ప్రజాసంకల్పయాత్ర 171వ రోజు ప్రారంభం

Published on Fri, 05/25/2018 - 09:20

సాక్షి, ఉంగుటూరు (పశ్చిమ గోదావరి జిల్లా) : ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 171వ రోజు ప్రారంభమైంది. శుక్రవారం ఉదయం నైట్‌ క్యాంపు పెదకాపవరం నుంచి జననేత వైఎస్‌ జగన్‌ తన పాదయాత్ర చేపట్టారు. పెద కాపవరం, చిన కాపవరం, గుమ్ములూరు, తరటావ మీదుగా కొనసాగనున్న పాదయాత్ర కొల్లపర్రుకు చేరుకున్నాక వైఎస్‌ జగన్‌ విరామం తీసుకుంటారు. 

లంచ్‌ క్యాంపు అనంతరం కొల్లపర్రు నుంచి మళ్లీ పాదయాత్ర కొనసాగించనున్న వైఎస్‌ జగన్‌, ఆకివీడులో ఏర్పాటు చేసిన బహిరంగసభలో పాల్గొని ప్రసంగిస్తారు. చివరగా అజ్జుమూరులో శుక్రవారం రాత్రి పాదయాత్ర ముగించి, రాత్రికి వైఎస్‌ జగన్‌ అక్కడే బస చేస్తారు. తమ విలువైన సలహాలు, సూచనలు ఇవ్వాల్సిన వారు జననేత జగన్‌ను నేరుగా కలుసుకుని మాట్లాడవచ్చు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా గురువారం నాటికి 2,131.2 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేసిన వైఎస్‌ జగన్‌ ప్రజలతో మమేకమవుతూ వారికి భరోసా కల్పిస్తున్నారు.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ