amp pages | Sakshi

సిమెంట్ ముసుగులో అక్రమ రవాణా

Published on Wed, 09/02/2015 - 04:09

పట్ట విప్పి చూడ ఇసుక ఉండు..
 
 సాక్షి కడప/పులివెందుల :  రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టీడీపీ నేతలు అక్రమ సంపాదనకు తెగబడుతున్నారు. ఆదాయం వస్తుందంటే చాలు ఎక్కడైనా దోచుకోవడానికి సిద్ధపడుతున్నారు. ఎర్రచందనం, ఇసుక లాంటి ప్రకృతి సంపదను కొల్లగొట్టేందుకు ప్రణాళికలు రూపొందించుకున్నారు.  అడ్డంగా దొరికిపోయినప్పుడు తేలు కుట్టిన దొంగల్లా వ్యవహరిస్తూ ఆనక దర్జా ఒలకబోస్తున్నారు. వీరి దందాను ఎవరైనా అడ్డుకుంటే సామ, దాన, భేద, దండోపాయాలు ప్రదర్శించడం జిల్లాలో నిత్య కృత్యంగా మారింది. ప్రస్తుతం చెయ్యేరు, పాపాఘ్ని, పెన్నా నదుల నుంచి పెద్ద ఎత్తున ఇసుకను బెంగుళూరు, చెన్నై, ప్రకాశం జిల్లాలకు తరలిస్తూ అందినకాడికి దోచుకుంటున్నారు.  

  పంథా మార్చిన నేతలు
 జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి ఇసుక తరలింపులో పలువురు కొత్త పంథాను అవలంభిస్తున్నారు. ఇంతవరకు ట్రాక్టర్లు, టిప్పర్ల ద్వారా తరలిస్తూ వచ్చిన అక్రమార్కులు.. ప్రస్తుతం 18 టైర్ల భారీ లారీల్లో సిమెంటు లోడు తరహాలో టార్ఫాలిన్ పట్టాలు కట్టి.. గుట్టు చప్పుడు కాకుండా సరిహద్దులు దాటిస్తున్నారు. సుమారు 30 టన్నుల సామర్థ్యం కలిగిన ఈ లారీల్లో ఏకంగా 50 టన్నుల మేర ఇసుకను నింపి తరలిస్తున్నారు.

కొండాపురం నుంచి ఏపీ04టీటీ 6939, ఏపీ04టీటీ 7668 అనే నెంబర్లు గల లారీలలో బెంగళూరుకు ఇసుక తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో ఆదివారం అర్ధరాత్రి పులివెందుల జేఎన్‌టీయూ వద్ద ఎస్‌ఐ వెంకటనాయుడు తన సిబ్బందితో కలిసి పట్టుకున్నారు. సోమవారం రెవెన్యూ అధికారులకు అప్పగించారు.  ఈ అక్రమ రవాణా టీడీపీ నేతల పనేనని తెలిసింది. ఈ లారీలు కూడా కొండాపురానికి చెందిన ఓ టీడీపీ నేతవని సమాచారం. పోలీసులు పట్టుకున్న లారీలను విడిచి పెట్టాలని పులివెందుల టీడీపీ నేతలు స్థానిక పోలీసులపై తీవ్ర ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది. లారీల్లో ఇసుకను తరలిస్తూ... ఆటోలలో ఇసుకను తీసుకెళుతున్నట్లు చలానాలు చూపించినట్లు సమాచారం. ఈ లారీల వెనుక మరో రెండు లారీలు వస్తుండగా.. పట్టుబడిన లారీల్లోని వారు ఇచ్చిన సమాచారంతో ఆ లారీలు వెనక్కి వెళ్లినట్లు తెలిసింది.

Videos

మ్యానిఫెస్టో ని ఇంటింటికీ తీసుకువెళ్లటమే జగన్ కోసం సిద్ధం

చంద్రబాబు బ్యాచ్ కుట్రలతో పెన్షన్ దారులకు మరిన్ని కష్టాలు

ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై కూటమి అసత్యపు ప్రచారం చేస్తోంది

అందుకు ఏదైనా చికిత్స చేయించుకున్నారా?

చంద్రబాబుపై జగన్ మోహన్ రావు ఫైర్

Election Track: గెలుపు ఎవరిది ?..రాజమహేంద్రవరం ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్

కార్మికులను ఆదుకున్నది సీఎం జగన్ మాత్రమే

దేవర కోసం దసరా రేస్ నుంచి వెనక్కి తగ్గిన సినిమాలు

మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన వైఎస్సార్ సీపీ

బాలీవుడ్ లో మనోడి క్రేజ్ మామూలుగా లేదుగా

ప్రచారంలో దూసుకుపోతున్న అరకు ఎంపీ అభ్యర్థి తనూజ రాణి

పెన్షన్ పంపిణీ కష్టాలపై వృద్ధుల రియాక్షన్..

ఎన్నికల వేళ భారీగా పట్టుబడుతున్న నగదు

ఇచ్చేవాడినే కానీ..లాక్కునేవాణ్ని కాదు..

పవన్ పై వెల్లంపల్లి శ్రీనివాస్ ఫైర్

జనసేనపై పవన్ సంచలన వ్యాఖ్యలు

టీడీపీ మద్యం ధ్వంసం

ఫోన్ ట్యాపింగ్ కేసులో రాధాకిషన్ బెయిల్ పై నేడు తీర్పు

మహాసేన రాజేష్ కు ఘోర అవమానం

Photos

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)