amp pages | Sakshi

‘అగ్రిగోల్డ్‌’పై సీబీఐ విచారణ జరిపించాలి

Published on Tue, 02/07/2017 - 03:56

ఎంపీ వైవీ సుబ్బారెడ్డి డిమాండ్‌

సాక్షి, న్యూఢిల్లీ:
అగ్రిగోల్డ్‌ కుంభకోణం వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలని వైఎస్సార్‌సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి డిమాండ్‌ చేశారు. ఈ సంస్థ మోసాల వల్ల సుమారు 40 లక్షల మంది బాధితులయ్యారన్నారు. అగ్రి గోల్డ్‌ బాధితులకు, ఏజెంట్లకు రాష్ట్ర ప్రభుత్వాలు నష్టపరి హారాన్ని చెల్లించాలని కోరుతూ సంస్థ బాధితులు,ఏజెంట్ల సంఘం సోమవారం ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద రిలే నిరాహార దీక్ష చేపట్టాయి.  ఆయన దీక్షా శిబి రాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు.

పశ్చిమ బెంగాల్‌లో జరిగిన శారదా స్కాం వ్యవహారంలో అక్కడి ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించిందన్నారు. అగ్రిగోల్డ్‌ వ్యవహారంలో ప్రభుత్వం ఎందుకు సీబీఐ విచారణకు ఆదేశించలేదని ప్రశ్నించారు. అగ్రిగోల్డ్‌ స్కాం వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపాలని 2015 మే 23న కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీకి తాను లేఖ రాశానన్నారు. అగ్రిగోల్డ్‌ మోసాన్ని ఆర్థిక ఉగ్రవాదంగా పరిగణించి చర్యలు తీసుకోవాలని బాధితులు, ఏజెంట్ల సంఘం జాతీయ అధ్యక్షుడు రమేశ్‌ బాబు కోరారు. అగ్రి గోల్డ్‌ ఆస్తులను అమ్మి బాధితులకు డబ్బు చెల్లించేలా రాష్ట్రాలను ఆదేశించాలని ఈ నెల 8న ప్రధానిని, కేంద్ర హోంమంత్రిని కలసి విన్నవించనున్నట్టు తెలిపారు.

వేలానికి ఆరు అక్షయగోల్డ్‌ ఆస్తుల గుర్తింపు  
- ఇందుకోసం పత్రికా ప్రకటనలు ఇవ్వాలని హైకోర్టు ఆదేశం
సాక్షి, హైదరాబాద్‌: అగ్రిగోల్డ్‌ ఆస్తుల వేలం మొదలైన నేపథ్యంలో ఇప్పుడు అక్షయగోల్డ్‌ ఆస్తుల వేలంపై ఉమ్మడి హైకోర్టు దృష్టి సారిం చింది. వేలానికి అర్హమైన 6 ఆస్తులకు సంబం ధించిన  వివరాలతో పత్రికల్లో ప్రకటనలు ఇవ్వా లని ఏపీ సీఐడీ అధికారులను ఆదేశించింది. బిడ్‌ల దాఖలుకు మార్చి 6 చివరి తేదీగా నిర్ణయించింది. విచారణను మార్చి 8కి వాయిదా వేసింది. ఆ రోజు కోర్టు లోనే బిడ్లు తెరుస్తామని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ వి.రామసుబ్రమణియన్, జస్టిస్‌ ఎస్‌.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.

తమ నుంచి దాదాపు రూ.600 కోట్ల మేర డిపా జిట్లు వసూలు చేసి తిరిగి చెల్లించకుండా అక్షయగోల్డ్‌ యాజమాన్యం ఎగవేసిం దని, దీనిపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ అక్షయగోల్డ్‌ వినియోగ దారులు, ఏజెంట్ల సంక్షేమ సంఘం, మరికొందరు హైకోర్టులో వేర్వేరుగా ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేసిన విషయం తెలిసిందే.  గత విచారణ సమ యంలో ఆదేశించిన విధంగా వేలానికి అర్హమైన ఆస్తుల వివరాలను సీఐడీ అధికా రులు ధర్మాసనం ముందుంచారు. 6 ఆస్తులకు సంబంధించిన కనీస ధరలను అటు పిటిషనర్లు, ఇటు సీఐడీ అధికారులు కోర్టుకు నివేదించారు.

కర్నూలు జిల్లా, ఎమ్మిగనూరులోని 528 చదరపు గజాల స్థలానికి రూ.1.47 కోట్లను కనీస ధరగా నిర్ణయించారు. కర్నూలులో ఆ సంస్థకున్న జీ ప్లస్‌2 భవనానికి రూ.2.78 కోట్లను, ప్రకాశం జిల్లా, పామూరు మండల పరిధిలోని 76 ఎకరాలకు రూ.2.25 కోట్లు, అనంతపురం జిల్లా, చాగలమర్రి గ్రామంలోని 57 ఎకరాలకు రూ.1.30 కోట్లు, విజయనగరం జిల్లా, ములగ గ్రామ పరిధిలోని 63.86 ఎకరాలకు రూ.2.35 కోట్లను కనీస ధరగా నిర్ణయించారు.

Videos

చంద్రబాబుపై సిదిరి అప్పలరాజు కామెంట్స్

చంద్రబాబుకు భారీ షాక్..ఇక టీడీపీ ఆఫీస్ కు తాళం పక్కా

వాలంటీర్లపై చంద్రబాబు రెండేళ్ళ కుట్ర

వైఎస్ జగన్ మళ్లీ సీఎం కావడం ఖాయం: వంగా గీత

దద్దరిల్లిన కనిగిరి..పాపిష్టి కళ్లు అవ్వాతాతలపై పడ్డాయి

డీబీటీకి పచ్చ బ్యాచ్ మోకాలడ్డు

గుడివాడ అమర్నాథ్ భార్య ఎన్నికల ప్రచారం

లోకేష్, ఆనంకు మేకపాటి విక్రమ్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

పవన్ కు యాంకర్ శ్యామల అదిరిపోయే కౌంటర్..

బాబుకు ఓటు వేస్తే కొండచిలువ నోట్లో తల పెట్టడమే

సింగరేణిపై కుట్ర..

నరసాపురం, క్రోసూరు, కనిగిరిలో హోరెత్తిన జగన్నినాదం

నేడు మూడు నియోజకవర్గాల్లో సీఎం జగన్ ప్రచార సభలు

లోకేష్ కామెడీ..మార్చి 13న ఓటెయ్యండి..

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)