకుంది. దీనికి ఏటా రూ. 300 కోట్ల అద్దె చెల్లించనుంది. ఇందుకు సంబంధించి బెంగళూరుకి చెందిన రియల్టీ సంస్థ ఎంబసీ గ్రూప్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఆసక్తి వ్యక్తీకరణ పత్రంపై సంతకాలు చేసింది. 90 రోజుల్లోగా తుది ఒప్పందం కుదుర్చుకోవడం జరుగుతుందని ఈ డీల్ విషయంలో తోడ్పాటు అందించిన ప్రాపర్టీ కన్సల్టెంట్ జేఎల్‌ఎల్ ఇండియా కంట్రీ హెడ్ అనుజ్ పురి తెలిపారు.

దేశీయంగా రియల్ ఎస్టేట్ ఆఫీస్ మార్కెట్ రికవరీ బాట పడుతోందనడానికి ఈ డీల్ నిదర్శనమని ఆయన వివరించారు. ఈ ఒప్పందం ఒక కొలిక్కి రావడానికి దాదాపు ఏడాది పైగా పట్టిందని పురి చెప్పారు. మొత్తం 10 మంది డెవలపర్లను షార్ట్‌లిస్ట్ చేసి, చివరికి ఎంబసీ గ్రూప్‌ను ఎంపిక చేసినట్లు వివరించారు. అయితే, దీనిపై స్పందించడానికి ఫ్లిప్‌కార్ట్ నిరాకరించింది. స్నాప్‌డీల్, అమెజాన్ తదితర షాపింగ్ సైట్లతో పోటీపడేందుకు ఫ్లిప్‌కార్ట్ కార్యకలాపాలు భారీగా విస్తరిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో బాగంగా ఈ ఏడాది 12,000 మంది ఉద్యోగులను కూడా తీసుకోనుంది.

చ.అ.కు నెలకు రూ. 90 అద్దె..
30 లక్షల చ. అ. ఆఫీస్ స్థలాన్ని ఫ్లిప్‌కార్ట్‌కు దశలవారీగా లీజుకు అందచేస్తామని ఎంబసీ గ్రూప్ సీఎండీ జితు విర్వానీ తెలిపారు. ఫుల్లీ ఫర్నిష్డ్ ఆఫీస్ స్పేస్‌కి అద్దె నెలకు చ.అ.కు రూ. 90గా ఉంటుందని విర్వానీ పేర్కొన్నారు. 24 నెలల్లో ప్రాథమికంగా 15 లక్షల చ.అ. స్థలాన్ని అందచేస్తామన్నారు. ఆ తర్వాత 3-5 ఏళ్లలో 32.5 లక్షల చ.అ.కు పెంచే అవకాశం ఉందని తెలిపారు. బెంగళూరులోని అవుటర్ రింగ్ రోడ్ దగ్గర ‘ఎంబసీ ఆఫీస్ పార్క్’ పేరిట ప్రైవేట్ ఈక్విటీ సంస్థ బ్లాక్‌స్టోన్‌తో కలిసి ఎంబసీ గ్రూప్ నిర్మిస్తున్న ప్రాజెక్టులో ఈ ఆఫీస్ స్పేస్ ఉంటుంది.

Videos

మంగళగిరి పబ్లిక్ టాక్ లోకేష్ VS లావణ్య

చంద్రబాబుకు రోజా సూటి ప్రశ్న

జగన్ గారు నాకిచ్చిన బాధ్యత "కుప్పం" కుంభస్థలం బద్దలే బాబు

షర్మిల ప్రచారం అట్టర్ ఫ్లాప్..!

పవన్ కళ్యాణ్ లేదు తొక్క లేదు.. జగనన్న కోసం ప్రాణం ఇస్తా ... తగ్గేదేలే

గన్నవరంలో జోరుగా వల్లభనేని ఎన్నికల ప్రచారం

త్వరలో తెలంగాణలో వాలంటీర్ వ్యవస్థ: దేవులపల్లి అమర్

పవన్ కు పోతిన మహేష్ లేక "ప్రశ్నలు - పంచులు "

అబద్ధం చాలా అందంగా ఉంటుంది చంద్రబాబు మేనిఫెస్టోలా..!

ఓటమి భయంతోనే పిఠాపురానికి మకాం: శేషు కుమారి

4 కంటైనర్ లలో డబ్బు రవాణా 2 వేల కోట్లు పట్టుకున్న ఏపీ పోలీసులు

చంద్రబాబు చేసిన పనికి కన్నీళ్లు పెట్టుకున్న వృద్ధురాలు..!

మ్యానిఫెస్టో ని ఇంటింటికీ తీసుకువెళ్లటమే జగన్ కోసం సిద్ధం

చంద్రబాబు బ్యాచ్ కుట్రలతో పెన్షన్ దారులకు మరిన్ని కష్టాలు

ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై కూటమి అసత్యపు ప్రచారం చేస్తోంది

అందుకు ఏదైనా చికిత్స చేయించుకున్నారా?

చంద్రబాబుపై జగన్ మోహన్ రావు ఫైర్

Election Track: గెలుపు ఎవరిది ?..రాజమహేంద్రవరం ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్

కార్మికులను ఆదుకున్నది సీఎం జగన్ మాత్రమే

Photos

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)