amp pages | Sakshi

విజయనగరం ఇక కార్పొరేషన్‌

Published on Wed, 07/03/2019 - 08:05

సాక్షి, విజయనగరం : విద్యలకు నిలయం.. కళలకు కాణాచి... సాంస్కృతిక రాజధానిగా పేరుగాంచిన విజయనగరం కార్పొరేషన్‌గా రూపాంతరం చెందింది. మంగళవారం సాయంత్రం 5 గంటలతో అంటే ప్రభుత్వ పని వేళలు ముగిసినప్పటి నుంచి  టీడీపీ పాలకవర్గం పదవీకాలం ముగియటంతో 2016 ఫిబ్రవరి 12న ప్రభుత్వం జారీ చేసిన మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఉత్తర్వులు అమల్లోకి వచ్చేశాయి. బుధవారం నుంచి పూర్తి స్థాయిలో కార్పొరేషన్‌ హోదాలో విజయనగరంలో పాలన సాగనుంది. ఓ వైపు పాలకవర్గం పదవీ కాలం ముగియటం... మరో వైపు కార్పొరేషన్‌గా రూపాంతరం చెందిన విజయనగరానికి ప్రత్యేకాధికారిగా జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎం.హరిజవహర్‌లాల్‌ నియమితులయ్యారు. 

పదవీకాంక్షతో నాడు అడ్డు
వాస్తవానికి విజయనగరం పట్టణం 2015 సంవత్సరంలోనే కార్పొరేషన్‌ హోదా దక్కించుకుంది. 2015 సంవత్సరం డిసెంబర్‌ 10వ తేదీన కార్పొరేషన్‌ స్థాయిని అందుకోగా.. అప్పటి వరకు మున్సిపల్‌ కార్యాలయం బోర్డును సైతం  మున్సిపల్‌ కార్పొరేషన్‌గా మార్చారు. కార్పొరేషన్‌ స్థాయి కమిషనర్‌గా జి.నాగరాజును నియమించారు. అయితే ఈ ఉత్తర్వులు కేవలం రెండు నెలలు మాత్రమే అమలయ్యాయి.  2014లో ఎన్నికైన టీడీపీ పాలకవర్గం ఈ ఉత్తర్వుల కారణంగా అధికారానికి దూరమవుతుంది. స్పందించిన స్థానిక అధికార పార్టీ నేతలు అప్పట్లో ఆ ఉత్తర్వులను అభియన్స్‌లో పెట్టించారు. 2016 సంవత్సరం ఫిబ్రవరి 12 నుంచి మున్సిపాలిటీగా కొనసాగించగా... కౌన్సిల్‌ పదవీ కాలం ముగియగానే అభియన్స్‌లో ఉంచి మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయంటూ జీఓ నంబర్‌ 36ను జారీ చేసింది. తాజాగా  కౌన్సిల్‌ పాలకవర్గం ముగియటంతో కార్పొరేషన్‌గా పాలన సాగించేందుకు అధికార యంత్రాంగం చర్యలు ప్రారంభించనుంది. విజయనగరం మున్సిపాలిటీ 1888 ఏర్పడింది. 1998 నాటికి సెలక్షన్‌ గ్రేడ్‌ మున్సిపాలిటీగా మారింది. 57.01 చదరపు కిలోమీటర్ల పరిధిలో మున్సిపాలిటీ విస్తరించి ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం 2,44,598 మంది జనాభా ఉన్నారు. 

ప్రత్యేకాధికారిగా కలెక్టర్‌
విజయనగరం మున్సిపల్‌ కార్పొరేషన్‌ ప్రత్యేకాధికారిగా జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎం.హరిజవహర్‌లాల్‌ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి జె.శ్యామలరావు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. విజయనగరం మున్సిపల్‌ కార్పొరేషన్‌గా  రూపొంతరం చెందిన రోజు నుంచి  ప్రత్యేకాధికారి పాలన ప్రారంభం కావటం విశేషం. ఐదేళ్ల టీడీపీ పాలనలో అభివృద్ధి అంతంతమాత్రంగానే జరిగింది. రూ. కోట్లు నిధులున్నా సద్వినియోగం చేసుకోవడంలో విఫలమైంది. అధికారిక లెక్కల ప్రకారం ఐదేళ్లలో 2164 అభివృద్ధి పనులు చేపట్టేందుకు రూ276.43 కోట్లు కేటాయించినా రూ. 85.83 కోట్లతో 1037 పనులు మాత్రమే పూర్తి చేయగలిగారు. అసంపూర్తి పనులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. తాజాగా పాలకవర్గం పదవీకాలం ముగియటం , మున్సిపల్‌ కార్పొరేషన్‌గా హోదా దక్కించుకోవటం, అదే సమయంలో జిల్లా కలెక్టర్‌ ప్రత్యేకాధికారిగా నియమితులు కావడంతో అభివృద్ధి సాధించగలదని నగరవాసులు ఆకాంక్షిస్తున్నారు. 

Videos

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

మన అభ్యర్థులు వీరే..భారీ మెజారిటీతో గెలిపించండి

విలవిల లాడిన వృద్ధులు.. 30 మందికిపైగా మృతి..!

Aditi Rao Hydari: సిద్దార్థ్ తో ఎంగేజ్మెంట్

ఇది క్లాస్ వార్..దద్దరిల్లిన నరసాపురం

ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ 31 మూవీ క్రేజీ అప్డేట్

అవ్వా, తాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్ రియాక్షన్..

నరసాపురం జనసంద్రం

రాష్ట్రంలో ముగ్గురు మూర్ఖులు ఉన్నారు: నాగార్జున యాదవ్

చంద్రబాబుపై ఫైర్

Photos

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)