amp pages | Sakshi

రాజన్నకు ఘన నివాళి

Published on Wed, 09/03/2014 - 01:10

మాజీ ముఖ్యమంత్రి, దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ఐదవ వర్ధంతిని జిల్లాలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఊరూవాడల్లో ఉన్న ఆయన విగ్రహాలకు పాలాభిషేకం చేశారు. పేదలకు అన్నదానం చేసి, వస్త్రాలను పంపిణీ చేశారు. యువత ముందుకు వచ్చి రక్తదానం చేసింది. ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న వైఎస్సార్ అభిమానులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు రాజ శేఖరరెడ్డి ఆశయ సాధనకు పునరంకిత మవుతామని  ప్రతిన బూనారు.
 
 సాక్షి, గుంటూరు: దివంగత మహానేత డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఐదవ వర్ధంతి కార్యక్రమాలు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు నిర్వహించారు.  గుంటూరు నగరంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్, నగర అధ్యక్షుడు లేళ్ళ అప్పిరెడ్డి, అధికార ప్రతినిధి అంబటి రాంబాబు వైఎస్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కార్యక్రమంలో వనమా బాలవజ్రబాబు, కొత్తా చిన్నపరెడ్డి, బండారు సాయిబాబు, హనుమంతునాయక్, సయ్యద్ మొహమ్మద్, దేవళ్ళ రేవతి, పోలూరు వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.  
 
 గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని వార్డుల్లో ఎమ్మెల్యే మొహమ్మద్ ముస్తఫా సోదరుడు కర్నుమా, నసీర్ అహ్మద్, గులాం రసూల్, చాంద్‌బాషా, కరీముల్లా తదితరులు వైఎస్ వర్ధంతి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో నగర అధ్యక్షుడు లేళ్ళ అప్పిరెడ్డి ఆధ్వర్యంలో అనేక ప్రాంతాల్లో వైఎస్ విగ్రహాలకు క్షీరాభిషేకాలు, అన్నదానాలు చేశారు. పేదలకు పండ్లు, పాలు పంచి పెట్టారు.
 
 మాచర్ల నియోజకవర్గంలో  ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడు వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలోని పలు ప్రాంతాల్లో వైఎస్ విగ్రహాలకు క్షీరాభిషేకం చేశారు. పార్టీ కార్యాలయం వద్ద నుంచి రింగ్‌రోడ్డు సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అన్నదానాలు చేశారు. చిలకలూరిపేట నియోజకవర్గంలో జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ ఆధ్వర్యంలో  అనేక చోట్ల అన్నదాన కార్యక్రమాలు, పండ్లు, పాలు పంపిణీ చేశారు. యడ్లపాడు మండలం జగ్గాపురంలో  వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. గురజాల నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జంగా కృష్ణమూర్తి ఆధ్వర్యంలో అన్ని మండలాల్లో వైఎస్ వర్ధంతి  కార్యక్రమాలు, సభలు నిర్వహించారు. సత్తెనపల్లి నియోజకవర్గంలో రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలోనూ, పట్టణంలోని పలు చోట్ల వైఎస్ వర్ధంతి కార్యక్రమాలు జరిగాయి. వైఎస్ విగ్రహాలకు పాలాభిషేకం, రోగులకు పండ్లు, విద్యార్థులకు పుస్తకాల పంపిణీ చేశారు. గుడిపూడి గ్రామంలో వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.
 
 పెదకూరపాడు నియోజకవర్గంలో బొల్లా బ్రహ్మనాయుడు ఆధ్వర్యంలో పెదకూరపాడు, అచ్చంపేటలలో వైఎస్ విగ్రహాల వద్ద ఘనంగా నివాళులు అర్పించారు. 75 త్యాళ్ళూరులో భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.  నరసరావుపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి సతీమణి డాక్టర్ సుస్మితారెడ్డి ఆధ్వర్యంలో రోగులకు పండ్లు పంపిణీ, అనాథాశ్రమంలోని విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు.
 
 పొన్నూరు నియోజకవర్గంలో పార్టీ కన్వీనర్ రావి వెంకటరమణ ఆధ్వర్యంలో పట్టణంలోని అనేక ప్రాంతాల్లో వైఎస్సార్‌కు ఘనంగా నివాళులు అర్పించారు. వేమూరు మండలంలో వైఎస్సార్‌సీపీ జిల్లా మహిళా విభాగం కన్వీనర్ దాది వెంకటలక్ష్మీరాజ్యం ఆధ్వర్యంలో  రోగులకు పండ్లు పంపిణీ చేశారు.  తెనాలి నియోజకవర్గంలో అన్నాబత్తుని శివకుమార్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమాలు, పులిహోర, రోగులకు పండ్లు, పాలు పంపిణీ చేశారు.
 
 మంగళగిరి నియోజకవర్గంలో నిడమర్రులో ఎన్నారై భీమిరెడ్డి ప్రతాప్‌రెడ్డి ఏర్పాటుచేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఎంపీపీ పచ్చల రత్నకుమారి ప్రారంభించారు. రేపల్లె నియోజకవర్గంలో మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ సోదరుడు హరినాథ్‌బాబు ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో, పట్టణంలోని అనేక ప్రాంతాల్లో వైఎస్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. రోగులకు పండ్లు, పాలు పంపిణీ చేశారు.  వీటితోపాటు జిల్లాలోని వినుకొండ, ప్రత్తిపాడు, బాపట్ల, నియోజకవర్గాల్లో మండల కన్వీనర్లు, జెడ్పీటీసీ, ఎంపీపీలు వైఎస్ వర్ధంతి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
 

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌