amp pages | Sakshi

మహిళపై హత్యాయత్నం?

Published on Thu, 08/21/2014 - 01:02

  • కొడవటిపూడిలో కలకలం
  •  ముగ్గురిని బంధించిన గ్రామస్తులు
  •  వీరిని ప్రోత్సహించారన్న ఆరోపణపై మరో మహిళ అరెస్టు
  •  పలు సెక్షన్ల కింద కేసుల నమోదు
  • కోటవురట్ల : కొడవటిపూడిలో ఓ మహిళపై హత్యాయత్నం జరిగిందన్న ఆరోపణలు కలక లం సృష్టించాయి. గ్రామస్తులు నిందితులను బంధించడంతో పోలీసులు వచ్చి వారిని విడిపించాలని ప్రయత్నించినా ప్రతిఘటించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. చివరికి బాధితురాలికి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో వివాదం సద్దుమణిగింది.

    బాధితురాలు, గ్రామస్తుల కథనం ప్రకారం...మండలంలోని కొడవటిపూడిలో మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో ఇద్దరు మహిళలతోపాటు మరో వక్తి వ చ్చి తలుపు తట్టారు. సాయిలక్ష్మి తలుపు తెరవగానే ఇద్దరు మహిళలు ఆమె మెడకు చున్నీ విసిరి దగ్గరకు లాగారు. ఇంతలో సాయిలక్ష్మి ఇద్దరు పిల్లలు కేకలు వేయడంతో చుట్టుపక్కలవారు వచ్చి ఆ ముగ్గురినీ పట్టుకుని రామాలయంలో బంధించారు.

    సమాచారం అందుకున్న కోటవురట్ల పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి ముగ్గురినీ విడిచిపెట్టాలని కోరినా గ్రామస్తులు ససేమిరా అన్నారు. దీంతో బుధవారం ఉదయం నర్సీపట్నం రూరల్ సీఐ దాశరథి, ఇద్దరు ఎస్‌లతో వచ్చి బందీల వివరాలను ఆరా తీశారు.  వారిలో సంతాభక్తల అనూష (జంగారెడ్డిగూడెం), కర్రిఆనంద మోహనరావు (బిల్లనందూరు, కోటనందూరు మండలం), ఎం.అనూష (మల్లవల్లి, కృష్ణాజిల్లా) ఉండగా, వీరు ముగ్గు రూ పాయకరావుపేట జీఎస్‌ఎస్ సంస్థలో పనిచేస్తున్నట్లు నిర్ధారించారు.

    నిందితులను పోలీసు స్టేషనుకు తీసుకెళ్తామంటూ జీపులో ఎక్కించేందుకు ప్రయత్నించినా ప్రతిఘటించారు. పరిస్థితి అదుపుతప్పుతున్నట్లు గుర్తించిన ఆయన ఏఎస్పీ విశాల్‌గున్నికి సమాచారం అందించడంతో, ఆయన ఆదేశాల మేరకు కొత్తకోట సీఐ వర్మ సహా మరో నలుగురు ఎస్‌ఐలు, పోలీసు బలగాలు గ్రామానికి తరలివచ్చారు. బందీలను విడిచిపెట్టేందుకు గ్రామస్తులు ఒప్పుకోకపోవడంతో గ్రామపెద్దలతో చర్చించారు. చివరకు బాధితురాలికి న్యాయం చేస్తామన్న హామీతో బందీలను పోలీసులకు అప్పగించారు. సీఐ దాశరథి మాట్లాడుతూ ముగ్గురిపైనా హత్యాయత్నం, అత్యాచార యత్నం, కిడ్నాప్ నేరాలపై కేసు నమోదు చేస్తామని చెప్పారు.

    సాయం చేయాలని వచ్చాం: నిందితులు
     
    సాయిలక్ష్మిపై హత్యాయత్నం చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆనందమోహనరావు, ఎం. అనూష, ఎస్.అనూష మాత్రం, తాము పాయకరావుపేటలోని జీఎస్‌ఎస్ సంస్థలో పని చేస్తున్నామని, సాయిలక్ష్మికి సాయం చేయాలనే తలంపుతో ఆమె వద్దకు వస్తే తప్పుగా అర్థం చేసుకున్నారని పోలీసుల ఎదుట వాపోయారు. ఆనందరావు అన్యాయం చేశాడంటూ సాయిలక్ష్మి పోలీ సులను ఆశ్రయించిన నేపథ్యంలో వివాదం పెద్దది కాకుండా చర్చించాలన్న ఉద్దేశంతో వచ్చామే తప్ప, ఉపాధి కోసం చిరు ఉద్యోగాలు చేసే తాము హత్యచేయాలని మాత్రం రాలేదని చెప్పారు.

    విచారణ అనంతరం ముగ్గురు నిందితులతో పాటు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆనందరావు అక్క బావిశెట్టి లక్ష్మిని కూడా రప్పించి అరెస్టు చేసి కోటవురట్ల పోలీసు స్టేషన్‌కు తరలించారు. బాధితురాలు సాయిలక్ష్మికి, బావిశెట్టి ఆనందరావులకు వివాహం చేస్తామని సీఐ దాశరథి హామీ ఇచ్చారు. కేసు పరిష్కారం కోసం పోలీసులు జరిపిన చర్చల్లో ఎమ్మెల్యే అనిత భర్త శివ, సర్పం చ్ బాలేపల్లి సత్తిబాబు, ఎంపీటీసీ సభ్యుడుపైల రమేష్, లాలం కాశీనాయుడు పాల్గొన్నారు.
     
    తెర వెనుక కథ ఇదీ!

    సాయిలక్ష్మి, అదే గ్రామానికి చెందిన ఆనందరావు 2000లో ప్రేమించుకున్నారు. వారి వివాహానికి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. దీంతో 2003లో సాయిలక్ష్మి రాజమండ్రికి చెందిన మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అయితే పెళ్లైన వారం రోజుల్లోనే ప్రియుడు ఆనందరావు సాయిలక్ష్మిని తనవద్దకు తీసుకొచ్చేశా డు. అనంతరం సాయిలక్ష్మి భర్తకు విడాకులు ఇచ్చింది. ఆనందరావు ఓ గుళ్లో తాళికట్టి, అదే గ్రామంలో కాపురం పెట్టాడు. వారికి ఇద్దరు అమ్మాయిలు పుట్టారు.

    రేషన్ కార్డు, ఆధార్‌కార్డు అ న్నిటిలో నూ ఓ కుటుంబంగానే నమోదైంది.అయితే ఇటీవల ‘నీకూ నాకూ ఏ సంబంధం లేద’ంటూ ఆనందరావు సాయిలక్ష్మిని తరిమేశాడు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో ఆనందరావుకు అక్క అయిన బావిశెట్టి లక్ష్మి ఆమెకు సన్నిహితుడైన పాయకరావుపేట గ్రామ స్వరాజ్య సమితి(జీఎస్‌ఎస్) ప్రతినిధితో  కలిసి తనపై పై ముగ్గురిని ఉసిగొల్పి హత్యాయత్నానికి ప్రయత్నించిందని బాధితురాలు సాయిలక్ష్మి పోలీసుల విచారణ సందర్భంగా ఆరోపించింది.
     

Videos

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

మన అభ్యర్థులు వీరే..భారీ మెజారిటీతో గెలిపించండి

విలవిల లాడిన వృద్ధులు.. 30 మందికిపైగా మృతి..!

Aditi Rao Hydari: సిద్దార్థ్ తో ఎంగేజ్మెంట్

ఇది క్లాస్ వార్..దద్దరిల్లిన నరసాపురం

ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ 31 మూవీ క్రేజీ అప్డేట్

అవ్వా, తాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్ రియాక్షన్..

నరసాపురం జనసంద్రం

రాష్ట్రంలో ముగ్గురు మూర్ఖులు ఉన్నారు: నాగార్జున యాదవ్

చంద్రబాబుపై ఫైర్

పవన్ కళ్యాణ్ ఊగిపోయే స్పీచ్ కి పిఠాపురం శేషు కుమార్ స్ట్రాంగ్ కౌంటర్

ఏపీలో వైఎస్ఆర్ సీపీకి మద్దతు ప్రకటించిన ఆల్ ఇండియా బ్రాహ్మణ ఫెడరేషన్

నా కొడుకు కోసం బందరులో ఎక్కడైనా అడుగు.. ఒక్కటే సమాధానం

మంగళగిరిలో నారా లోకేష్ మొహం చూపించుకోలేకపోతున్నాడు..!

పవన్ కళ్యాణ్ ని వంగా గీత ఒక్క మాట కూడా అనలేదు.. అది ఆమె సంస్కారం..!

Watch Live: నరసాపురంలో సీఎం జగన్ ప్రచార సభ

సీదిరి అప్పలరాజు స్పెషల్ ఇంటర్వ్యూ

వైఎస్ భారతి ఎన్నికల ప్రచారం

వైఎస్ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట

Photos

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)