బీఓబీ లాభం రూ.826 కోట్లు

Published on Fri, 07/26/2019 - 05:38

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌–జూన్‌ క్వార్టర్‌కు రూ.826 కోట్ల నికర లాభం(కన్సాలిడేటెడ్‌) సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో రూ.646 కోట్ల నికర లాభం ఆర్జించామని బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా తెలిపింది. దేనా బ్యాంక్, విజయ బ్యాంక్‌ల విలీనం తర్వాత తాము వెల్లడిస్తున్న తొలి ఆర్థిక ఫలితాలు ఇవని, అందుకని గత క్యూ1, ఈ క్యూ1 ఆర్థిక ఫలితాలను పోల్చడానికి లేదని పేర్కొంది. గత క్యూ1లో రూ.13,730 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ1లో రూ.22,057 కోట్లకు పెరిగిందని పేర్కొంది. నికర వడ్డీ ఆదాయం 2.6 శాతం వృద్ధితో రూ.6,496 కోట్లకు పెరిగిందని తెలిపింది. గత క్యూ4లో 2.78 శాతంబ ఉన్న నికర వడ్డీ మార్జిన్‌ ఈ క్యూ1లో 2.73 శాతానికి తగ్గిందని పేర్కొంది.  

4 శాతం పెరిగిన నిర్వహణ లాభం  
స్టాండ్‌అలోన్‌ పరంగా చూస్తే, ఈ క్యూ1లో నికర లాభం రూ.709 కోట్లు, మొత్తం ఆదాయం రూ.20,861 కోట్లని బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా తెలిపింది. గత క్యూ1లో రూ.528 కోట్ల నికర లాభం, రూ.12,788 కోట్ల ఆదాయం వచ్చాయని పేర్కొంది. స్టాండ్‌అలోన్‌ నిర్వహణ లాభం 4 శాతం వృద్ధితో రూ.4,276 కోట్లకు పెరిగిందని పేర్కొంది. సీక్వెన్షియల్‌గా చూస్తే, 34 శాతం వృద్ధి సాధించామని పేర్కొంది.  

తగ్గిన తాజా మొండి బకాయిలు....
ఈ క్యూ1లో స్థూల మొండి బకాయిలు 10.28 శాతంగా, నికర మొండిబకాయిలు 3.95 శాతంగా ఉన్నాయని బ్యాంక్‌ తెలిపింది. గత క్యూ1లో స్థూల మొండి బకాయిలు 12.46 శాతమని, నికర మొండి బకాయిలు 5.4 శాతమని వెల్లడించింది. ఈ క్యూ1లో తాజా మొండి బకాయిలు రూ.5,583 కోట్లని, సీక్వెన్షియల్‌గా చూస్తే, తాజా మొండి బకాయిలు తగ్గాయని తెలిపింది. ఈ క్యూ1లో రూ.3,168 కోట్ల కేటాయింపులు జరిపామని తెలిపింది. రిటైల్‌ రుణాలు 21 శాతం వృద్ధి చెందడంతో మొత్తం రుణాలు 5 శాతం ఎగసి రూ.5.33 లక్షల కోట్లకు పెరిగాయని పేర్కొంది. దేశీయ డిపాజిట్లు 9 శాతం పెరిగి రూ.7.85 లక్షల కోట్లకు చేరాయని తెలిపింది.  

ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా షేర్‌ 0.68 శాతం నష్టంతో రూ.110 వద్ద ముగిసింది.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ