amp pages | Sakshi

ఈ నీరు.. శివారుకు చేరేనా! దాహార్తి తీరేనా?

Published on Sun, 02/14/2016 - 03:31

పులిచింతలకు 2.8 టీఎంసీలు చేరిక
ప్రకాశం బ్యారేజీ వద్ద పెరుగుతున్న నీటిమట్టం
కాల్వలకు కొద్దికొద్దిగా నీటి విడుదల
నాలుగు రోజుల్లో చెరువులకు తాగునీరు
శివారుకు చేరికపై అనుమానాలు

 
 
 సాక్షి, విజయవాడ : కృష్ణా డెల్టాలో చెరువులు అడుగంటడంతో ప్రజల దాహార్తిని తీర్చేందుకు కాలువలకు నీటిని విడుదల చేస్తున్నారు. నాలుగు టీఎంసీలు విడుదల చేస్తామని అంగీకరించిన కృష్ణా యాజమాన్య బోర్డు ఆ మేరకు శ్రీశైలం, నాగార్జున సాగర్ నుంచి నీటిని విడుదల చేస్తోంది. ఆ నీరు ఇప్పుడిప్పుడే ప్రకాశం బ్యారేజీకి చేరుతోంది. ఇరిగేషన్ అధికారులు ఆ నీటిని కొద్దికొద్దిగా కాలువలకు వదులుతున్నారు. చెరువులకు నీరందే సరికి మరో నాలుగైదు రోజులు పడుతుందని చెబుతున్నారు. అయితే ఈ నీటిలో శివారుకు ఎంత చేరుతుందనే అనుమానాలు ఆ ప్రాంతాల్లో వ్యక్తమవుతున్నాయి. పులిచింతలలో, ప్రకాశం బ్యారేజీలో నిల్వలు పోను విడుదల చేసే నీటిలో చెత్తా చెదారం వల్ల కొంత వృథాగా పోతుందని, మరికొంత ఇంకిపోతుందని చెబుతున్నారు. మిగిలిన నీటిలో అక్రమ మళ్లింపులు ఉంటాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


 పులిచింతల వద్దకు 2.8 టీఎంసీల నీరు...
ఎగువ నుంచి విడుదల చేసిన నీరు శనివారానికి పులిచింతల వద్దకు 2.8 టీఎంసీలు చేరింది. ఇందులో 1.2 టీఎంసీలు ప్రకాశం బ్యారేజీకి వదిలారు. ఇప్పటివరకు ప్రకాశం బ్యారేజీ వద్ద 8.2 అడుగుల నీరు ఉండగా, ప్రస్తుతం వస్తున్న నీటితో 10.6 అడుగులకు చేరింది. బ్యారేజీ వద్ద 12 అడుగుల మేరకు నీటిని నిల్వ చేసి మిగిలినది కాల్వల ద్వారా చెరువులకు వదిలిపెట్టాలని అధికారులు నిర్ణయించారు. ఇప్పటికే ప్రకాశం బ్యారేజీలో కొంత నీరు చేరడంతో కొద్దికొద్దిగా కాల్వలకు వదులుతున్నారు.

 కాల్వలకు 3,212 క్యూసెక్కుల నీరు...
కృష్ణాడెల్టా పరిధిలోని కాల్వలకు 3,212 క్యూసెక్కుల నీరు వదులుతున్నామని ఇరిగేషన్ అధికారులు తెలిపారు. రైవస్ కాల్వకు 503 క్యూసెక్కులు, ఏలూరు కాల్వకు 511, బందరు కాల్వలకు 152, అవనిగడ్డ, నాగాయలంక వైపు వెళ్లే కేఈబీ కాల్వకు 500, తెనాలి వైపు వెళ్లే కేడబ్ల్యూ కాల్వకు 1,516 , గుంటూరు చానల్‌కు 30 క్యూసెక్కుల నీరు వదులుతున్నారు. కాల్వల ద్వారా వదులుతున్న నీటితో జిల్లాలోని 370 చెరువులకు, బందరు, గుడివాడ మున్సిపాలిటీలకు నీరు ఇవ్వనున్నారు. పులిచింతల నుంచి వస్తున్న నీటి నుంచే విజయవాడ కార్పొరేషన్‌తో పాటు, ఎన్‌టీటీపీఎస్ అవసరాలకు ఉపయోగిస్తున్నారు. విడుదల చేసిన నీటిలో దాదాపు ఐదువేల క్యూసెక్కుల మేరకు కాలువల్లో పేరుకుపోయిన మురుగు, చెత్తాచెదారం పారదోలేందుకు పోతుందని అధికారులు చెబుతున్నారు. నీరంతా వృథా కాకుండా ఉండటం కోసం తొలుత బందరు కాల్వకు 500 క్యూసెక్కులు వదిలిన అధికారులు.. ప్రస్తుతం 152 క్యూసెక్కులకు తగ్గించారు.

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)