amp pages | Sakshi

హైదరాబాద్‌ గీతాంజలికి ఈడీ షాక్‌

Published on Fri, 02/16/2018 - 10:21

న్యూఢిల్లీ, హైదరాబాద్‌ : పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకులో భారీ కుంభకోణానికి పాల్పడిన సెలబ్రిటీ వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీ ఆస్తులు, షోరూంలు, ఆఫీసులపై దాడులు కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌ రావిర్యాలలో ఉన్న జెమ్స్‌ పార్క్‌పై ఈడీ దాడులు నిర్వహిస్తోంది. అంతేకాక నీరవ్‌ మోదీకి చెందిన గీతాంజలి జెమ్స్‌ షోరూంల్లో కూడా దాడులు జరుగుతున్నాయి. ఇప్పటికే గీతాంజలి జెమ్స్‌ యజమాని మెహిల్‌పై ఈడీ పీఎంఎల్‌ఏ కేసును నమోదుచేసింది. పీఎన్‌బీ స్కాంలో మెహిల్‌ను నిందితుడిగా ఈడీ పేర్కొంది. ఆయన ఇంట్లీ, ఆఫీసుల్లో కూడా సోదాలు నిర్వహిస్తోంది. గత దశాబ్దకాలంగా గీతాంజలి జెమ్స్‌ పేరుతో నీరవ్‌ మోదీ వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌, సూరత్‌, ముంబైలలో గీతాంజలి జెమ్స్‌ షోరూంలు ఉన్నాయి. ఈ దాడుల్లో పలు కీలక డాక్యుమెంట్లను ఈడీ స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. హైదరాబాద్‌, సూరత్‌లలో నీరవ్‌ మోదీకి డైమాండ్‌ తయారీ కేంద్రాలున్నాయి. హైదరాబాద్‌ రావిర్యాల సెజ్‌లో ఆయనకు అప్పటి ప్రభుత్వం భూకేటాయింపులు చేసింది. అటు దేశవ్యాప్తంగా ఉన్ననీరవ్‌ మోదీ షోరూంలపై ఈడీ దాడులు నిర్వహిస్తోంది. ఆయన జువెల్లరీ షోరూంలను సైతం సీజ్‌ చేస్తోంది. కాగ, గీతాంజలి జెమ్స్‌కు దేశవ్యాప్తంగా వీఐపీలు కస్టమర్లుగా ఉన్నారు. 

బ్యాంకు అధికారులతో కుమ్మక్కై నీరవ్‌ మోదీ దాదాపు రూ.11,400 కోట్ల కుంభకోణానికి పాల్పడని సంగతి తెలిసింది. ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చే కొన్ని రోజుల ముందే ఆయన విదేశాలకు చెక్కేశారు. తమ బ్యాంకులో భారీ మొత్తంలో మోసపూరిత లావాదేవీలు చోటుచేసుకున్నాయంటూ బుధవారం పీఎన్‌బీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. ఈ కుంభకోణానికి, నీరవ్‌ మోదీకి సంబంధమున్నట్టు ఆరోపించింది. దీంతో ఈ అవినీతి తిమింగలాన్ని పట్టుకోవడం కోసం ఈడీ, సీబీఐ రంగంలోకి దిగాయి. కానీ అప్పటికే ఆయన దేశం విడిచిపారిపోయారు. ప్రస్తుతం నీరవ్‌మోదీ న్యూయార్క్‌లో ఉన్నట్టు అధికారులు ట్రేస్‌ చేశారు. ఈ కుంభకోణానికి పాల్పడిన ఎవరిన్నీ ఎట్టిపరిస్థితుల్లో వదిలిపెట్టేది లేదని బ్యాంకు నిన్నటి సమావేశంలో హెచ్చరించింది. కుంభకోణం వెలుగులోకి రాగానే పీఎన్‌బీ షేరు భారీగా పడిపోయింది. ఈ బ్యాంకు ఇన్వెస్టర్లు దాదాపు రూ.8000 కోట్ల సంపదను పోగొట్టుకున్నారు. మరోవైపు గీతాంజలి జెమ్స్‌ షేర్లు కూడా భారీగా పతనమవుతున్నాయి. మొత్తం 12 జాతీయ బ్యాంకులను నీరవ్‌ ముంచినట్టు కాంగ్రెస్‌ ఆరోపించింది. 


 

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)