amp pages | Sakshi

ఏం కష్టమొచ్చిందో...

Published on Sun, 12/03/2017 - 10:43

ఏం కష్టమొచ్చిందో...ఓ  పాతికేళ్ల యువతి  పట్టణ శివారు ప్రాంతంలో ఎవరికీ కనబడకుండా  తుప్పల్లోకి వెళ్లి   వస్తువులన్నీ పక్కన పెట్టి పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకొంది. కేంద్రాసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం  అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో మృత్యుఒడిలోకి చేరింది.  చికిత్స సమయంలో ఆమె పోలీసులకు  చెప్పిన మాటలకు,  సంఘటన స్థలం వద్ద  ప్రమాదం జరిగిన తీరు   అనుమానాలకు తావిస్తుండడంతో పోలీసులు విచారణ ప్రారంభించారు.  క్లూస్‌ టీమ్, ఫింగర్‌ ప్రింట్స్,  డాగ్‌ స్క్వాడ్‌తో పాటు ఏడు ప్రత్యేక పోలీస్‌ బృందాలు రంగంలోకి దిగాయి. కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎస్పీ జి.పాలరాజు పర్యవేక్షణ చేశారు.  సీసీ పుటేజీలలో ఆమె స్థానిక కలెక్టరేట్‌ వద్ద నుంచి కెఎల్‌.పురం వైపు వెళ్లే పెట్రోల్‌ బంకులో  పెట్రోల్‌ కొనుగోలు చేస్తున్న దృశ్యాలను కనుగొన్నారు. ఆమెకు ఆత్మహత్య చేసుకోవాల్సినంత అవసరం ఏమొచ్చిందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

విజయనగరం టౌన్‌:  పట్టణ శివారు ద్వారపూడి గ్యాస్‌ గోడౌన్స్‌ దాటిన తర్వాత ఉన్న రియల్‌ ఎస్టేట్‌ ఖాళీ స్థలం లోపలికి  పట్టణానికి చెందిన ముదునూరి అశ్విని (25) శుక్రవారం సాయంత్రం వెళ్లి ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికులు ఆమెను  గుర్తించి పోలీసులకు సమాచారమందించారు.  కేంద్రాసుపత్రిలో  చికిత్స పొందుతూ ఆమె రాత్రి 12 గంటల ప్రాంతంలో మృతి చెందింది.  పోలీసుల విచారణలో మాత్రం పొంతనలేని సమాధానాలు చెప్పడంతో  అనుమానం వచ్చిన పోలీసులు ఆ దిశగా విచారణ చేపట్టారు.

విచారణ వేగవంతం 
కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎస్పీ జి.పాలరాజు ఏడు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు.  యువతి చెప్పిన ఆధారాలతో తమదైన శైలిలో అశ్వినిది హత్య, ఆత్మహత్య  అన్న కోణంలో  దర్యాప్తు ప్రారంభించారు. శనివారం ఉదయం క్లూస్‌ టీమ్, డాగ్‌ స్క్వాడ్,  వేలిముద్ర నిపుణులు సంఘటనా స్థలానికి చేరుకుని అక్కడ లభ్యమైన యువతి బైక్‌ కీ, కర్చీఫ్, కళ్లద్దాలు, కాలిన వస్త్రాలు, చర్మం, వంటి వాటిని గుర్తించారు. డాగ్‌ స్క్వాడ్‌ ఆమె కాలిన తర్వాత కొంత దూరం వచ్చిన దూరాన్ని  గుర్తించగలిగింది.  ఈ సందర్భంగా సంఘటనా çస్థలాన్ని పరిశీలించిన ఎస్పీ జి.పాలరాజు మాట్లాడుతూ  పూర్తి ఆధారాలు సేకరించామన్నారు.

పెట్రోల్‌ బాటిల్‌ ఇంట్లోదే.. 
సంఘటనా స్థలం వద్ద  లభించిన పెట్రోల్‌ బాటిల్‌ను  అశ్వని తండ్రి వెంకటసాయిరామ్‌ గుర్తించారు. అది ఇంట్లో బాటిలేనని తెలిపారు. కర్చీఫ్, కళ్లద్దాలు కూడా ఆమెవేనని చెబుతూ కన్నీటి పర్యంతమయ్యారు.

సీసీ పుటేజీల్లో...
అశ్విని ఆత్మహత్యకు ముందు కలెక్టరేట్‌ నుంచి కెఎల్‌.పురం వెళ్లే రహదారిలో ఉన్న పెట్రోల్‌ బంకులో పెట్రోలు కొనుగోలు చేస్తున్నట్లు  పోలీసులు గుర్తించారు.  3.41 నిమషాల నుంచి ఆమె పెట్రోల్‌ బంక్‌ వద్దకు చేరుకుని పెట్రోల్‌ ముందు బైక్‌లో కొట్టిం చి, తర్వాత బాటిల్‌లో నిండుగా పోయించింది. ఒకానొక సమయంలో టెన్షన్‌తో ఉన్నట్లు అక్కడ పుటేజీలో కనబడింది. పెట్రోల్‌ కొనుగోలు తర్వాత బాటిల్‌ ముందున పెట్టుకుంటే అది కాస్త కిందపడిపోయింది. దాన్ని  అక్కడ పని చేస్తున్న సిబ్బంది  అందించడంతో వెనుక సీట్‌ కిందన పెట్టి  వేగంగా వెళ్లిపోయినట్లు  గుర్తించారు.

ఒబిసిటీయే కారణమా?
అతి లావు, పెరిగిన వయసు, పెళ్లి కాకపోవడం వంటి కారణాలు తల్లిదండ్రులు చెప్పుకొస్తున్నారని పోలీసులు తెలిపారు. అవి కారణాలు కాకపోయి ఉండవచ్చనే అనుమానాలు బలమవుతున్నాయి.  ఆమె ఆత్మహత్యకు ఇంకా బలమైన కారణమేదో ఉంటుందని ఆ కోణంలో దర్యాప్తు చేసి విచారణ పూర్తి చేస్తామని  ఎస్పీ తెలిపారు.

ఎందుకలా...
అశ్విని మృత్యువుతో పోరాడుతున్న సమయంలో  పోలీసులకు ఇచ్చిన సమాచారంలో  ఎవరో ఇద్దరు దుండగులు తన దగ్గరకు వచ్చి పేరేంటని ప్రశ్నించి,  పేరు చెప్పగానే కిరోసిన్‌ పోసి నిప్పంటించారని, మరోసారి కాళ్లు చేతులు కట్టేశారని చెప్పుకొచ్చింది. పట్టణంలోని సీసీ కెమెరాల పరిశీలనలో ఆశ్చర్యకరమైన విషయం బట్టబయలైంది.  పెట్రోల్‌ బంక్‌లో అశ్వినియే పెట్రోల్‌ కొనుగోలు చేసినట్లు రికార్డ్‌ అయింది.  దీని ఆధారంగా యువతిపై దాడి జరగలేదని తనే ఆత్మహత్యకు పాల్ప డినట్లు తెలుస్తోందని పోలీసులు స్పష్టం చేశారు. చివరి నిమిషంలో ఎందుకలా చెప్పింది, ఆ యువతికి వచ్చిన కష్టమేంటి, ఆత్మహత్యకు గల కారణాలేంటి? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)