amp pages | Sakshi

వైఎస్ విగ్రహాలే లక్ష్యమా..?

Published on Tue, 03/31/2015 - 03:14

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.విగ్రహాలే లక్ష్యంగా టీడీపీ ప్రభుత్వం పావులు కదుపుతోందా!... కోర్టు తీర్పు, నిబంధనల అమలుపేరుతో ఇందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతోందా!... జీవీఎంసీ పరిధిలో అధికార యంత్రాంగం నడుపుతున్న తతంగం ఇందుకు బలాన్ని చేకూరుస్తోంది. ఈ అంశంపై జీవీఎంసీ అధికారులు స్పందిం చేందుకు నిరాకరిస్తుండటం సందేహాలకు మరింత బలాన్ని చేకూరుస్తోంది.
 
నోటీసులే.. నోటీసులే : అనుమతిలేని విగ్రహాలను తొలగించాలని జీవీఎంసీ అధికారులు రెండు రోజులుగా నోటీసులు జారీ చేస్తున్నారు. ప్రభుత్వ ప్రదేశాలలో అనధికారికంగా ఉన్న విగ్రహాలకు ఈ నోటీసులు జారీ చేస్తున్నామని జీవీఎంసీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. జీవీఎంసీ పరిధిలో 109 విగ్రహాలలో 99 విగ్రహాలు అనధికారికంగా ఉన్నాయని గుర్తించారు. ఆ విగ్రహాలన్నింటికీ నోటీసులు జారీ చేసినట్లు చెబుతున్నారు. ఇలా భీమిలి నియోజకవర్గ పరిధిలోని మధురవాడ, కొమ్మాది పరిధిలోని నాలుగు చోట్ల నెలకొల్పిన వై.ఎస్.రాజశేఖరరెడ్డి విగ్రహాల తొలగింపునకు నోటీసులు జారీ చేశారు. వాటిని ఏర్పాటు చేసిన నిర్వాహకుల ఇళ్లకు వెళ్లి నోటీసులు అందిస్తున్నారు.

ఆ విగ్రహాలను తొలగించాలని స్పష్టం చేశారు. లేకపోతే తామే తొలగించి ఆ వ్యయాన్ని నిర్వాహకుల నుంచి రాబడతామనితేల్చిచెప్పారు.  అనకాపల్లిలో ఉన్న 28 విగ్రహాలలో 25 విగ్రహాల తొలగింపునకు నోటీసులు ఇచ్చారు. నోటీసులు ఇవ్వని మూడు విగ్రహాలు జవహర్‌లాల్ నెహ్రూ, అంబేద్కర్, ఎన్టీ రామారావులది. మిగిలిన అన్ని విగ్రహాలకు నోటీసులు ఇచ్చారు. వాటిలో అత్యధికంగా వై.ఎస్.రాజశేఖరరెడ్డివే కా వడం గమనార్హం.త్వరలోనే జీవీఎంసీ పరిధిలోని మిగిలిన ప్రాంతాల్లో ఉన్న విగ్రహాలకు కూడా నోటీసులు ఇచ్చేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. తదనంతరం జిల్లాలోని విగ్రహాలపై కూడా అధికారులు గురిపెట్టనున్నారు.
 
పారదర్శకత ఏదీ!: న్యాయస్థానం తీర్పును అమలు చేయడాన్ని ఎవరూ తప్పుబట్టరు. కానీ ఆ పేరుతో ప్రభుత్వం సాగిస్తున్న వ్యవహారంలో పారదర్శకత లోపించడమే సందేహాలకు తావిస్తోంది. కేవలం వై.ఎస్.రాజశేఖరరెడ్డి విగ్రహాలను తొలగించడమే లక్ష్యంగా ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది. అంతగా పారదర్శకంగా చేయదలచుకుంటే జీవీఎంసీ అధికారులే తొలగించాల్సిన విగ్రహాల జాబితాను అధికారికంగా ప్రకటించేవారు. అసలు ఏ విగ్రహాలకు నోటీసులు ఇచ్చారనే విషయాన్ని వెల్లడించేవారు. దాంతో ఏ నేతల విగ్రహాలు జాబితాలో ఉన్నాయనే విషయం అందరికీ తెలిసేది.

కానీ అధికారులు అలా చేయలేదు. అంతా గోప్యంగా చేస్తుండటంతోనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఉదాహరణకు కొమ్మాది జంక్షన్‌లో వై.ఎస్.రాజశేఖరరెడ్డి విగ్రహం ఏర్పాటుకు అప్పట్లో జీవీఎంసీ మేయర్, కలెక్టర్లకు దరఖాస్తు చేశారు. అప్పటి ప్రజాప్రతినిధులే ఈ మేరకు అధికారులతో మాట్లాడారు. కానీ ఆ విగ్రహాన్ని తొలగిస్తామని ప్రస్తుతం జీవీఎంసీ అధికారులు నోటీసులు జారీ చేయడంతో నిర్వాహకులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అనకాపల్లిలో కూడా అధికారుల వ్యవహార శైలి అలాగే ఉంది. విగ్రహాల తొలగింపు అంశంపై స్పందించేందుకు అధికారులు విముఖత చూపుతుండటం జీవీఎంసీ తీరుపై సందేహాలు బలపడుతున్నాయి.

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)