285వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్‌

Published on Sat, 10/13/2018 - 19:38

సాక్షి, గజపతి నగరం: ప్రజలతో మమేకమై వారి సమస్యలు తెలుసుకుని.. వారిలో భరోసా నింపేందుకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 285వ రోజు షెడ్యూల్‌ ఖరారైంది. జననేత చేపట్టిన పాదయాత్ర విజయనగరం జిల్లాలో అనంతవాహినిలా సాగిపోతోంది. ఆదివారం ఉదయం జననేత గజపతి నగరం నియోజకవర్గం దత్తిరాజేరు మండలం కోమటిపల్లి నుంచి పాదయాత్ర ప్రారంభిస్తారు. అక్కడి నుంచి తాడేందొరవలస క్రాస్‌, కౌండినవలస క్రాస్‌, మరదం వరకు జననేత పాదయాత్ర కొనసాగనుంది. అక్కడ వైఎస్‌ జగన్‌ భోజన విరామం తీసుకుంటారు. తిరిగి మధ్యాహ్నం 2.45 గంటలకు తిరిగి పాదయాత్ర ప్రారంభిస్తారు. అక్కడి నుంచి సికారుగండి క్రాస్‌, కె.కొత్తవలస క్రాస్‌, ఎస్‌. బుర్జావలస వరకు వైఎస్‌ జగన్‌ పాదయాత్ర కొనసాగుతుంది. ఈ మేరకు వైఎస్సార్‌సీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఓ ప్రకటన విడుదల చేశారు.

ముగిసిన పాదయాత్ర: వైఎస్‌ జగన్‌ 284వ రోజు పాదయాత్ర శనివారం కోమటిపల్లి వద్ద ముగిసింది. నేడు జననేత పాదయాత్ర గజపతినగరం శివారు నుంచి పాదయాత్రను ప్రారంభించారు. అక్కడి నుంచి గజపతి నగరం నియోజకవర్గంలోని మధుపాడు, భూదేవీపేట క్రాస్‌, మరుపల్లి, కొత్తరోడ్డు జంక్షన్‌, గుడివాడ క్రాస్‌, మానాపురం, మానాపురం సంత మీదుగా కోమటిపల్లి వరకు ఈ రోజు పాదయాత్ర కొనసాగింది. నేటి ప్రజాసంకల్పయాత్రలో జననేత 10.5 కిలోమీటర్లు నడిచారు. దీంతో ఇప్పటివరకు మొత్తంగా 3,135.5 కిలోమీటర్ల పాదయాత్రను రాజన్న తనయుడు పూర్తిచేశారు.

Videos

చంద్రన్న కాంగ్రెస్ కు సీఎం జగన్ కౌంటర్..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కలికిరి (అన్నమయ్య జిల్లా)

జనసేన నాయకురాలిపై.. చింతమనేని ఆగ్రహం

చంద్రన్న కాంగ్రెస్ సీఎం జగన్ మాస్ స్పీచ్

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

చంద్రన్న కాంగ్రెస్ సీఎం జగన్ మాస్ స్పీచ్

మన ప్రశ్నలకు బాబు, పురందేశ్వరి, పవన్ కు పిచ్చి, పిచ్చి కోపం వస్తుందంటా..!

వీళ్ళే మన అభ్యర్థులు.. గెలిపించాల్సిన బాధ్యత మీదే..!

కొడాలి నాని ఎన్నికల ప్రచారం.. బ్రహ్మరథం పట్టిన గుడివాడ ప్రజలు

జనంతో కిక్కిరిసిన మైదుకూరు

జగన్ గెలుపుకు అర్ధం..!

పిఠాపురంలో పవన్ కల్యాణ్ ఓడిపోవడం ఖాయం

సీఎం జగన్ రాయల్ ఎంట్రీ @మైదుకూరు

Watch Live: మైదుకూరులో సీఎం జగన్‌ ప్రచార సభ

Photos

+5

10 లక్షల 1116 సార్లు గోవింద నామాలు (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

కన్నడ బ్యూటీ 'నందిత శ్వేత' పుట్టినరోజు స్పెషల్‌ ఫోటోలు

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

HBD Rohit Sharma: హిట్‌మ్యాన్‌ కుటుంబం గురించి తెలుసా? బ్యాగ్రౌండ్‌ ఇదే!

+5

మత్తెక్కించే ప్రజ్ఞా నగ్రా అందం.. చూపులతోనే కుర్రకారు గుండెల్లో చిచ్చు! (ఫొటోలు)

+5

చీరకట్టులో తమన్నా.. మిల్కీ బ్యూటీ స్పెషల్ ట్రీట్ (ఫొటోలు)