amp pages | Sakshi

భారీగా తగ్గిన ఐఫోన్‌ ధరలు!

Published on Fri, 02/12/2016 - 19:22

మార్కెట్‌లో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా యాపిల్ ఐ-ఫోన్‌ ధరలు మాత్రం స్థిరంగా ఉంటాయి. అంతర్జాతీయంగా ఈ విషయం నిజమే అయినా భారత్‌ వచ్చేసరికి యాపిల్‌ కంపెనీకి కూడా ధరలు తగ్గించక తప్పని పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ఐ-ఫోన్6 ఎస్‌ ధర ఇటీవలకాలంలో గణనీయంగా తగ్గింది. తాజాగా ఈ మోడల్‌ ధర 27శాతం పడిపోయి.. ఏకంగా రూ. 45వేలకే కొన్ని ఈ కామర్స్ సైట్లలో లభిస్తున్నది.

యాపిల్ కంపెనీ ప్రతిష్టాత్మకంగా 64 జీబీ మోడల్ ఐఫోన్‌-6ఎస్‌ను గత ఏడాది అక్టోబర్‌లో భారత మార్కెట్‌లో విడుదల చేసింది. లాంచ్‌ చేసిన సమయంలో దీని ధర అక్షరాల రూ. 62వేలు. ఇప్పుడు గోల్డ్ కలర్ ఐఫోన్‌ 6ఎస్‌ మోడల్ కేవలం రూ. 44,799లకే అమెజాన్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది. అంటే ఈ మోడల్‌ ధర 27శాతం తగ్గింది. ఇక 64 జీబీ గ్రే కలర్ మోడల్ ధర మొదట్లో రూ. 72వేలు ఉండగా.. ఇప్పుడు అది రూ. 57,699కే లభిస్తున్నది.

పేటీఎంలోనూ ఐఫోన్‌ 6ఎస్‌ తక్కువ ధరకు లభిస్తున్నది. 6ఎస్‌ 128 జీబీ మోడల్ వాస్తవ ధర రూ. 82వేలు కాగా.. 20శాతం డిస్కౌంట్‌ తో రూ. 65,490లకే ఈ ఫోన్‌ లభిస్తున్నది. పేటీఎంలో ఐఫోన్‌ 6ఎస్‌ 64 జీబీ బేస్ మోడల్‌ రూ. 66,489కి లభిస్తుండగా, ఫ్లిప్‌కార్ట్‌లో ఇదే మోడల్‌ రూ. 49,999కి లభిస్తున్నది.

భారత మార్కెట్‌లో భారీగా తన వాటా పెంచుకోవాలని భావిస్తున్న యాపిల్ కంపెనీ ఐఫోన్‌ 6ఎస్‌ విషయంలో చేదు అనుభవమే ఎదురైంది. 2014, 2015 సంవత్సరాల్లో ఐఫోన్‌ 6 సాధించిన అమ్మకాలను.. 6ఎస్‌ మోడల్‌ సాధించకపోవడంతో వాటి ధరలు దిగివచ్చినట్టు పరిశీలకులు చెప్తున్నారు.

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)