వైద్యుడి మిస్సింగ్ కేసు విషాదాంతం

Published on Wed, 10/29/2014 - 03:29

తెనాలి/దుగ్గిరాల/హైదారాబాద్: అదృశ్యమయిన వైద్యుడు కొసరాజు జయచంద్రన్ కేసు విషాదాంతమయింది. గుంటూరుకు చెందిన  జయ చంద్రన్ 2012లో తెనాలికి చెందిన యువతిని రెండో వివాహం చేసుకున్నారు. వీరికి ఏడాది కుమారుడు కార్తీక్(1) ఉన్నాడు. హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో పనిచేస్తున్న ఆయన ఈనెల 18న తెనాలికి బయలుదేరారు. రాత్రి 11 గంటల ప్రాంతంలో మరో గంటలో ఇంటికి వస్తానంటూ తల్లికి ఫోనులో చె ప్పాడు. మర్నాడు వరకు రాకపోవడంతో కుటుం బ సభ్యులు తెనాలి టూ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పలు కోణాల్లో దర్యాప్తు చేపట్టిన పోలీసులు అతడి స్నేహితులనూ అనుమానించి విచారణ చేశారు.
 
 వారు చెప్పిన వివరాల ప్రకారం సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా విజయవాడ-తెనాలి మార్గంలో జయచంద్రన్ అదృశ్యమయ్యాడని నిర్ధారణకు వచ్చారు. గాలింపు చేపట్టిన పోలీసులు దుగ్గిరాల సీసీఎల్ ఫ్యాక్టరీ ఎదుట బకింగ్‌హాం కాల్వలో ఈనెల 27న కారును గుర్తించారు. దుగ్గిరాల పాత లాకు సమీపంలోని కృష్ణా, పశ్చిమ ప్రధాన కాలువలో మంగళవారం జయచంద్రన్ మృతదేహం లభ్యమైంది. డీఎస్పీ టి.పి.విఠలేశ్వర్ చెప్పిన వివరాల ప్రకారం కారు దొరికిన ప్రదేశానికి రెండు కిలోమీటర్ల మృతదేహం లభ్య మైంది. మృతదేహానికి పంచనామా చేసి అక్కడే పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ప్రమాదం వల్లే జయచంద్రన్ మృతి చెందాడని నిర్ధారణకు వచ్చినట్టు డీఎస్పీ పేర్కొన్నారు. జయచంద్రన్ మృతి విషయం తెలుసుకున్న గాంధీ వైద్యులు, జూడాలు  సంతా ప సమావేశాన్ని నిర్వహించి, ఆయన  చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ