amp pages | Sakshi

43 మెక్‌డొనాల్డ్స్‌ మూత, ఉద్యోగాలు గోవింద

Published on Thu, 06/29/2017 - 10:31

న్యూఢిల్లీ : మెక్‌డొనాల్డ్స్‌ విషయంలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. కన్నాట్ ప్లాజా రెస్టారెంట్ల(సీపీఆర్‌ఎల్‌) 50:50 జాయింట్‌​ వెంచర్‌ విక్రమ్‌ బక్షికి, మెక్‌డొనాల్డ్స్‌కు మధ్య వివాదాలు తలెత్తడంతో మెక్‌డీలు మూత పడే స్థాయికి వచ్చింది. ఢిల్లీలో నిర్వహిస్తున్న మొత్తం 55 రెస్టారెంట్లలో 43 మూడింటిని మూతవేయాలని సీపీఆర్‌ఎల్‌ బోర్డు నిర్వహించింది. నేటి(గురువారం) నుంచి ఇవి మూతపడనున్నాయి. '' ఇది చాలా దురదృష్టకరం. కానీ సీపీఆర్‌ఎల్‌కు చెందిన 43 రెస్టారెంట్లను తాత్కాలికంగా మూసి వేయాల్సి వస్తుంది'' అని సీపీఆర్‌ఎల్‌ మాజీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ విక్రమ్‌ బక్షి చెప్పారు. సీపీఆర్‌ఎల్‌ మొత్తం 168 రెస్టారెంట్లను ఆపరేట్‌ చేస్తోంది.
 
బక్షి ప్రస్తుతం మేనేజింగ్‌ డైరెక్టర్‌గా లేనప్పటికీ, ఆయన, తన భార్యతో కలిసి సీపీఆర్‌ఎల్‌లో బోర్డు సభ్యులుగా ఉంటున్నారు. సీపీఆర్‌ఎల్‌ బోర్డులో మెక్‌డొనాల్డ్స్‌కు చెందిన ఇద్దరు ప్రతినిధులూ ఉన్నారు. కానీ బుధవారం ఉదయం స్కైప్‌ ద్వారా నిర్వహించిన బోర్డు మీటింగ్‌లో మెక్‌డొనాల్డ్స్‌ అవుట్‌లెట్లను మూసివేయాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ఈ నిర్ణయంతో 1,700 మంది ఉద్యోగాలు కోల్పోనున్నారు. అయితే మూసివేసే విషయానికి గల ప్రధాన కారణాలను ఈ జాయింట్‌ వెంచర్‌ భాగస్వామి వెల్లడించలేదు.
 
బక్షికి, మెక్‌డొనాల్డ్స్‌కు వివాదం తలెత్తడంతో, సీపీఆర్‌ఎల్‌ కచ్చితంగా చేయాల్సిన రెగ్యులేటరీ హెల్త్‌ లైసెన్సులను కూడా రెన్యువల్‌ చేయించలేదు.  2013 ఆగస్టులో సీపీఆర్‌ఎల్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా తొలగించబడ్డ బక్షి, మెక్‌డొనాల్డ్స్‌తో వివాదానికి దిగారు. ఈ విషయంపై కంపెనీ లా బోర్డులో విచారణ కూడా జరుగుతోంది. బక్షికి వ్యతిరేకంగా మెక్‌డొనాల్డ్స్‌ కూడా లండన్‌ కోర్టులో ఆర్బిట్రేషన్‌ దాఖలు చేసింది. నార్త్‌, ఈస్ట్‌ ఇండియాలో మాత్రమే మెక్‌డీలను క​న్నాట్ ప్లాజా రెస్టారెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వహిస్తోంది.  సౌత్‌, వెస్ట్‌ ఇండియాలో మెక్‌డొనాల్డ్స్‌ ఆపరేషన్లను హార్డ్‌ క్యాసిల్‌ రెస్టారెంట్ల ప్రైవేట్‌ లిమిటెడ్‌ ద్వారా వెస్ట్‌లైఫ్‌ డెవలప్‌మెంట్‌ లిమిటెడ్‌ నిర్వహిస్తోంది. సీపీఆర్‌ఎల్‌ ప్రస్తుతం తీసుకున్న నిర్ణయం మెక్‌డొనాల్డ్స్‌కు ప్రమాదకరమని బ్రాండింగ్‌ నిపుణులు చెబుతున్నారు.  
 

Videos

అమెరికాలో ప్రమాదంలో ప్రాణాలు విడిచిన తెలంగాణ యువకుడు

చంద్రబాబుకి బయపడి గుళ్లలో తలా దాచుకుంటున్నారు..

తాడిపత్రి హింసాత్మక ఘటనల వెనుక అసలు హస్తం

కుప్పం నుండి ఇచ్చాపురం వరకు అందుకే పోలింగ్ శాతం పెరిగింది

పోలీసులు ఏ రాజకీయ పార్టీల ప్రలోభాలకు లోను కాకుండా నిస్పక్షపాతంగా పనిచెయ్యాలి

ఏపీ ఎన్నికల అల్లర్ల పై సిట్ విచారణ.. ఇప్పటికే పోలీసుల ఫై వేటు

మోడీపై పోటీ చేస్తున్న శ్యామ్ కు షాక్..

మాట నిలబెట్టుకునే మా అన్నకు మా ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి

అచ్చెన్నాయుడు రిగ్గింగ్.. అడ్డుకున్న వారిపై దాడి

ప్రేమ పేరుతో యువకుడిని మోసం చేసిన యువతి

Photos

+5

Sangeetha Sringeri: పునీత్‌ రాజ్‌కుమార్‌ సమాధి వద్ద నటి బర్త్‌డే సెలబ్రేషన్స్‌ (ఫొటోలు)

+5

సంతోషంలో కావ్యా మారన్‌.. కేన్‌ విలియమ్సన్‌ను పలకరించి మరీ! (ఫొటోలు)

+5

అభిషేక్‌ శర్మ తల్లి పాదాలకు నమస్కరించిన శుబ్‌మన్‌ .. ఫొటోలు వైరల్‌

+5

ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా?.. ఫేమస్‌ టీటీ ప్లేయర్‌!(ఫొటోలు)

+5

ఒకప్పుడు చిన్నపాటి గదిలో.. ఇప్పుడు హీరోలకు ధీటుగా రూ.550 కోట్ల సంపద.. ఎవరో గుర్తుపట్టారా? (ఫొటోలు)

+5

Sireesha: భర్తతో విడాకులు.. ట్రెండింగ్‌లో తెలుగు నటి (ఫోటోలు)

+5

ఫ్యాన్స్‌లో నిరాశ నింపిన వర్షం.. తడిసిన ఉప్పల్ స్డేడియం (ఫోటోలు)

+5

లవ్‌ మీ సినిమా స్టోరీ లీక్‌ చేసిన బ్యూటీ, క్లైమాక్స్‌ కూడా చెప్పకపోయావా! (ఫోటోలు)

+5

Hyderabad Heavy Rains: హైదరాబాద్‌లో కుండపోత వాన.. భారీగా ట్రాఫిక్‌ జాం (ఫొటోలు)

+5

‘సర్‌.. నేను మీ అమ్మాయిని లవ్‌ చేస్తున్నా’.. 13 ఏళ్ల ప్రేమ, పెళ్లి! (ఫొటోలు)