amp pages | Sakshi

కన్నీటి దిగుబడి

Published on Wed, 09/02/2015 - 04:34

200 ఎకరాల్లో పత్తిపంట తొలగింపు
కన్నీరు పెట్టిన రైతులు
రూ.15 లక్షల పెట్టుబడి నష్టం

 
 గుత్ : ఖరీఫ్‌లో పత్తి సాగుచేసిన రైతుకు కన్నీటి ధారలే దిగుబడులు అయ్యాయి. వరుణుడిపై భారంతో అరకొర వర్షాలకు విత్తనం వేసి ఎదురు చూసిన రైతును వరుణుడు కరుణించలేదు. మధ్యలో వర్షం పడితే మొలచిన మొక్కలకు తోడు మధ్య మధ్యలో విత్తనం పెడితే  పెట్టుబడులు అయినా దక్కుతాయని ఆశించారు. అయితే వారి ఆశలు అడియాశలయ్యాయి. దీంతో చేసేది లేక పత్తిమొక్కలను ట్రాక్టర్లతో పాచేస్తూ కన్నీటిని దిగమింగుకుంటున్నారు.

 ముఖ్యంగా గుత్తి మండలంలోని మామూడూరు గ్రామంలో సుమారు రెండు వందల మంది ఎనిమిది వందల ఎకరాల్లో పత్తిపంటను సాగు చేశారు. రెండు నెలలైనా కనీసం పూత కూడా రాలేదు. దీంతో పంటను తొలగించడం తప్ప మరో మార్గం కనిపించలేదు. రైతులు మహేశ్వరరెడ్డి, కిరణ్‌కుమార్‌రెడ్డి, కమలాకర్, కేశవరెడ్డి, సాంబశివారెడ్డి, రామచంద్రారెడ్డి, రమణ, చియానందరెడ్డి తదితరులు ఒక్క సోమవారం రోజే సుమారు 200 ఎకరాల్లో పత్తిపంటను తొలగించారు.

ఈ సందర్భంగా ఆ రైతులు మాట్లాడుతూ ఇంతటి ఘోరమైన, దారుణమైన పరిస్థితులు తామెప్పుడూ చూడలేదన్నారు. 200 ఎకరాల్లో సాగు చేయడానికి సుమారు రూ.15 లక్షల వరకు వెచ్చించారు. అదే విధంగా మాముడూరు, ధ ర్మాపురం గ్రామాల్లో వేరుశగన పంట కూడా పూర్తిగా ఎండిపోయింది. రెండు రోజుల్లో పంటను తొలగించనున్నట్లు రైతులు చెప్పారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయాధికారి వెంకటరాముడు మాట్లాడుతూ మండల వ్యాప్తంగా ఈసారి వర్షం పాతం చాలా తక్కువగా నమోదు అయిందన్నారు. దీంతో రైతులు సాగు చేసిన వేరుశగన, పత్తి, కంది, కొర్ర, పెసర, ఆముదం పంటలు పూర్తిగా ఎండిపోతున్నాయన్నారు.

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)