amp pages | Sakshi

ఈ-కామర్స్‌కు డొమైన్ బూస్ట్

Published on Fri, 09/12/2014 - 02:05

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇంటర్నెట్ రంగంలో విప్లవాత్మక  మార్పులకు భారత్ వేదిక కానుంది. డాట్(.) భారత్ ఎక్స్‌టెన్షన్ రాకతో ఇప్పుడు ఇంగ్లీషు రానివారు సైతం నెట్‌లో విహరించేందుకు మార్గం సుగమం అయింది. ఇంటర్నెట్ విషయంలో అత్యంత వేగంగా వద్ది చెందుతున్న భారత్‌లో ప్రధాన అడ్డంకి దాదాపు తొలగిపోయినట్టే.

 ఉత్పత్తులు, సేవలు, విద్య తదితర రంగ సంస్థలు ఇక నుంచి తమ వెబ్‌సైట్లను స్థానిక భాషల్లో ఏర్పాటు చేసుకోవచ్చు. రంగమేదైనా సమాచారం స్థానిక భాషలో తెలుసుకునేందుకు సామాన్యుడికి వీలైంది. రానున్నరోజుల్లో ఈ-కామర్స్‌తోపాటు సమాచార, సాంకేతిక రంగంలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకోనున్నాయని నిపుణులు అంటున్నారు.

 ఏమిటీ డాట్ భారత్..
 డొమైన్ పేర్లు ఇప్పటి వరకు ఇంగ్లీషులోనే ఉండేవి. డాట్ భారత్ ఎక్స్‌టెన్షన్ రాకతో హిందీ, మరాఠి, కొంకణి, మైథాలి, నెపాలీ, బోరో, డోగ్రి, సింధి భాషల్లో వెబ్‌సైట్ పేర్లను నమోదు చేసుకునే అవకాశం లభించింది. కొద్ది రోజుల్లోనే తెలుగుతో సహా బెంగాళి, గుజరాతి, ఉర్దూ, తమిళ్, పంజాబి భాషలకు కూడా ఈ సౌకర్యం అందుబాటులోకి రానుంది. అయితే డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ మాత్రం ఇంగ్లీషులో ఉంటుంది. స్థానిక భాషలో ఇంటర్నెట్ వెబ్ చిరునామా (డొమైన్) టైప్ చేస్తే చాలు. ఉదాహరణకు ఠీఠీఠీ. ఎన్‌ఎండీసీ.భారత్ అన్నమాట. డాట్ భారత్ ఎక్స్‌టెన్షన్‌ను నేషనల్ ఇంటర్నెట్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇం డియా(నిక్సి) అభివృద్ధి చేసింది. ఇప్పటికే ఉన్న ‘డాట్ ఇన్’ డొమైన్ ఎక్స్‌టెన్షన్‌కు రిజిస్ట్రీగా నిక్సి వ్యవహరిస్తోంది.

 కంటెంట్‌కేం కొదవ లేదు..: ఏ వెబ్‌సైట్లో ఏముందో తెలుసుకోవడం ఇంగ్లీషు రానివారికి కష్టమే. ఇదంతా గతం. ఇప్పుడు నిక్సి చొరవతో ప్రపంచంలో ఏ మూలనున్నా, ఏ విషయాన్నైనా తెలుసుకోవచ్చు. చాలా వెబ్‌సైట్లు ఇప్పటికే స్థానిక భాషల్లో కంటెంట్(విషయం) అందిస్తున్నాయి. కంటెంట్ డెవలపర్లూ భారత్‌లో కోకొల్లలు. డెవలపర్లకూ ఇప్పుడు నూతన వ్యాపార వేదికలు దొరికినట్టే. కొత్త కొత్త యాప్స్ మార్కెట్లోకి వస్తాయి. విప్లవం ఇప్పుడే మొదలైందని అంటున్నారు డొమైన్ ఇన్వెస్టర్ అరవింద్ రెడ్డి. తెలుగు కీ బోర్డులు, కంటెంట్ విస్తృతమైతే సామాన్యుడికి చేరువ అయినట్టేనని చెబుతున్నారు. తెలుగు భాషను ఆధారంగా చేసుకుని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఎంత కాదన్నా 1,500 మంది యాప్ డెవలపర్లు ఉంటారని సమాచారం.

 వినియోగమూ పెరుగుతుంది..
 ప్రస్తుతం దేశవ్యాప్తంగా 20 కోట్ల మందికిపైగా ఇంటర్నెట్‌ను వినియోగిస్తున్నారని గూగుల్ చెబుతోంది. 2018 నాటికి 50 కోట్ల మందికిపైగా నెట్‌కు కనెక్ట్ అవుతారని గూగుల్ ఇండియా ఎండీ రాజన్ ఆనందన్ అంటున్నారు. ప్రతి నెల 50 లక్షల మంది కొత్త వినియోగదారులు వచ్చి చేరుతున్నారు. మొబైల్ ద్వారా ఇంటర్నెట్ వాడేవారు 15.5 కోట్ల మంది ఉన్నారు.

2017 నాటికి వీరి సంఖ్య 48 కోట్లను తాకుతుందని సర్చ్ ఇంజన్ దిగ్గజం అంటోంది. డాట్ భారత్ ప్రవేశంతో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశమూ లేకపోలేదు. అటు నేషనల్ ఆప్టిక్ ఫైబర్ నెట్‌వర్క్(ఎన్‌వోఎఫ్‌ఎన్) ప్రాజెక్టులో భాగంగా 2017 ఏడాది నాటికి 2.50 లక్షల గ్రామ పంచాయితీలకు హైస్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీ కల్పించాలిని కేంద్రం లక్ష్యంగా చేసుకుంది. ఇందుకోసం రూ.35 వేల కోట్లు వ్యయం చేస్తోంది.

 ఆన్‌లైన్ అమ్మకాలకు బూస్ట్...
 వాటర్ బాటిళ్లు సైతం ఇప్పుడు ఆన్‌లైన్‌లో బుక్ చేస్తున్నారు. దీనికంతటికీ కారణం సౌకర్యం. గుండు పిన్ను మొదలు విమానం దాకా ఆన్‌లైన్‌లో దొరుకుతున్నాయి. ఈ-కామర్స్ కంపెనీలు స్థానిక భాషల్లోనూ వెబ్‌సైట్లను తీర్చిదిద్దితే ఈ రంగంలో ఎవరూ ఊహించని అభివృద్ధి సాధ్యమవుతుందని నిక్సి సీఈవో గోవింద్ తెలిపారు. భారత్‌లో ఏ మూలనున్నా ఇంటర్నెట్ సౌకర్యం ఉండాలన్నదే తమ లక్ష్యమని చెప్పారు.

ప్రస్తుతం ఆన్‌లైన్ రిటైల్ వ్యాపారం భారత్‌లో రూ.13,800 కోట్లుగా ఉందని... 2020 నాటికి ఇది 1.92 లక్షల కోట్లకు చేరుకుంటుందని పరిశోధన సంస్థ టెక్నోప్యాక్ చెబుతోంది. ఎన్‌వోఎఫ్‌ఎన్ ప్రాజెక్టుతో గ్రామీణ ప్రాంతాల్లో ఇ-కామర్స్ విస్పోటనం సంభవిస్తుందని కేంద్ర కమ్యూనికేషన్లు, ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఇటీవల వ్యాఖ్యానించారు.

Videos

చంద్రబాబుపై సిదిరి అప్పలరాజు కామెంట్స్

చంద్రబాబుకు భారీ షాక్..ఇక టీడీపీ ఆఫీస్ కు తాళం పక్కా

వాలంటీర్లపై చంద్రబాబు రెండేళ్ళ కుట్ర

వైఎస్ జగన్ మళ్లీ సీఎం కావడం ఖాయం: వంగా గీత

దద్దరిల్లిన కనిగిరి..పాపిష్టి కళ్లు అవ్వాతాతలపై పడ్డాయి

డీబీటీకి పచ్చ బ్యాచ్ మోకాలడ్డు

గుడివాడ అమర్నాథ్ భార్య ఎన్నికల ప్రచారం

లోకేష్, ఆనంకు మేకపాటి విక్రమ్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

పవన్ కు యాంకర్ శ్యామల అదిరిపోయే కౌంటర్..

బాబుకు ఓటు వేస్తే కొండచిలువ నోట్లో తల పెట్టడమే

సింగరేణిపై కుట్ర..

నరసాపురం, క్రోసూరు, కనిగిరిలో హోరెత్తిన జగన్నినాదం

నేడు మూడు నియోజకవర్గాల్లో సీఎం జగన్ ప్రచార సభలు

లోకేష్ కామెడీ..మార్చి 13న ఓటెయ్యండి..

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)